గురుబంధువుతో కళ్యాణ బంధం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భక్తురాలు: సుమాంజలి 

                                                       నివాసం: హైదరాబాద్

నేను హైదరాబాద్ లో జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు, నేను బాబాతో చెప్పుకునేదాన్ని.

బాబా నేను ఒకరికి జాబ్ కోసం హెల్ప్ చేద్దామనుకుంటే నేను మనీ కట్టి మోసపోయాను.

నన్ను ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు, నా మీద ఉన్న నమ్మకం పోయింది. జాబ్ రావడం లేదు చాలా ప్రాబ్లమ్ గా ఉంది అని.

అలాంటి సమయంలో మారుతి నాకు ఒక మెయిల్ ఇచ్చి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయమని చెప్పింది. నేను చేశాను,

అతను డైలీ టెంపుల్ కి హారతికి వచ్చేవాడు. నాకు పరిచయం లేదు.

అలా నేను జాబ్ కోసం చేసే డిస్కషన్ లో అతను హారతికి వచ్చేవాడని తెలిసింది.

అలా అతని మీద అభిమానం ఏర్పడింది. అప్పటికి మా ఇంట్లో మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేసారు.

హైదరాబాద్ లో పెళ్లి చూపులు ఏర్పాటు చేసారు. ఆ ముందు రోజు అనుకోకుండా రజని అక్కతో దిలుశుక్ నగర్ బాబా టెంపుల్ కి వెళ్లడం జరిగింది.

అక్కడ అనుకోకుండా బాబాకి లెటర్ రాసుకున్నాను. నాకు ఈ  పెళ్లి ఇష్టం లేదు. నేను పెళ్లంటే చేసుకుంటే ఒక గురుబంధువునే చేసుకుంటాను అని. లెటర్ రాసిపెట్టి వచ్చాను.

తరువాతి రోజు ఎర్లీ మార్నింగ్ మా పెదనాన్న (హైదరాబాద్) ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేసారు. అవి జస్ట్ ఫార్మాలిటీస్ మాత్రమే, అప్పటికే అందరూ డిసైడ్ అయి ఉన్నారు.

ఇక నేను ఏమీ చేయలేక ఒప్పుకున్నాను. బాబా ఏమి చేసారో కానీ, వాళ్ళు నో చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది.

బాబా నాకు గురుబంధువుతో పెళ్లి జరిపిస్తారు అని స్ట్రాంగ్ గా నమ్మకం ఏర్పడింది. తరువాత నాగేశ్వర రావు అనే గురుబంధువుతో నా పెళ్లి జరగడం ఇవన్నీ కేవలం బాబా, గురువు గారి దయ వల్లనే.

ఎందుకంటే మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఇంట్లో అస్సలు ఒప్పుకునే ఛాన్స్ లేదు. కేవలం నాకోసం బాబా ఇతన్ని పంపించారు. లేదంటే అస్సలు ఊహించను కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని.

రజని అక్కతో అతను చెప్పడం. రజని అక్క నాతో చెప్పడం. నేను జనార్దన్ అంకుల్ ఇంట్లో సత్సంగంలో బాబాని అడగడం. అప్పుడు నాకు, నేను ఆదరిస్తాను అని మాట వినపడడం.

తరువాత నేను చాలా మాటలు పడ్డాను. అందరితో, అయితే ఇది బాబా నిర్ణయం, ఎవరు మార్చలేరు.

అన్ని ప్రొబ్లెమ్స్  వచ్చినా కూడా బాబా, గురువు గారి దయ వల్ల మా పెళ్లి పెద్దల సమక్షంలో వైభవంగా జరిగింది.

నేను అలా అస్సలు ఊహించను కూడా లేదు మా పెళ్లి అలా జరుగుతుందని.

అలా నాకు గురుబంధువుని నాకు భాగస్వామిని చేసారు. ఇది నా లైఫ్ లో మర్చిపోలేని మిరాకిల్.

బాబా, గురువు గారి కూర్పుతో మేము చాలా హ్యాపీగా ఉంటున్నాము.

బాబాకి, గురువు గారికి చాలా చాలా థాంక్స్.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles