Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
‘‘నీకు తెలీదు శ్యామా! తాత్యా చనిపోతాడు. నాకీ సంగతి బాబా ఎప్పుడో చెప్పారు.’’తాత్యా చనిపోతాడా? ఈ సంగతి బాబా ఎప్పుడో చెప్పారా? దిగ్బ్రాంతి చెందాడు శ్యామా.
‘‘తాత్యాని మీరే కాపాడాలి.’’ బాబాకి చేతులు జోడించాడు శ్యామా.‘‘అల్లామాలిక్’’ అన్నారు బాబా.రెండు రోజులు గడిచాయి. ఈ రెండు రోజుల్లో తాత్యాతో పాటుగా బాబా కూడా బాగా నీరసించిపోయారు. జ్వరంతో బాధపడుతున్నా, భక్తులకు దర్శనభాగ్యాన్ని కలిగిస్తూనే ఉన్నారు బాబా.
ఊదీ ప్రసాదాన్ని అందిస్తూనే ఉన్నారు. భక్తుల తాకిడి తగ్గింది. శ్యామాని పిలిచారు బాబా.‘‘చెప్పు బాబా’’‘‘వెళ్ళి తాత్యాని ద్వారకామాయికి తీసుకుని రా.’’‘‘అలాగే బాబా’’ శ్యామా పరుగున పరుగున బయల్దేరాడు. కాస్సేపటికే తాత్యాతో వచ్చాడక్కడకి.
వస్తూనే బాబా పాదాల్ని ఆశ్రయించి, భోరుమన్నాడు తాత్యా. ఎలాంటి తాత్యా, ఎలా అయిపోయాడనుకుని కన్నీరు పెట్టుకున్నాడు శ్యామా.
‘‘మామా మీరే నాకు దిక్కు. మీరే కాపాడాలి.’’ ప్రార్థించాడు తాత్యా.‘‘నేనే కాపాడతాను. బయిజాకిచ్చిన మాట తప్పుతానా?’’ అన్నారు బాబా.
ఆ మాటలు రెండూ అతి కష్టమ్మీద పలికారు. ఆయాసం బాబాని కుదిపేస్తోంది. మాట్లాడనీయడం లేదు.‘‘నీ కోసం వచ్చిన ఉయ్యాలను వెనక్కి పంపేశాను. నా కోసం ఉయ్యాలను తెమ్మన్నాను, వస్తోంది.’’ అన్నారు బాబా.
ఆ మాటతో తాత్యాకి ఒకటి అర్థమయింది. తన ప్రాణానికి బాబా ప్రాణం అడ్డం వేస్తున్నాడు. తనకి బదులుగా బాబా చనిపోబోతున్నాడు.
‘‘వద్దు మామా వద్దు! నా కోసం నువ్వు చనిపోవద్దు. నువ్వు నిండు నూరేళ్ళూ బతకాలి.
అనాథని, నేను పోయినా పర్వాలేదు. నువ్వు మాత్రం పోకూడదు. మీరు పోతే లక్షలాది మంది భక్తులు అనాథలవుతారు. వద్దు, మీరుండాలి. ఎల్లకాలం నువ్వు జీవించి ఉండాలి.’’ అన్నాడు తాత్యా.
‘‘జరగదు’’ అన్నారు బాబా.‘‘మామా’’‘‘అంతా అయిపోయింది. జరగాల్సింది జరుగుతుంది. నువ్వెళ్ళు, ఇంటికి వెళ్ళు.’’ అన్నారు బాబా, తాత్యా నుదుటన ఊదీ బొట్టుగా పెట్టారు.
ఆనాడు బయిజాబాయికి ఇచ్చిన మాట కోసం ప్రాణాన్ని పణం పెడుతున్నారు బాబా. మాట తప్పనంటున్నారు. భక్తులు ఏం కావాలి? ఉబికి వస్తున్న కన్నీటిని అణచుకోలేకపోయాడు శ్యామా. ఒక్కసారిగా పెద్దగొంతుతో ఏడవసాగాడు.
అతన్ని ఓదారుస్తున్నట్టుగా సన్నగా నవ్వుతూ చూశారు బాబా.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నీ కొడుకు తాత్యాని నేను కంటికి రెప్పలా కాపాడతాను. ఈ క్షణం నుంచి తాత్యా బాధ్యత నాది.’’
- ఆకలితో వస్తున్నారిక్కడికి. వారికి ఇంత ప్రసాదం పెడితే బాగుంటుందని నా ఆలోచన.
- “తాత్యాని బాబా తప్పకుండా కాపాడతాడు. లే’’
- ‘‘ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను మామా! కరుణించు. నన్ను ఈ బాధ నుంచి విముక్తుణ్ణి చెయ్యి.’’
- బాబా గద్దె మీద లేరు. ఉయ్యాల బల్ల మీద పడుకుని కనిపించసాగారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments