Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సుమారు 1240లో యూనస్ ఎమ్రి జన్మించాడు. టర్కీలో ఆయనను యోగిగా, ప్రజా కవిగా, మార్మికునిగా కీర్తిస్తారు. 26 జూన్ 1991లో టర్కీ ప్రభుత్వం ఆయన స్మారకార్థం తపాలా బిళ్ళను విడుదల చేసింది.
యూనస్ ఎమ్రి తన కాలంలో ప్రసిద్ధ సూఫీ యోగి వద్దకు కొన్ని అడవి ఫలాలతో పోయాడు. దీవెనలు కావాలా, గింజలు కావాలా అని ఆ సూఫీ యోగి అడిగాడు.
గింజలైతే తన పొలంలో చల్లుకుంటే మొక్కలు వస్తాయని, గింజలనే అడిగాడు. ఆ యోగి మరల అడిగాడు. మరల గింజలనే కావాలన్నాడు.
యూనస్ గింజలు తీసుకుని పోతుంటే, దారిలో ఆలోచించాడు – తాను పొరపాటు చేశానని, గింజల బదులు దీవెనలు అడగవలసిందని తిరిగి సూఫీ యోగిని ప్రార్ధించాడు దీవెనలకొరకు.
“తాళం వేయబడ్డది. తాళం చెవి తప్ దుక్ ఎమ్రి వద్ద ఉంది’ అన్నాడు సూఫీ యోగి. అర్ధం చేసుకున్నాడు యూనస్ ఆ మర్మపు వాక్కును.
వెంటనే తప్ దుక్ ఎమ్రి కోసం అన్వేషణ చేశాడు. గురువు దొరికాడు. సాయిబాబా కూడా గురువు కోసం అన్వేషించాడు.
గురుసేవలో అంకితమైపోయాడు. ఏడాది, రెండేళ్ళు, 12 ఏండ్లుకాదు, ఏకంగా 40 ఏండ్లు.
యూనస్ అడవి నుండి కట్టెలు కొట్టి తెచ్చేవాడు. ఆ కట్టెలు వంకర టింకరగా ఉండక, నిటారుగా ఉండేవి. ఇంకా ఆ కట్టెలు కట్టేందుకు త్రాడు బదులు రెండు పాములను వాడేవాడు యూనస్.
40 ఏండ్ల తరువాత యూనస్ తన గురువు ఆశ్రమాన్ని విడచిపోదామనిపించి వెళ్ళిపోయాడు. సాయి సాహిత్యంలో కూడా ఉపాసనీబాబా సాయికి చెప్పకుండా వెళ్ళిపోయాడు.
యూనస్ మరల గురు సన్నిధికి చేరాడు. గురు పత్ని, గురువు ప్రార్థనల కోసం వస్తాడు వేచియుండమన్నది.
బయట చీకటిలో వేచియున్నాడు యూనస్. వార్ధక్యం వలన గురువు యూనస్ ను త్రొక్కుతాడు. “ఎవరు?” అన్నాడు గురువు. “నేను యూనస్ ఎమ్రిని” అన్నాడు యూనస్.
“మా యూనస్ ఎమ్రివా?” అని శిష్యుని కౌగిలించున్నాడు గురువు. ఇక గురు సన్నిధిలో ఉండసాగాడు యూనస్.
ఒక సభలో గురువు ఎవరినో పాటపాడమంటే, పాడలేదు. గురువు యూనస్ ను పాటపాడమన్నారు. ఆశు కవిత్వం పొంగిపొరలింది. అంటే తన గురువు తనకు వేయబడ్డ తాళాన్ని తెరిచారని అర్ధం చేసుకున్నాడు.
ఒక గురు దీవెనలతో బయలుదేరాడు యూనస్. అందరికి అర్ధమయ్యే మార్మిక రీతిలో కవిత్వం వ్రాయసాగాడు.
తన సమాధిని తాను నిర్మించుకుందామని పని ప్రారంభించాడు. తన శిష్యుడు ఏమి చేస్తున్నాడో చూద్దామని గురువు బయలుదేరాడు.
దారిలో నది ఉంది. గురువు ఒక పామును వాహనంగా చేసుకుని నదిని దాటుతున్నాడు.
గురువు తనవద్దకు రావటం చూసి, యూనస్ ఒక గోడపై కూర్చుని గురువు వద్దకు వెళ్ళాడు.
గురువు “నా కంటే నీవు శక్తివంతుడవు” అని శ్లాఘించాడు. గురువు పాదాలపై పడ్డాడు యూనస్. అది శిష్యుని వినయం.
నేడు జూన్ 26. యూనస్ ఎమ్రి వ్రాసిన ఒక వాక్యమును గుర్తుచేసుకుందాం –
“ప్రేమ సూర్యునివంటిది, ప్రేమలేని హృదయం రాయితో సమానం”
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సచ్చా పాదుషా …. మహనీయులు – 2020… జూన్ 19
- కొడుకు పుట్టాల! …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 14
- సువర్ణాక్షరాలు …. మహనీయులు – 2020… ఆగస్టు 11
- అదృశ్య గురువు…. మహనీయులు – 2020… జూన్ 7
- గురువును మించిన శిష్యుడు …. మహనీయులు – 2020… నవంబర్ 1
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments