నాటి నుంచి ఆ ఉత్సవాన్ని ‘జెండా ఉత్సవం’ అని కూడా పేర్కొనసాగారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

 

దారిలో అనేకులు బాబాకి నమస్కరిస్తోంటే వారిని ఆశీర్వదిస్తూ ఉప్పు నీటి బావి దగ్గరకి చేరుకున్నారు బాబా.

నూతిలోకి చూశారు. బావి నిండుగా నీరుంది. అద్దంలా ఉంది. అందులో తన ప్రతిబింబం చూసుకున్నారు బాబా. ‘‘ఈ బావినీరు మంచినీరయితే రోజుకో ఉత్సవం చేయొచ్చు బాబా. కాని, మంచి నీరు కాదే’’ బాధపడ్డాడు శ్యామా.

‘‘కాదని ఎవరన్నారు?’’‘‘అంతా అంటున్నారు.’’ చెప్పాడు శ్యామా.‘‘నేను కూడా ఓసారి తాగాను. అబ్బో, ఒకటే ఉప్పు.’’ అన్నాడు అంతలోనే.‘‘అవునా?’’ నవ్వారు బాబా.

బావిని ఆనుకుని ఉన్న మందార చెట్టుని చూశారు. పచ్చగా బాగుంది చెట్టు. పువ్వులతో విచ్చుకుని ఉంది. పువ్వులు కూడా చూడముచ్చటగా ఉన్నాయి.

ఓ నాలుగు మందార పువ్వుల్ని కోశారు బాబా. ఓసారి చూసి, వాటిని బావిలో వేశారు. నీటిలో పువ్వులు చెరువులో కలువల్లా నిలిచాయి.‘‘నీరు చేది, తాగి చూడండి.’’ చెప్పారు బాబా.‘‘శ్యామా! తాగి చూసి నువ్వే రుచి చెప్పాలి.’’ అన్నారు.

‘‘అలాగే’’ అన్నాడు శ్యామా. బావిలోని నీటిని చేదాడు. దోసిలి పట్టి నీటిని తాగాడు. చిత్రం! ఉప్పదనమే లేదు. తియ్యగా కొబ్బరినీళ్ళలా అనిపించాయి.

‘‘బాబా! నీరు బలే బాగుంది. తియ్యగా ఉన్నాయి. అమృతం! అమృతం తాగుతున్నట్టుగా ఉంది.’’ సంబరపడ్డాడు శ్యామా.

‘‘ఉత్సవానికిక ఏ ఇబ్బందీ లేనట్టే కదా’’ అడిగారు బాబా. లేదన్నారంతా ముక్తకంఠంగా.‘‘మరికనేం? హాయిగా ఉత్సవాన్ని జరిపించండి.’’ అన్నారు బాబా.

 ద్వారకామాయికి దారి తీశారు.ఉత్సవానికి గుర్తుగా గోపాలరావు గుండు, దామూ కలసి ఓ జెండాని తయారు చేశారు. నానాసాహెబ్‌ కూడా మరో జెండాని తయారు చేశాడు. నగిషీలతో బాగుందది.

ఆ రెండు జెండాలనూ బాబా అనుమతితో ద్వారకామాయి రెండు మూలలా ఎగురవేశారు. నాటి నుంచి ఆ ఉత్సవాన్ని ‘జెండా ఉత్సవం’ అని కూడా పేర్కొనసాగారు.పెద్ద ఎత్తున ఉత్సవాన్ని నిర్వహించారు.

బాణాసంచా కాల్చారు. గులాం, చందనం చల్లుకున్నారంతా. ఎవరి నోటంటా విన్నా సాయి నామస్మరణే! ఎక్కడ చూసినా జయజయధ్వానాలే!శ్రీసాయినాథ్‌ మహారాజ్‌కీ జైనినాదంతో షిరిడీ మారుమ్రోగిపోయింది.

బాబాకి చందనం పూసి, అయన పాదాలకు నమస్కరించారు భక్తులు. బాబా ఆశీర్వాదంతో ఆనందాల్ని అందుకున్నారు.కొంత కాలం గడిచింది.

కొంత కాలం గడిచింది.1911లో ఉరుసు ఉత్సవం రోజునే శ్రీరామనవమి కూడా జరపాల్సి వచ్చింది. రెండు పండగలూ అలా ఒకే రోజున పడ్డాయి.

‘‘సాయంత్రం ఉరుసు ఉత్సవం జరుపుకుందాం. పొద్దున శ్రీరామనవమి జరుపుకుందాం. మీరేమంటారు?’’ బాబాని అడిగాడు భీష్మ.

‘‘ఏమంటాను, ఆనందిస్తాను. రాం, రహీం ఇద్దరూ ఒక్కటేనని, ఈ రకంగా నిరూపించమంటాను. పొద్దున రాముడి పూజ. రాత్రి రహీం ఊరేగింపు. బాగుంది. కానివ్వండి.’’ అన్నారు బాబా. నవ్వారు.

ఆనాటి నుంచి పగలు శ్రీరామనవమి నిర్వహించి, రాత్రిపూట ఉరుసు ఉత్సవాన్ని షిరిడీలో నిర్వహించడం ఆనవాయితీ అయింది. ఆచారమయింది.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles