రూమ్ లో మొత్తం దీపాలు మధ్యలో బాబా కూర్చొని ఉన్నారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ముందు భాగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఒకరోజు నేను సచ్చరిత్ర పారాయణ చేస్తుంటే, మా పిన్ని ఒకరు జాబ్ రావాలని చేస్తున్నావా ?అని అడిగింది.నేను అందరూ ఇలాగె అడుగుతున్నారు అని నవ్వి ఊరుకున్నాను.

కానీ పారాయణ చేస్తున్నప్పుడు ఒక డౌట్ వచ్చింది.ఇందులో ఒకసారి పారాయణ చేస్తేనే కోరికలు నెరవేరుతాయి అని ఉంది మరి నేను మూడు సార్లు చేశాను జాబ్ గురించే, ఐన ఇంకా రాలేదు ఏంటి?

అంటే ఏ బుక్ లో చెప్పింది అబద్దమా?బుక్ లో బాబా కి లీలలు ఉన్నాయని, ఆ లీలలు , ఈ లీలలు చేసారని రాసారు.మరి నాకెందుకు ఇంకా జాబ్ ఇవ్వలేదు?అంటే ఈ లీలలున్నాయి అని రాసింది అబద్దం కావచ్చు.షేక్స్పియర్, ఇంకా ఇతర ఆథర్స్ బుక్స్ ని , కూడా చాల మంది చదువుతారు.ఇది అలాంటి బుక్ ఏ కావచ్చో కాకపోతే దేవుడికి సంబంధించింది కాబట్టి సెంటిమెంట్ గా అందరూ నమ్ముతారు కావచ్చు. కాకపోతే మరి నాకెందుకు జాబ్ ఇవ్వలేదు ఇంకా అని అనుకున్నాను.అయినా బుక్ ఆరోజుది చదివాను.

ఆరోజు నైట్ కలలో నేను ఒక గుడికి దగ్గరలో ఉన్న గది తలుపులు తీయగానేను రూమ్ లో మొత్తం దీపాలు మధ్యలో బాబా కూర్చొని ఉన్నారు. నేను బాబాని చూసి ఆనందంగా బాబా మీరు ఆక్కడున్నారు అనుకున్నాను, ఇక్కడున్నారా ?ఇక్కడికి ఎప్పుడువచ్చారు. అని అనుకుంటూ లోపలి వెళదామని ఒక కాలు లోపలి వేసానో లేదో ఒక్కసారిగా దీపాలన్నీ ఆరిపోయాయి. చీకటిగా ఉంది.

నేను ఇదేంటి నేను కాలు పెట్టగానే దీపాలన్నీ ఆరిపోయాయి ఏమైనా అపశకునామా ఏంటి? నేను కాలు పెట్టడం మంచిది కాదా ఏంటి అని అనుకుంటుండగానే మళ్ళీ దీపాలన్నీ ఒక్కసారిగా వెలిగాయి..నేను హ్యాపీగా బాబా వైపు చూడగానే బాబా నా వైపు చూస్తూ,చూసావా ఇప్పటికైనా నాకు లీలలున్నాయని నమ్ముతావా? అని అడిగారు ?నాకు లోపల హ్యాపీగానే ఉంది.

నమ్ముతున్నాను కానీ,నేను నమ్ముతున్నాను అని చెబితే ఇక నమ్ముతున్నావు కదా అని ఎక్కడ జాబ్ ఇవ్వకుండా వెళ్ళిపోతాడో అని.నాకు నమ్మాలని ఉంది బాబా కానీ, నాకు మీరు జాబ్ ఇవ్వలేదు కదా,అందుకే నమ్మట్లేదు. కాబట్టి జాబ్ ఇస్తే నమ్ముతాను అని చెప్పా .

దానికి బాబా బాధగా మొహం పెట్టి ఇంకా నువ్వు నన్ను నమ్మట్లేదు కదా! అని అన్నారు.నాకు బాబా ని ఆలా చూస్తే బాధనిపిస్తుంది, నమ్ముతున్నాను అని చెప్పాలనిపించింది. కానీ మళ్ళీ,మరి నాకు జాబ్ ఇవ్వండి నమ్ముతా అని చెప్పా.

దానికి బాబా సరే నువ్వు నాకు లీలలున్నాయని ఇంకా నమ్మట్లేదు కదా సరే వెళతాను ఇక అని బాధతో, సట్కా తీసుకుని, అక్కడున్న గోడ దగ్గరికికి వెళ్లి బాధతో నావైపు చూస్తూ ఆ గోడ లో నుండే మాయమైపోయారు..బాబా గోడలోనుండే మాయమయ్యారు అది కూడా లీలనే.

పాపం బాబా బాధపడుతున్నారు .నేను లోపల నిజంగానే నమ్మాను, బయటికి కూడా అలానే చెపితే బాగుండేది అనుకున్నాను.

మళ్ళీ వెంటనే ఆ బాబానే ఆలా బాధపడితే నేను బాధపడట్లేదా మరి,నాకు జాబ్ ఇవ్వలేదని.అంత బాధపడి నన్ను బాధపెట్టేబదులు ఒక జాబ్ ఇస్తే అయిపోయేది కదా !నేను కూడా అస్సలు తగ్గొద్దు.నేనుకూడా మొండిగానే ఉండాలి అనుకున్నా ….కానీ అయన చూపే ప్రేమ ముందు ఆలా మొండిగా ఉండలేము.అయన మన తండ్రి కాబట్టి మన అలకని,చిరాకుని,తనమీద చూపెడతాం, కానీ అయన ప్రేమనిపంచే కరుణా మూర్తి కాబట్టి మనలని చిన్నపిల్లలు తప్పుచేస్తే క్షమించినట్టుగా నవ్వుకుంటూ క్షమిస్తారు.

మనకు ఏదిమంచిదో మనకి తెలియక మనకి నచ్చింది అడుగుతాం. కానీ మన భూత, వర్తమాన ,భవిషత్ కాలాలు బాబాకి తెలుసు.దానిని బట్టే మనకి ఏది ఇవ్వాలో అదే ఇస్తారు.

తరువాతి భాగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి 9704379333, సాయి సురేష్ 8096343992

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “రూమ్ లో మొత్తం దీపాలు మధ్యలో బాబా కూర్చొని ఉన్నారు.

Sai bhavana

Sairam.. Prathibha ji.. We are very thankful to you… By reading your experiences one can know about Baba’s love towards His children.. They are boosting our devotion and love towards Sai..You are so great that You have that much faith on Him, So you are receiving His affection too.. My pranams to you..

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles