Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఒకసారి ఓంకారస్వామి తన శిష్యుని మధ్యాహ్నం పన్నెండున్నరకు బయలుదేరే రైలుకు మూడు టిక్కెట్లు రిజర్వేషన్ చేయించుకురమ్మన్నారు.
అది వేసవి కాలం. అదీకాక ఆ రోజుకు టిక్కెట్లు దొరకవని శిష్యుడన్నాడు. “నీవు వెళ్లి రిజర్వేషన్ చేయించుకురా” అన్నారు మరల ఓంకారస్వామి శిష్యునితో.
శిష్యుడు ఇక చేసేదేమీలేక రిజర్వేషన్ కోసం బయలుదేరాడు. రిజర్వేషన్ కౌంటర్ లో “ఇంకో 4 గంటలలో రైలు బయలుదేరుతుందికదా. ఇప్పుడు టిక్కెట్లు దొరుకుతాయా?” అన్నాడు బుకింగ్ క్లర్క్.
అలా అన్నాడో లేదో టెలిఫోన్ మ్రోగింది. వెంటనే టెలిఫోన్ ఎత్తి మాట్లాడి, తిరిగి కౌంటర్ దగ్గరకు వచ్చి “ఇప్పుడే మూడు టిక్కెట్లను ఎవరో క్యాన్సిల్ చేసుకున్నారు. అవి నీకిస్తాను” అన్నాడు. టిక్కెట్లు తీసుకుని బయలుదేరాడు శిష్యుడు.
రైలు 12. 30 నిIIలకు. ఓంకారస్వామి బయలుదేరింది 12.20 నిIIలకు. “సమయం చాలదు” అని ఎవరో అన్నారు.
“ఈ స్థూలకాయం స్టేషన్ చేరేదాకా రైలు కదలదు” అన్నారు ఓంకారస్వామి. అలానే జరిగింది. భూత, భవిష్యత్, వర్తమానాలు ఓంకారస్వామికి లేవు. అన్నీ ఆయన సంకల్పమే.
ఓంకారస్వామి బాల్యనామం చలమరాజు. జ్యేష్ట (సాధారణంగా జూన్ లో వస్తుంది) శుద్ధ పంచమి (1921)లో జన్మించారు.
ఆయన బాల్యంనుండి ఏకాంతంగా రామనామ ధ్యానం చేసేవారు. పూండీలో ఒకరు రామనామానికి ఓం చేర్చి మంత్రోపదేశం చేశారు ఆయనకు.
రామ దర్శనం అనేకమారులు లభించింది ఓంకారస్వామికి. తన శరీరాన్ని దేవునికి ఉపకరణంగా మార్చాడు ఓంకారస్వామి.
‘ఓం రామ’ మంత్రంలోని రామ విడిచి ఓం మంత్రసాధన సాగించాడాయన. ఇక ఆయనకు ఓంకారస్వామి అనే పేరు వచ్చింది.
కోరిన వారికి సత్య, జ్ఞానములు, ఆధ్యాత్మిక తత్త్వ విషయాలు చెప్పేవారు.
ఒకసారి ఆయన నడుస్తుంటే వర్షం కురవసాగింది. “కాసేపు వర్షం ఆగిపోతే బాగుండును” అనుకున్నాడాయన. ఇక వర్షం ఆగిపోయింది.
భోపాల్ లో ఒక భక్తుడు వీరితో కమలా ఫలాల తోటలో నడుస్తున్నాడు. ఆ పండ్లు నోరూరిస్తున్నాయి.
కోసుకుంటే బాగుండదుకదా, కాని ఆ పండ్లను తినాలని ఉంది అని మనసులోని మాటను దాపరికం లేకుండా చెప్పాడా శిష్యుడు ఓంకారస్వామితో.
“జయ ఓం” మంత్రం 18 సార్లు జపించామన్నారు గురువు. ఆ శిష్యుడు అలాగేనని జపించాడు. జపం ముగిసింది. అప్పుడు తోట యజమాని వచ్చి పండ్లను ఇచ్చిపోయాడు.
అందరూ సంకల్పించుకొనగలరు. కానీ ఎందరికి నెరవేరుతాయి?
ఓంకారోపాసన చేసి సిద్ధిపొందిన మహనీయుడు కాబట్టి ఓంకారస్వామి సంకల్పాలు ఫలిస్తున్నాయి. అసలా సంకల్పాలన్నీ తన కోసంకాదు ఇతరుల కోసమే.
సాయిబాబా రామునిగా దర్శనం ఇచ్చాడు. ఇక్కడ ఓంకారస్వామి ఉపాసన చేసి దర్శనం పొందాడు.
కోడంబాకంలో ఆయన స్థిరపడి తనువు చాలించారు. వారి కృపచే మనకు రామ దర్శనము కలుగుగాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఓం శాంతి శాంతి శాంతి …. మహనీయులు – 2020… జూన్ 10
- పాద స్పర్శ …. మహనీయులు – 2020… జూన్ 25
- రాతి హృదయము …. మహనీయులు – 2020… జూన్ 26
- సందర్శనం …. మహనీయులు – 2020… జూన్ 8
- యోగ కళాప్రపూర్ణ …. మహనీయులు – 2020… జూన్ 16
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments