కన్నీటి విలువ…. మహనీయులు – 2020… ఆగస్టు 27



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా రెండే రెండు అతి ముఖ్యమైన పదాలను చెబుతారు. శ్రద్ధ, సహనం. ఇవి ఏ మతానికి సంబంధించినవి కావు. ఇవి కేవలం ఆధ్యాత్మిక పథానికే పరిమితం కాదు.

4వ శతాబ్దానికి చెందినది మొనిక(కా). ఈమె జన్మతః క్రిస్టియన్ మతానికి చెందిన యువతి, కానీ ఆమె క్రిస్టియన్ మతానికి చెందనీ పేట్రిషియస్ అనే వ్యక్తి వివాహమాడింది.

ముగ్గరు పిల్లలు కలిగారు. పేట్రిషియస్  విచ్చలవిడిగా తిరిగేవాడు, వదరుబోతు.

అతని తల్లి కూడా కోడలైన మొనికతో సామరస్యంగా ఉండకపోగా, లేనిపోని చాడీలను కోడలిని గూర్చి ఇతరులకు చెప్పేది.

అయితే, ఇరుగు పొరుగు వారికి, ఊరిలోని వారికి తలలోని నాలుకలా మొనిక ప్రవర్తించి అందరి మన్నలను పొందింది.

తాను క్రిస్టియన్ కాదు కాబట్టి, పిల్లలను క్రిస్టియన్ మతంలో చేరనీయలేదాయన. కానీ మొనిక దైవము యొక్క శక్తిని పిల్లలకు నూరిపోసేది.

పెద్ద కొడుకు ఆగస్టైన్  మేధావి. కాని చెడిపోయాడు. భార్య యొక్క బుజువర్తనాన్ని చూస్తున్న పేట్రీషియస్ మనసు మార్చుకుని, క్రిస్టియన్ మతంలో చేరాడు.

కొడుకు మతం మారటం చూచి తల్లి కూడా మతం మార్చుకుంది. ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఆగస్టైన్ 19 ఏండ్లకే ఉంపుడుకత్తెతో ఒక పసికందుకు తండ్రి అయ్యాడు.

తన కుమారుడు నిజమైన క్రిస్టియన్ అవ్వాలని, సద్గుణరాశి కావాలని ఆమె ఆశించింది, నిరీక్షించింది.

ఎండమావే అయింది ఆమె ఆశ. తల్లిని కూడా మోసం చేశాడు ఆగస్టైన్. కన్నీటితో ప్రార్ధించింది దైవాన్ని.

ఆ కన్నీటి ప్రార్థనలకు బండరాయి కూడా కరగవలసిందే. కానీ దైవం కనికరించలేదు. ఆ కన్నీటి ప్రార్థన ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, ఏకంగా 17 సంవత్సరాలు.

ఆమెకు నిరాశ కలిగినా దైవ సత్తాపై నమ్మకం పోలేదు ఆమెకు. కాలం అనేది నమ్మకాన్ని త్రుంచివేయటానికే దోహదపడుతుంది.

ఆమె కన్నీటిని చూచి “ఆమె కన్నీటి ప్రార్థనలు వృధా కావు. ఆమె కుమారుడు నాశనం కాడు” అన్నారొక మతాధికారి.

దైవం కనికరించాడు. ఆగస్టైన్ మనసు మారింది. క్రిస్టియన్ మతంలోనికి మారాడు. ఇక ఆమె ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు?

ఆమె కుమారునితో ఒకసారి ప్రయాణం చేస్తూ, తన జీవిత ధ్యేయాన్ని దైవం నిజం చేశాడని, తానికి జీవించే అవసరం లేదని కూడా ఆమె చెప్పింది.

కుమారుని చేతులలో కన్ను మూసింది. విశేష మేమిటంటే, ఎవరి కోసం ఆమె కన్నీరు కార్చిందో ఆ ఆగస్టైన్ ఆదర్శ మతాధికారి కావటమే కాకుండా, సెయింట్ పదవిని కూడా పొందాడు.

కుమారుడు సెయింట్ పదవిని పొందాడు, అంతటి వానిని చేసిన ఆ మాత కూడా సెయింట్ అయింది. తల్లి, కుమారులు ఇద్దరు సెయింట్లు కావటం విశేషం.

సెయింట్ మొనికా పుణ్య తిధి ఆగస్టు 27. దారి తప్పిన వారు తిరిగి సత్యపథంలోనికి చేర్పుమని ఈమెను ప్రార్థిస్తారు.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles