గురువు శిష్యుడాయే… …. మహనీయులు – 2020… ఆగస్టు 31



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ లోకేనాథ్ (Lokenath) బ్రహ్మచారి గురువు శ్రీ భగవాన్ గంగూలీ. భగవాన్ గంగూలీ మహా పండితుడు.

గురు కటాక్షంతో లోకేనాథులు బ్రహ్మ జ్ఞానులయ్యారు. కానీ, విశేష మేమిటంటే లోకనాథుల గురువు గంగూలీ బ్రహ్మ జ్ఞానీ కాలేదు, ఇంకొక జన్మ ఎత్త వలసి ఉంటుందని ఆ గురు శిష్యులిద్దరకూ తెలిసింది.

గురువైన గంగూలీ నొచ్చుకోలేదు. “లేకేనాథ్, నేను సర్వ శాస్త్రాములలో ఆరితేరిన వాడిని, కానీ నేను శాస్త్రాలను ఆచరిస్తే ముక్తి వస్తుందని నమ్మలేదు.

నీ చేత ఆచరింప చేశాను. బ్రహ్మ జ్ఞానివైనావు. నా తప్పు నేను తెలుసుకున్నాను. నేను మరు జన్మలో నిన్ను ఆశ్రయిస్తాను. నీవు అప్పుడు నన్ను జ్ఞానిగా తీర్చి దిద్దు” అని పలికాడు.

లోకేనాథులు తన గురువే తనకు శిష్యులవటం భరించలేక పోయాడు.

ఇటువంటి సంఘటనను గౌడపాద, గోవిందా భగవత్పాదుల చరిత్రలో కూడా చూడ వచ్చును.

రాధికా మోహన్ రాయ్ ధనవంతుడు. ఉండవలసిన దుర్గుణాలన్నీ ఉన్నాయి. దానికి ఫలితంగా ముఖం కళా విహీనమైనది, కీళ్ల నొప్పులు అధికంగా ఉన్నాయి, ఎడమ భాగానికి పక్షవాతం వచ్చింది.

వైద్యులు ఆయనను ఆరోగ్యవంతునిగా చేయలేకపోయారు. అయన భార్య సలహాపై దైవంపై నమ్మకం ఏర్పరచుకున్నాడు.

విజయ కృష్ణ గోస్వామి ప్రోద్బలం  వల్ల ఆ దంపతులు, మంది మార్బలంతో లోకనాథులను దర్శించారు.

భార్యకు లోకేనాథులపై నమ్మకం ఏర్పడ్డది. వారక్కడనే నివసింపసాగారు. లోకేనాథుల ఆశ్రమంలో కూడా హోదాగా ఉండాలని ప్రయత్నించేవారు.

రాధికా మోహన్ రాయ్ భార్య, లోకేనాథుల పాదధూళిని శరీరానికి రాసుకొమ్మంది. ఆయన ఒక నెల అలా చేశాడు.

పక్షపాతం తగ్గింది, మామూలు మనిషయ్యాడు, కానీ, ఎడమ చేయి స్వాధీనంలోనికి రానేరాలేదు.

ఆయన భార్య తన భర్త ఆరోగ్యానికై అంటే ఎడమ చేయి కూడా పని చేయాలని ప్రాయోపవేశం చేయసాగింది.

లోకేనాథ్ బ్రహ్మచారి ఆతని ఎడమ చేతిని కూడా నయం చేశారు. ఇది వరకు ఎందుకు చేయలేదంటే, రాధికా మోహన్ కు లోకేనాథులపై  పూర్తి నమ్మకం లేనే లేదు.

సరిగ్గా ఇప్పుడు ఎందుకు నయం చేశారంటే లోకేనాథులు ఆయన భార్య భక్తికి లొంగిపోయి.

సాయిబాబా కూడా చద్రబాయి బోర్కర్ భక్తికి లొంగిపోయి, ఆమె భర్తను కాపాడాడు.

లేకేనాథ్ 160 సంవత్సరాలు జీవించారు.

ఈయన జన్మ దినం కృష్ణాష్టమి (1730) (సామాన్యంగా ఆగస్టులో వస్తుంది).

లోకేనాథుల ఈ వాక్కును స్మరిద్దాం. ఆచరిద్దాం!

“నీవు సముద్రంలో కాని, యుద్ధ భూమిలో కాని, దట్టమైన అరణ్యంలో కాని, ప్రమాదంలో ఉంటె నన్ను స్మరించు. నేను నిన్ను రక్షించుతాను!!”

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles