Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఒకసారి మేము షిరిడీ వెళ్ళాలనుకున్నాము. నేను ఎప్పుడు షిరిడీకి పోవాలనుకుంటే అప్పుడు వెళ్లి పోతుంటాను.
ఈ విషయంలో ఇంట్లో కూడా చాలా సార్లు గొడవలు కూడా అయ్యాయి. ఊరికే ఎందుకు షిరిడీ వెళతావు అంటారు, నేనేం చేయను. అక్కడే రూమ్ తీసుకుని అక్కడే ఉండు అంటూ ఉంటుంది అమ్మ.
అస్తమానం అలా అంటోందని నాకు కోపం వచ్చి, బ్యాగు తీసుకుని, ఒక జత బట్టలు అందులో పెట్టుకున్నా.
అన్నా వాళ్ళతోటి షిరిడీ వెళ్ళాను. సమాధి మందిరంలో బాబాని దర్శించుకొని, ద్వారకామాయిలో బాబాని చూస్తూ
”బాబా నిన్ను చూడడానికి నేను షిరిడీ వస్తున్నానా? నన్ను చూడాలని నికనిపించి షిరిడీకి రప్పిస్తున్నావా? ఊరికే నిన్ను చూడడానికి వస్తుంటే ఇంట్లో తిడుతున్నారు. నాకు ఇక్కడే సమాధానం కావాలి”
అని ద్వారకామాయిలో కూర్చుని సాయి సచ్చరిత్ర పుస్తకం తెరిచాను .
అందులో నాకు షిరిడీకి లాగబడ్డ భక్తుల కథలు వచ్చాయి. అది నేను చదివాను.
అది చదవడానికి నాకు పది నిముషాల సమయం పట్టింది. ఆ పది నిముషాల సేపు కూడా నా కళ్ళ వెంట ధారాపాతంగా కళ్ళ నీళ్ళు కారుతూనే ఉన్నాయి.
”బాబా నన్ను చూడడానికి ఇంత ప్రయత్నం చేస్తున్నావా” అని అనుకున్నాను.
ఒక సారి నేను షిరిడీ వెళ్ళాలి అనుకున్నాను. నా దగ్గర 900 రూపాయలే ఉన్నాయి. బాబా నా పరిస్థితి ఇది.
నా దగ్గర 900 రూపాయలే ఉన్నాయి, వాటితోనే నేను షిరిడీ వస్తున్నాను. నేను మరల తిరిగి ఇంటికి చేరేంతవరకు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ 900 రూపాయలు సరిపోవాలి అనుకుంటూ రైలు ఎక్కాను.
ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడలేదు. ఎటువంటి టెన్షన్ పడలేదు. వెళ్ళాను, దర్శనం చేసుకొని వచ్చేసాను.
అంతే! ఈ డైవర్స్ హడావిడిలో నా మనస్సు బాగోనప్పుడు గుడి పూజారి నాకు గురు చరిత్ర పుస్తకం ఇచ్చాడు.
అది తెరిచే సరికి అందులో 2 రూపాయల బిళ్ళ ఉంది. అది పూజారికి ఇవ్వబోతే నువ్వే ఉంచుకో అన్నాడు.
క్రిందటి సంవత్సరం నా పుట్టిన రోజుకు కొత్త బట్టలు వేసుకోవాలని ఉంది, కానీ కొనుక్కోవడానికి డబ్బులు లేవు.
పుట్టిన రోజు నాడు తెల్లారగానే రాజన్న వచ్చి శుభాకాంక్షలు చెప్పి కొత్త బట్టలు ఇచ్చాడు. నాకు సాయి సచరిత్రలో అల్లిక పని కథ గుర్తుకువచ్చింది.
నేను బాబా గుడిలోనే కాదు ఎక్కడ సేవ ఉన్నా వెళ్ళి చేస్తాను. ఆ సేవ నేను చేయకుండా ఉండలేను.
గురువారం గుడిలో పల్లకి సేవకి ఆరు నూరు అయినా, నూరు ఆరు అయినా నేను మానను.
అలాంటిది ఒక గురువారం నాకు బాబా పరీక్ష పెట్టాడనుకుంటా.
ఏమంటే నాకు గుండెల్లో నొప్పిలా వచ్చింది. ఎడమ చెయ్యి ఎత్త నీయటం లేదు. నాకు తెలుస్తోంది, నాకేదో అయిపోతోందని, ఏం మాట్లాడలేదు.
బాబా అనుకున్నాను, పల్లకి ఎత్తే సమయం అయింది, నాకు నెప్పి గానే ఉంది.
నొప్పిగా ఉన్నా పల్లకి ఎత్తాను. బయలు దేరాము. అంతే! నొప్పి ఎటో ఎగిరిపోయింది. సేవ మంచిగా అయింది.
సర్వం శ్రీ సాయినాధ చరణారవిందార్పణ మస్తు
శుభం భవతు
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- గురుబంధువుతో కళ్యాణ బంధం
- రిక్షాలో తీసుకెళ్లి షిరిడీ చూపించిన బాబా !
- ఎన్నటికీ వీడని బంధం …..సాయి@366 డిసెంబర్ 19….Audio
- జన్మ జన్మల బంధం …..సాయి@366 డిసెంబర్ 23….Audio
- బాబా పంపిన ఊదీ
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments