Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా మహాల్సాపతితో “ఖండోబా నిలయమునకు కష్టములు రానున్నవి” అని పలుకుతారు. అంటే మహల్సాపతి కుటుంబానికి కష్టాలు వస్తాయని సాయి సూచించారు.
అలాగే సిక్కుల గురువైన గురుగోవింద్, బీబీబసంత్ కౌర్ తో ‘ఆనందపూర్ సాహెబ్’ కోటలో కష్టాలు వస్తాయని, అక్కడ నుండి వెడలిపోదలచిన పోవచ్చును అని చెప్పారు.
బసంత్ కౌర్ కు గురువుపైన నమ్మకం గలదు. ఆయన సర్వవ్యాపి, సర్వ సమర్థుడు అని విశ్వాసము.
“నేను నా గురువును విడవనుగాక విడువను” అని నర్డ్వింగా చెప్పింది. గురువుల మాటలు వృధాకావు.
ఆ కోటను ఒకసారి మొగలాయి సైన్యం ముట్టడించింది. ఆ సమయంలో బసంత్ కౌర్ మాతాజీ గుజ్జర్ వెంట ఉంది. ఆమెను సంరక్షించుచున్నది.
వారిద్దరు సరసా నదిని దాటుతున్నారు. అది చలికాలం. పైగా జోరున వర్షం. మాతాజీ గుజ్జర్ ఆవలి తీరం చేరింది.
కాని బసంత్ కౌర్ అక్కడ ఏర్పడిన నదీ జలప్రవాహం వలన కొట్టుకుపోయింది. స్పృహ తప్పింది. ఒక తీరానికి చేరింది.
అదే సమయంలో సముంద్ ఖాన్ అనే మొగలాయి సైనికాధికారి చూశాడు. ఆమెను బందీచేసి తన నివాసానికి తీసుకుపోయాడు.
స్పృహ వచ్చిన తరువాత సముంద్ ఖాన్ ఆమెను ఇస్లాం మతం పుచ్చుకోమని, తనను వివాహం చేసుకోమని కోరాడు. ఆమె అంగీకరించలేదు.
“నా మతము మార్చుకోను, వివాహం చేసుకోను” అని దృఢంగా చెప్పింది. ఆమెకు కొంత గడువుకూడా ఇచ్చాడు ఆలోచించుకోమని.
ఆమె ఆ గది మధ్యలో కూర్చుని గురూజీని, గురుబాణిని స్మరించసాగింది.
ఎనిమిది రోజుల అనంతరం మరల సముంద్ ఖాన్ ఆమె వద్దకు వచ్చాడు. ఆమె అప్పుడు కూడా అంగీకరించలేదు.
“నను కాపాడేది నా గురువే” అని సమాధానమిచ్చింది బసంత్. “నీ గురువు నిన్నెలా రక్షించగలడో చూస్తాను” అంటూ ఆమె వైపు అడుగులు వేయసాగాడు సముంద్ ఖాన్.
వెంటనే ఆమె గురువును ప్రార్ధించింది. “ఆగు. అడుగో నా గురువు” అంది. సముంద్ ఖాన్ గది అంతా చూశాడు. ఎవరు కనబడలేదు.
“నీవు అబద్దాలాడుతున్నావు. నీ గురువు ఇక్కడ లేనేలేడు” అన్నాడు. “అదికాదు అడుగో గురువు చూడు” అంది బసంత్.
ఆమె అసత్యం పలుకుతోందని అడుగు ముందుకు వేయబోయాడు. అడుగు పడలేదు. శిలా ప్రతిమలా మారిపోయాడు.
మాట మాత్రం వస్తోంది. కాళ్ళు, చేతులు పనిచేయటంలేదు. ఇదంతా ఆమె గురు ప్రభావమే అని అనుకున్నాడు. తాను నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు.
ఇక తనను రక్షింపమని వేడుకున్నాడు. ఆమె మరల గురువును ప్రార్ధించింది. సముంద్ ఖాన్ మామూలు మనిషి అయ్యాడు. ఆమెను మరల తన గురువు వద్దకు గౌరవంగా పంపాడు ఖాన్.
ఈ సంఘటన జరిగిన తేదీ వివరాలు తెలియవు. గురువు మన కనులకు కనిపించకున్నా, ఆయన శక్తిని తెలియ చేసిన బీబీ బసంత్ కౌర్ ను స్మరిద్దాం!
గురు వ్యవస్థకు జే జేలు పలుకుదాం!!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- మతిభ్రమించిన మహ్మద్ ఖాన్ ను రక్షించుట
- సాయి సన్నిధిలో గానగంధర్వుడు…..సాయి@366 నవంబర్ 11…Audio
- రాతి హృదయము …. మహనీయులు – 2020… జూన్ 26
- మోక్ష గురువు …..సాయి@366 జూన్ 9…Audio
- బాల గురువు … …. మహనీయులు – 2020… మార్చి 30
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments