Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భారతదేశ మాజీ రాష్ట్రపతైన వరాహగిరి వేంకటగిరి గారు తోటపల్లి శాంత్యాశ్రమ స్వామి ఓంకార్ గారి జీవితం భగవద్గీతకు భాష్యం అన్నారు.
స్వామి ఓంకార్ బాల్యనామం వెంకటరావు. అతను చదువుకంటే ఏకాంతంగా ఉండటానికే ఇష్టపడేవాడు.
హిప్నోటిజం నేర్చుకున్నారు. రోగులను స్నేహితులను హిప్నోటైజ్ చేసి నిద్రింపచేసే వారు.
జ్వరాలు, తలనొప్పులకు చికిత్సచేసేవారు. దూరాన గల వస్తువులను మనోబలంతో పైకి లేపేవారు.
గంగా తీరంలో పాత దుస్తులను విడచి కాషాయ వస్తాలు ధరించి ఓంకారమే జపిస్తుండేవారు. అందుకే ఆయన ఓంకారస్వామి అయ్యారు.
శ్రీరామ తీర్థులు తపమాచరించిన బ్రహ్మపురిలో ఆరు సంవత్సరాలు కఠోర సాధన చేశారు. తోటపల్లిలో శాంత్యాశ్రమం స్థాపించారు.
ఒక ప్రభుత్వ ఉద్యోగి కూతురు కాలు విరిగింది. స్వామి తన కుడికాలు ఎముక 8 అంగుళాలు రంపంతో కోయించి ఆమెకు అతికింపచేశారు.
శాంతికి నిలయమైంది శాంత్యాశ్రమం. శాంత్యాశ్రమాన్ని దర్శించటానికి ఎందరో వెళ్ళేవారు.
ఒకసారి ఒక మహిళ స్వామిని దర్శించి, తిరిగి తన గృహానికి పోతూ ఆశ్రమంలో మసక చీకటిలో ఒక పాము తోక తొక్కింది.
పాము ఆమె ఎదురుగా తోక మీద నిలబడి ఉంది. వెంటనే ఆమె ‘ఓం సాయి’ అనే నామాన్ని ఉచ్ఛరించసాగింది. పాము ఆమెను ఏమీ చేయక వెళ్ళిపోయింది.
ఇంకొకసారి సాయి భక్తులు ఆ ఆశ్రమంలో సాయిపూజ చేసుకుంటున్నారు. భక్తులు చాలామంది వస్తున్నారు.
దీనిని చూచిన స్వామీజీ తన ధ్యాన మందిరంలో సాయిపూజను చేసుకోమ్మన్నారు. ఇక సాయి మహిమ మొదలైంది.
నైవేద్యానికి తెచ్చిన ఫలాల మీద సాయి నామం కనిపించింది. ఒకాయన వెలగపండు సాయికి నైవేద్యం పెట్టాడు. దానిమీద (తెలుగులో) నామం కనిపించింది.
స్వామీజీయే ఒక కొబ్బరికాయను సాయికి సమర్పించారు. దానికి రెండు వైపుల సాయి పేరు కనిపించింది.
ఎవరో ఒకరు విభూతిపండును సమర్పించగా దానిపై ‘సాయి మందు’ అనే మాటలు కనిపించాయి. ఈ ఊదీని జబ్బుతో ఉన్న ఆవుకు పూయగా అది మామూలుగా పాలు ఇవ్వసాగింది.
ఒకసారి వెండి పళ్ళెమును సాయికి సమర్పించారు. దానిపై సాయి నామము ఏర్పడింది.
ఆ వెండి పళ్ళెమును శ్రీ బి. వి. నరసింహస్వామి గారి 81వ జన్మదిన సందర్భంలో శ్రీరాజేశ్వరానందుల వారి ద్వారా ఓంకార స్వామి సమర్పించారు.
విశ్వ శాంతి దూతగా వ్యవహరించిన తోటపల్లి శాంత్యాశ్రమ ఓంకారస్వామి 10 జూన్, 1982న దేహాన్ని త్యజించారు.
నేడు జూన్ 10. ఓంకారస్వామి వర్థంతిరోజు. ఆయనను స్మరిద్దాం! శాంతిని పొందుదాం!!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సంకల్పం…. మహనీయులు – 2020… జూన్ 18
- శ్రీ సాయిబాబా వారిని దర్శించిన వెంటనే శాంతి పొందిన సాఠే.
- స్వామి నారాయణ …. మహనీయులు – 2020… జూన్ 1
- ఓం శేష సాయినే నమః …..సాయి@366 సెప్టెంబర్ 24…Audio
- చంద్రునికో నూలుపోగు! …. మహనీయులు – 2020… జూన్ 5
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments