ఆకలితో వస్తున్నారిక్కడికి. వారికి ఇంత ప్రసాదం పెడితే బాగుంటుందని నా ఆలోచన.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

 

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

 (సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

నోటిలో నీరు పోసుకుని, పుక్కిలించేందుకు గోలెం దగ్గరగా వచ్చారు బాబా. దోసిలిపట్టి నీరు తీసుకోబోతూ అందులో కనిపించిన తన ప్రతిబింబాన్ని చూసుకున్నారు.

గడ్డం బాగా నెరసిపోయింది. తెల్లబడిపోయింది. ముఖం మీద ముడుతలు కూడా చోటు చేసుకున్నాయి.సన్నగా నవ్వుకున్నారు బాబా. ముసలివాణ్ణి అయిపోయాననుకున్నారు.

ఎవరో వచ్చినట్టనిపించింది. తలెత్తి చూశారు. తాత్యా కనిపించాడు. పెద్దవాడయిపోయాడు తాత్యా. నలభై యేళ్ళు ఉంటాయోమో! వాడితో గోళీలు ఆడిన రోజులు గుర్తువచ్చాయి బాబాకి.

‘‘తాత్యా’’ పిలిచారు.‘‘బాబా’’ పలికారు తాత్యా.‘‘గోళీలు ఆడుకుందామా?’’ అడిగారు.‘‘ఈ వయసులోనా?’’ నవ్వాడు తాత్యా.‘‘ఆట పట్టించకండి బాబా.’’ అన్నాడు. దూరంగా వెళ్ళిపోయాడు.

ద్వారకామాయిని శుభ్రం చేయడంలో మునిగిపోయాడతను.తాత్యా తల్లిదండ్రుల్ని కోల్పోయి, చాలా రోజులయింది. అనాథ అయిపోయాడు. అయితే తాను అనాథని కాదని, తనకు బాబా ఉన్నాడని అంటాడు తాత్యా.

ఆ మాట అక్షరాలా నిజం. తాత్యాని అనుక్షణం వెన్నంటి ఉన్నారు బాబా.

శ్యామా, మహల్సాపతి, కాశీరాం, భాగోజీషిండే, ఇంకా అనేక మంది భక్తులు ద్వారకామాయికి చేరుకున్నారు. బాబా రమ్మన్నారు వారిని. వచ్చారంతా.

వారంతా కూడా ముసలితనంతో చూడముచ్చటనిపించారు బాబాకి.‘‘రండి రండి’’ బాబా ఆహ్వానించారందరిని. నీరు పుక్కిలించారు. చేతులు జోడించి నిల్చున్న మహల్సాపతి తదితరుల దగ్గరకు వచ్చారు.

‘‘చెప్పండి బాబా, పొద్దునే మమ్మల్నందరినీ ఎందుకు రమ్మన్నారు?’’ అడిగాడు మహల్సాపతి.

‘‘ఎందుకు రమ్మన్నానంటే…మీలాగే చాలా మంది భక్తులు నన్ను చూడ్డానికి ప్రతిరోజూ వస్తున్నారు. ఆకలితో వస్తున్నారిక్కడికి. వారికి ఇంత ప్రసాదం పెడితే బాగుంటుందని నా ఆలోచన.

అందుకు తగిన ఏర్పాట్లు నేను చేసుకున్నాను, మీరు కొంచెం సాయం చేస్తే బాగుంటుందని పిలిచాను.’’ అన్నారు బాబా.

తనతో రమ్మన్నట్టుగా చేత్తో సైగ చేసి, ముందుకు నడిచారు బాబా. ఆయన్ను అనుసరించారంతా.

పెద్దపొయ్యి, దాని మీద గంగాలంలో నీళ్ళు మరుగుతున్నాయి. పక్కనే తట్టలో కడిగిన బియ్యం ఉన్నాయి. అక్కడికి చేరుకున్నారంతా.‘‘తట్ట ఎత్తి పెట్టి, బియ్యం పొయ్యండిందులో’’ అన్నారు బాబా.

గంగాలంలో పొగలు కక్కుతున్న నీటిని చూశారు. కాశీరాం, షిండే ఇద్దరూ తట్ట ఎత్తి పట్టి, గంగాలంలో బియ్యాన్ని పొయ్యసాగారు. పోస్తున్న బియ్యాన్ని నీటిలో కలపాలి. గరిటె కోసం వెదకసాగాడు శ్యామా. ఎక్కడా కనిపించలేదది.

శ్యామా వెదుకులాటను గమనించి సన్నగా నవ్వుకున్నారు బాబా.

 

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “ఆకలితో వస్తున్నారిక్కడికి. వారికి ఇంత ప్రసాదం పెడితే బాగుంటుందని నా ఆలోచన.

సాయినాథుని ప్రణతి

Sreenivas murthy garu చాలా సంతోషంగా వుంది .మాకు ఎక్కడికనా వెలెటపుడు సచ్చరిత్ర తిసుకెలడం అలవాటు .మా ఇంట్లో మేము వునా లేకున మా అత్తగారు ప్రతిరోజు సమయానికి సచ్చత్ర చదువుతారు .అందుకు నేను సచ్చరిత్ర నాతో తెచుకోలేదు.ఈ రోజు ఉదయం మా సమయం ప్రకారం సచ్చరిత్ర చదువుదాం అనుకునాను .కాని సచ్చరిత్ర నాతో లేదే అనుకునా.అపుడు బాబా గుర్తు చేసారు సాయిలీలాస్ website లో సచ్చరిత్ర వుంటుంది అని నేను ఇది తిసి చదివాను. చాలా ఆనందించాను.ఎపుడు ఎ function కి వెలినా మావారు నాకు తొడుంటారు ఇసారి కొని పరిస్తితుల వలే మావారు నాతో రాలేదు. కాని ఇది చదివెక బాబా ఎపుడు ఏ పరిస్తితిలోను తన బిడ్డలకు తోడుగా వుంటారని ,వునాన్నని చెపినట్లు అనిపిస్తుంది .మనస్సుకు బాబా వునారు నను ఎపుడు ఓ కంట కనిపెటుకు వుంటారని అనిపిస్తుంది . మన సురేష్ సాయి share చేసిన లీల ప్రేమమయుని పరమ శ్రద్ద కూడ గుర్తుకు వస్తుంది.ఆనందంగా వుంది.మికు దన్యవాదాలు

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles