Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నాచ్నే అనే సాయి భక్తుడు “దేవపూర్ లోని మా గురుపరంపరలో నేను గురువుగా స్వీకరించి ఉపదేశం పొందేందుకు వయస్సులో నా కంటే పెద్దవారు ఎవరూ లేరు” అన్నాడు నానూ మహారాజ్ తో.
నానూ మహారాజ్ “ఐతే ఏమైంది? నా గురువు నాకన్నా చిన్నవారు” అని వారి గురువును చూపించారు.
బాలుడైన ఆ గురువు పేరు శ్రీపాదరామకృష్ణ థోయిసోడే, వయస్సు 8 సంవత్సరాలు.
గురురాయ్ తరువాత సిక్కు గురువు హరికిషన్ ఐదేండ్ల వయస్సు ఉన్నప్పుడే గురువు అయ్యాడు. ఐతే ఎనిమిది ఏండ్ల ప్రాయంలోనే మహాసమాధి చెందారు. ఆ రెండేండ్ల కొన్ని నెలల గురుత్వంలో ఎన్నో విశేషాలు సంఘటనలు.
లాల్ చంద్ అనే పండితుడు “నీవు గురునానక్ గద్దెనెక్కావు. నీకు మత గ్రంథాలు ఏమి తెలుసు?” అని తృణీకార భావంతో పలికాడు. హరికిషన్ కోపం తెచ్చుకోలేదు.
అప్పుడే ఛజ్ఞురాం అనే ఒక చదువురాని వ్యక్తి, నీళ్ళ కావడిలు మోసి జీవనాన్ని వెళ్ళదీసే వ్యక్తి కనిపించాడు.
ఛజ్ఞురాంను దగ్గరకు రమ్మని పిలచి “ఈ పండితునికి భగవద్గీతార్దాన్ని చెప్పు” అన్నారు.
చూచేవారందరికి ఆశ్చర్యం కలిగించేటట్టు ఆ నిరక్షరకుక్షి నోటివెంట భగవద్గీతా వాహిని ప్రవహించింది. లాల్ చంద్ సిగ్గుతో తలదించుకున్నాడు.
గురుత్వం అనేదానికి వయసుతో పరిమితులు లేవు.
హరికిషన్ ఒకసారి ఔరంగజేబు ఢిల్లీకి రమ్మని కోరితే వెళ్ళాడు. రాజా జయసింగ్ తన సౌధానికి రమ్మని ఆహ్వానించాడు.
“మహారాణి ఎవరో నీవు గుర్తించాలి?” అన్నాడు రాజా జయసింగ్. ఆలా పోయేవారిలో సేవకురాలిగా పనిచేస్తున్న మహిళతో “అమ్మా! నీవు రాణివి, ఈ పరిచారిక దుస్తులేలనమ్మా!” అన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు.
గురు హరికిషన్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే మసూచి వ్యాధి ప్రబలింది. అయన తన సౌధానికి అంటి పెట్టుకుని కూర్చొనక ఆ వ్యాధి సోకినా ప్రాంతాలన్నీ చూచివచ్చాడు.
మహమ్మదీయులు ఆయనపట్ల ముగ్దులై ‘బాల పీర్’ అనే బిరుదునిచ్చారు. ఆ రోగులందరకూ ఆ గురువు సేవ చేశాడు. చివరకు ఆ గురువుకు మసూచి సోకింది.
ఆయన తల్లి సులఖ్ఖని విచారించింది కుమారుని పరిస్థితి చూచి. “అమ్మా! శరీరధారులందరూ శరీరాన్ని విడువవలసిందే” అని ఆ ఎనిమిదేండ్లు నిండని పిల్లవాడు తల్లిని ఓదార్చి,
ఎవ్వరూ నా కోసం దుఃఖించకూడదని చెప్పి, భావి గురువు ఎవరంటే ‘బాబా బాకాలా’ అని సమాధానమిచ్చి, గురువాణిని వింటూ గురువులో ఐక్యమయ్యాడు. ఆ రోజు మార్చి 30, 1664.
నేడు మార్చి 30 గురు హరికిషన్ ను స్మరించెదము గాక!
ఎవ్వరి గురుత్వమును శంకించకుందుము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సూక్ష్మ బుద్ది …. మహనీయులు – 2020… జూలై 7
- దూరంగా ఉండని గురువు… మహనీయులు – 2020 – జనవరి 6
- అదృశ్య గురువు…. మహనీయులు – 2020… జూన్ 7
- గురువు శిష్యుడాయే… …. మహనీయులు – 2020… ఆగస్టు 31
- దైవానికి హృదయంలో గూడుకట్టు… …. మహనీయులు – 2020… మార్చి 28
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments