నీ కొడుకు తాత్యాని నేను కంటికి రెప్పలా కాపాడతాను. ఈ క్షణం నుంచి తాత్యా బాధ్యత నాది.’’



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

మాట మీద నిలబడడం అంటే కత్తి అంచున ఒంటికాలి మీద తపస్సు చేయడం లాంటిది. ఆ తపస్సును కోరుకున్నవాడే మనిషి అంటారు బాబా.

మనిషి అంటే మాటకి కట్టుబడి ఉండాలంటారు.‘‘మాట ఇచ్చాం అంటే నెరవేర్చి తీరాలి. నెరవేర్చలేనప్పుడు మాట ఈయకూడదు.’’ అంటారు బాబా. ఆ మాటలెందుకో హఠాత్తుగా గుర్తొచ్చాయి తాత్యాకి. కన్నీళ్ళొచ్చాయి.

చిన్నతనంలో తాత్యా తల్లి బయిజాబాయి, బాబాని అనుక్షణం వెన్నంటి ఉండేది. బాబాని సేవించడమే తన జీవిత పరమార్థం అనుకునేది. ఆకలీ దాహం తెలియని బాబాని వెతికి పట్టుకుని మరీ ఆయనకి అన్నం తినిపించేదామె.

ఎప్పుడు చూసినా చేతులు జోడించి, బాబాకి నమస్కరిస్తూ నిల్చునేది. తల్లిగా, చెల్లిగా, ఓ భక్తురాలిగా బాబా తోడిదే లోకం అనుకునేది బయిజాబాయి.

అలాంటి బయిజాబాయికి రోజులు దగ్గరపడ్డాయి. అవసానదశకు చేరుకుందామె. స్పృహ వస్తూ పోతున్న క్షణాలు. తాత్యా ఆమె పక్కనే ఉన్నాడప్పుడు. కూర్చుని ఏడుస్తూ తల్లిని గమనిస్తున్నాడు.

ఆ క్షణం బయిజాబాయి ముందు ప్రత్యక్షమయ్యారు బాబా. ఏదో వెలుగు కనిపిస్తోంది. అదేమిటన్నది తెలియడం లేదు. చూడలేకపోతోంది బయిజాబాయి. కళ్ళిప్పలేకపోతోంది. ఎంతగా శక్తిని కూడదీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది.‘‘బాబా బాబా’’ ఆర్తిగా వేడుకుంది బయిజాబాయి.

శక్తిని ప్రసాదించారు బాబా. అప్పుడు ఆమె కళ్ళు తెరిచి చూసింది. వేయి సూర్యుల వెలుగుతో ఉన్న బాబా కనిపించారామెకు.‘‘వచ్చావా బాబా! ఆఖరి క్షణాల్లో కరుణించావా?’’ అందామె.

చేతులు జోడించి నమస్కరించింది.బాబాని తల్లి పలవరించడం, బాబాతో మాట్లాడడం అంతా వింతగా చూడసాగాడు తాత్యా. తల్లి వచ్చాడంటున్న బాబా ఏడీ, ఎక్కడ? తాత్యాకి ఎవరూ కనిపించడం లేదు.

‘‘బాధపడకమ్మా! యశోద శ్రీకృష్ణుణ్ణి ఆదరించినట్టుగా నువ్వు నన్ను ఆదరించావు. అన్నం పెట్టావు. నీ ఋణం తీర్చుకుంటాను.

తల్లీ! నీకు ఇంతకు ముందే చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను, మాట ఇస్తున్నాను. నీ కొడుకు తాత్యాని నేను కంటికి రెప్పలా కాపాడతాను. ఈ క్షణం నుంచి తాత్యా బాధ్యత నాది.’’ అన్నారు బాబా. బయిజాబాయి చేతిలో చేయి వేసి వాగ్దానం చేశారు.

ఇంకో చేత్తో తాత్యా శిరస్సు నిమిరారు. ఆ స్పర్శ తెలిసింది తాత్యాకి. బాబా కనిపించలేదుగాని, తన శిరస్సును బాబా నిమిరిన అనుభూతి తెలిసింది. తల్లికి బాబా దివ్యదర్శనం లభించిందని తెలుసుకున్నాడప్పుడు. బాబా అదృశ్యమయ్యారు.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles