బాబాని అడుగు తనకి తెలుసుకదా ఏది మంచిదో…



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ముందు భాగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

ఒకరోజు మా నాన్న వల్ల ఫ్రెండ్ ఒక మ్యాచ్ గురించి చెప్పారు..మా నాన్నకి,నాకు కూడా, అప్పుడే మ్యారేజ్ ఇష్టం లేదు బట్ వాల్ల ఫ్రెండ్ మాట కాదనలేక నా ఫోటో ఇచ్చాడు.

అబ్బాయి వాళ్ళకి నచ్చి,వాళ్ళ ఫోటో కూడా ఇచ్చారు.ఆ అబ్బాయి మా ఇంట్లో ఎవరికీ నచ్చలేదు .కానీ,నాకు అప్పట్లో అంతగా తెలియక,ఒక అబ్బాయి ఫోటో చూసాక ఇక ఆ అబ్బాయి నే చేసుకోవాలి కదా, ఇంకొకరిని ఎలా చేసుకుంటాం అని ఆలోచనమాత్రం ఉంది.ఒక ఫోటో చూసి ఇంకొక అబ్బాయిని చేసుకోవడం తప్పు అనే అమాయకత్వం అప్పుడు.

ఇంట్లో ఎవరికి నచ్చలేదు కదా, మా ఫ్రెండ్ కాల్ చేస్తే ఈ విషయం చెప్పాను..తను నీకు బాబా కలలో కనిపిస్తారు కదా !బాబాని అడుగు తనకి తెలుసుకదా ఏది మంచిదో అని అంది.

నువ్వు మరీ చెబుతున్నావు కలలో బాబా కనిపించి ఇదే చెబుతాడు అని ఏముంది .అయినా బాబా కనిపించినప్పుడు ఆ టైం కి నాకు అడగాలని థాట్ రావాలి కదా! ఇదెలా కుదురుతుంది. అని ఆడిగితే నువ్వు బాబా దీనికి ఆన్సర్ చెప్పాలి ,అని అనుకో తనే చెబుతాడు చూడు అంది.నేను సరే అనుకున్నాను..ఆరోజు బాబా కనిపించారు కానీ బాబా ని చూసిన ఆనందంతోనే సరిపోయింది ఏమి అడగలేదు.

మళ్ళీ తరువాతి రోజు కనిపించారు..

ఒక చిన్న కాలువ, చుట్టూ చెట్లు, ఆ కాలువలో నీరు ప్రవహిస్తున్న శబ్దం కూడా హాయిగా వినిపిస్తుంది..ఒక రాయిపై కాలుమీద కాలు వేసుకుని కూచున్నారు..

నేను మ్యాచ్ గురించి అడిగాను..దానికి బాబా నీకు మ్యారేజ్ ఇప్పుడు లేదు దానికి చాల టైం ఉంది..అప్పుడు నువ్వు ఇష్టపడిన అబ్బాయితోనే నీ మ్యారేజ్ అని చెప్పారు.

నేను ఇష్టపడిన అబ్బాయి అంటే ఇప్పుడు ఇతన్నే చేసుకోవాలి అనుకుంటున్నా కదా, తను యూ.కే వెళ్ళడానికి రెండు నెలల టైం ఉంది.కాబట్టి ఇప్పుడు వెళ్లి మళ్ళీ నాలుగు సంవత్సరాల తరువాత వస్తాడేమో ,అప్పుడు ఇతన్నే చేసుకుంటానేమో అనుకుంటుండగానే, బాబా అప్పుడు ఆ టైం కి  నీకు నచ్చిన అబ్బాయి తో అన్నారు..సరేలే ఇతను కాదేమో లే అనుకుని,జాబ్ గురించి అడిగాను.దానికి కూడా చాల టైం ఉంది అన్నారు..ఇక నాకు కోపం వచ్చింది.

మ్యారేజ్ కి టైం ఉంది అంటే ఓకే కానీ జాబ్ కి కూడా చాల టైం ఉందంటే ఎలా? అని అడిగాను.బాబా..జాబ్ కి మ్యారేజ్ కి రెండింటికి చాల సమయం పడుతుంది.ఓర్పు,సహనం కావాలి అన్నారు.నేను సరే అని యెంత సమయం పడుతుంది అని అడిగాను దానికి ఓ ఆరు ,ఏడు సంవత్సరాలు అన్నారు .నేను అంత లేట్ గానా,మ్యారేజ్ లేట్ గా అయినా పర్వాలేదు. కానీ నాకు జాబ్ కావాలి అని అడిగా.

దానికి బాబా తప్పదు. జాబ్ మ్యారేజ్ రెండూ ఒకే సారి వస్తాయి.సర్కార్ నౌకరి వస్తది.ఒక చీటీ ఉంటది.అది తీసికెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు జాబ్ ఇస్తారు అని చెప్పారు..నేను నా దగ్గర ఏమి చీటీ లేదుకదా ఎలా అంటే అప్పుడు ఆ టైం కి నీ దగ్గరికి చీటీ వస్తది దాన్ని తీసికెళ్ళి ఇస్తే జాబ్ ఇస్తారు అన్నారు..అంతా బానే ఉంది కానీ ఆరు సంవత్సరాలు వరకు వెయిట్ చేయాలంటే బాధగా అన్పించి ఏమి చేయాలో తెలియక, మళ్ళీ బాబా ని అడిగాను.

బాబా ఎంతకాలం వెయిట్ చేయాలి అని..బాబా ఓ ఆరేళ్ళు అన్నారు..నేను ఓహో  ఆరు నెలలా అని అడిగాను దానికి బాబా నవ్వుతూ ఆ ఆ అన్నారు..నేను వో బాబా ఆరేళ్ళు అంటే నేను ఆరునెలలా  అని బాబాని బోల్తాకొట్టించాను.బాబా నవ్వుతూ ఆ ఆ అన్నాను కానీ, కాదు అని చెప్పలేదు కదా అని హ్యాపీ గా ఒక ఆరు నెలల తరువాత జాబ్ వస్తది అని ఫీల్ అయ్యాను….కానీ ఆరు నెలల తరువాత జాబ్ రాలేదు.చాల బాధ అనిపించింది.అప్పుడప్పుడుకోపం కూడా వస్తుండేది .కానీ నేను చేయగలిగింది ఏమి లేదు కదా.(బాబా ఏమైనా చేయగలరు కానీ,అంతకుమునుపే మనం అయన దిశగా ఏదో ఒకటి చేసి పెన్నిధి దాచిపెట్టుకోవలసి ఉంటుంది).

మనం మనకిష్టమైనది మన తల్లితండ్రులు చేయాలనీ అనుకుంటాం.వాళ్ళు ఇవ్వకుంటే కోపం తెచ్చుకుంటాం ,అలుగుతాం.నిజానికి అది అక్కడ కోపం కాదు.నా వాళ్ళు నేను అడిగింది ఇవ్వాలి అనే హక్కుతో ఆలా చేస్తాం.ఇక్కడ బాబా విషయం లో నా ఫీలింగ్ కూడా అదే.

మా ఇంట్లో భగవంతుడు అనే నమ్మకం పెద్దగా ఎవరికి లేదు.సో,నాకు భగవంతుని దగ్గర ఇలా ఉండాలి,ఇలా ప్రవర్తించాలి అనే విషయాలు నాకెవరు చెప్పలేదు.బాబా ఆలా కలలో కనిపించి మాట్లాడుతుండే సరికి,ఆ ప్రేమతో, చావుతో, బాబా దగ్గర దేవుడు అనే భయభక్తులకి బదులు.ఏదో క్లోజ్ ఫ్రెండ్ లాగా ఓపెన్ మైండెడ్ గా నా కోపం,బాధ,చిరాకు,ప్రేమ అన్ని బాబా మీద ఆలా చూపించేదాన్ని.

బాబా మీద కాకుండా ఎవరి మీద ఆలా చూపిస్తాం.ఆలా చూపిస్తే మాత్రం ఎవరు ఊరుకుంటారు. అయన మన తల్లి కాబట్టి అన్ని నవ్వుతు తీసుకుంటారు.

(గురువుగారు అంటుంటారు.బాబాకి దగ్గరవడానికి ఎవరిమార్గం వారిది.మూస ధోరణిలో వెళ్ళవద్దు మీదైనా మార్గాన్ని కనుక్కొని దానిని అనుసరించండి అని. )బహుశా అప్పుడు నాకు తెలియకుండానే ఇలా నా మార్గం లో నేను వెళ్లానేమో ….

తరువాతి భాగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles