Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
అలంకారాలు, ఆడంబరాలు బాబాకి పడవు. పాతబడిన మాసికలు వేసిన కఫనీనే బాబా ధరించేవారు.
కఫనీ చిరిగిపోతే తానే అతుకు వేసి, కుట్టుకునేవారు బాబా.‘‘ఎండ నుండి, చలి నుండి కాపాడుతూ శరీరాన్ని కప్పి ఉంచడానికే ఈ దుస్తులు. అంతేకాని, అందం కోసమో, అలంకారం కోసమో కాదు.’’ అనేవారు బాబా. అన్నిటా బాబా తత్త్వం ఇంతే!
అయితే భక్తుల కోరిక మేరకు కొన్నిటికి మినహాయింపులు ఉండేవి. ఆ మినహాయింపులోదే ‘చావడి ఉత్సవం’. ద్వారకామయి పునర్నిర్మాణ సమయంలో బాబా చావడిలో ఉండేవారు. అక్కడే నిద్రించేవారు. ద్వారకామాయి పునర్నిర్మాణం పూర్తయింది.
బాబా ఎప్పటిలా ద్వారకామాయికి చేరుకున్నారు. అయినా భక్తుల కోరిక మేరకు ఆయన రోజు విడిచి రోజు చావడిలో నిద్రించేవారు. పగలంతా ద్వారకమాయిలో అందరి బాధలూ, గాధలూ విని, రాత్రి పడుకునే వేళకి చావడికి చేరుకునేవారు బాబా.
చావడికి బాబా చేరుకోవడాన్ని ఉత్సవంగా నిర్వహించేవారు భక్తులు. చావడికి బాబాని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళేవారు. ఈ ఉత్సవం 10 డిసెంబర్ 1909లో ప్రారంభమయింది.ఆనాటి నుంచి ఈనాటి వరకూ నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది.
ఆనాడు చావడి ఉత్సవం ఎలా మొదలయ్యిందంటే…ఇంకాసేపట్లో నిద్రించేందుకు బాబా ద్వారకామాయి నుంచి చావడికి చేరుకుంటారనగా భక్తులంతా బాబాని చుట్టుముట్టారు. భజన చేయసాగారు. కీర్తనలు ఆలపించారు.
ఆ కీర్తనలకు అనుగుణంగా కొందరు తాళం వేస్తోంటే, మరికొందరు చిరతలు వాయిస్తూ చిందులేయసాగారు. ఇదంతా ద్వారకామాయి లోపలి దృశ్యం.
మరి బయట ఎలా ఉందయ్యా అంటే…బయట దివిటీలు అఖండంగా వెలిగిపోతున్నాయి. పల్లకీని పువ్వులతో అలంకరించారు.
లోపలి నుండి వినవస్తోన్న భజనలకు అనుగుణంగా బయట కూడా భక్తులు సందడిగా ఉన్నారు. వాటికి శృతి కలుపుతున్నారు.ఉత్సవం వేళయింది.
బాబాని తాత్యా సమీపించాడు.‘‘లేవండి మామా’’ అన్నాడు. చంకలో చేయి ఉంచి, గట్టిగా పట్టుకుని బాబాని లేపాడు. బాబా లేచి నిలబడగానే వాయిద్యాల మ్రోత మిన్ను ముట్టింది.
శ్రీసాయినాథ్ మహరాజ్‌కీ జైజయజయ ధ్వానాలు చేశారంతా. సటకాని చంకలో పెట్టుకున్నారు బాబా. గూట్లో దాచిన చిలుమూ, పొగాకును అందుకున్నారు. గూట్లో దీపాన్ని ఊది, కొండెక్కిచ్చారు దాన్ని. పక్కన ఉన్న ధునిని సరిజేశారు.
కుడి భుజాన్ని శ్యామా, ఎడమ భుజాన్ని తాత్యా పట్టుకుని నడిపిస్తుంటే, బాబా ముందడుగేశారు. జండాలతో కొందరు, వింజామరలతో మరి కొందరు బాబాని అనుసరించారు.
ఊరేగింపు మొదలయింది. గుర్రం శ్యామకర్ణి దారి తీసింది. దాని వెనుక భజన బృందం, ఆ వెనుక కోలాట బృందం, వాటిని అనుసరించి పల్లకీ బయల్దేరింది. పల్లకీలో బాబా పాదుకలను పెట్టారు.చావడికి చేరుకున్నారు బాబా.
ఆసరికే చావడి దీపాలంకరణతో వెలిగిపోతోంది. లోనికి పరుగుదీశాడు తాత్యా. బాబా కూర్చునేందుకు వీలుగా బాలీసును సరిజేశాడక్కడ. అతనలా బాలీసును సరిజేస్తుండగానే రానే వచ్చారు బాబా. కూర్చున్నారు.
జోగ్ వెండి పళ్ళాన్ని తెచ్చాడు. అందులో బాబా పాదాలని ఉంచి, కడిగాడు. గంధం రాశాడాయనకి. తాంబూలాన్ని సమర్పించాడు. శ్యామా బాబా మెడలో పూలమాల వేశాడు. తాత్యా తురాయి తురిమాడు. ఎవరికి తోచినట్టుగా వారు బాబాని అలంకరించి, ఆనందించారు.
తాంబూలాన్ని సేవిస్తూ ఆరమోడ్పు కళ్ళతో భక్తుల్ని చూడసాగారు బాబా. శ్యామా చిలుముని దట్టించి, ముట్టించి తాత్యాకి అందజేశాడు. తాత్యా చిలుముని గట్టిగా పీల్చాడు. అద్భుతం. ధారాళంగా పొగ వస్తోందనుకున్నాడు. బాబాకి అందజేశాడు దాన్ని. బాబా చిలుముని గుండెల్నిండా పీల్చారు. మహల్సాపతికి అందజేశారు.
ప్రసాదంగా స్వీకరించాడు మహల్సాపతి.చిలుమును అతనూ పీల్చాడు. ఆత్మానందంలో ఊగిపోయారంతా. కాస్సేపటికి బాబాకి హారతి ఇచ్చాడు జోగ్.ఉత్సవం పూర్తయింది.
అంతా నిష్క్రమించారక్కణ్ణుంచి. నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దంలో బాబా సన్నగా నవ్వుకున్నారు.‘‘నా కోసం నేను కాదు, మీ కోసమే నేను. ఈ ఉత్సవాలూ ఉత్సాహాలూ మీకోసమే! మీ ఆనందం కోసమే’’ అనుకున్నారు.‘‘బాబా’’ ఎవరిదో ఆర్తనాదం వినిపించింది. అంతే! బాబా అదృశ్యమయ్యారు అక్కణ్ణుంచి.
భక్తుల అభీష్టాల మేరకే బాబా ప్రవర్తించేవారు. తనని ఆశ్రయించేవారిని, తనని సేవించేవారిని బాబా ఎన్నడూ నిరాశ పరిచింది లేదు.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి 9704379333, సాయి సురేష్ 8096343992
Latest Miracles:
- చావడి ఉత్సవం ….సాయి@366 డిసెంబర్ 10….Audio
- ఈ ద్వారకామాయి అన్ని మతాలకూ, అన్ని వర్గాలకూ, అన్ని కులాలకూ వేదికే!
- నేను ఆనందం ఆశ్చర్యం లో వుండగానే, Postman వచ్చి మేడమ్, మీ Courtcase తేలిపోయింది
- సమాధి చెందినా గాని , నా ఎముకలు మీ తో మాట్లాడును–Taarkad-34–Audio
- నీ కొడుకు తాత్యాని నేను కంటికి రెప్పలా కాపాడతాను. ఈ క్షణం నుంచి తాత్యా బాధ్యత నాది.’’
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments