Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా తాను నేతపని చేసివాడినని చెప్పారు. కబీరు కూడా ఉత్తర భారతదేశంలో నేతపని చేసేవాడు. దక్షిణ భారతంలో తిరువల్లువర్ కూడా నేతపని చేసేవాడు.
పాండ్య రాజులు పాలిస్తున్నప్పుడు ఈయన మైలాపూర్ లో జన్మించాడు. ఈయన భార్య వాసుకి.
వీరిద్దరి జీవితము ఆదర్శవంతమైంది. అనేక గాథలు వీరి చుట్టూ అల్లుకుని ఉన్నాయి.
ఒక జాతరకు వెళ్ళిన తిరువల్లువర్ తాను నేసిన వస్త్రాలను అమ్ముతున్నాడు.
ఒక పొగరుబోతు బాలుడు ఒక చీరను చేతిలోకి తీసుకుని వేల ఎంత అన్నాడు. ఆ పొగరుబోతు ధనవంతుని కుమారుడు.
యవ్వనము, వైభవము, అధికారము, వివేకము గలవాడు. స్నేహితులను వెంటబెట్టుకుని ఇతరులను నవ్వులపాలు చేసేవాడు.
చీర వేల రెండు రూపాయలన్నాడు తిరువల్లువర్. పొగరుబోతు చీరను మధ్యకు చించి ధర ఎంత అన్నాడు. కోపము తెచ్చుకోకుండా ఒక రూపాయి అన్నాడు తిరువల్లువర్.
పొగరుబోతు ఒక భాగాన్ని మరల మధ్యకు చింపి ధర అడిగాడు. రూపాయి అన్నాడు తిరువల్లువర్. మరల ఒక భాగాన్ని చించి “దీని ధర అర్ద రూపాయి అవుతుంది గదా!” అని ఆ పొగరుబోతు నవ్వసాగాడు. చుట్టూ ఉన్న స్నేహితులు నవ్వసాగారు విపరీతంగా.
ఆ తిరువల్లువర్ ఏ మాత్రం కోపగించుకోకుండా “ఎవరికీ ఉపయోగపడని ఈ చీర ముక్కకు వెల ఏమి ఉంటుంది? డబ్బును ఎలా తీసుకోను” అన్నాడు. పొగరుబోతు అవాక్కయ్యాడు.
గేలి చేద్దామని స్నేహితులతో వచ్చిన ఆ పొగరుబోతుతో “ఈ చీర వృధా కాదు. మా ఆవిడ ముక్కలను కుట్టి కట్టుకుంటుంది” అన్నాడు తిరువల్లువర్.
తిరువల్లువర్ ప్రశాంత వదనం చూచి పశ్చాత్తాపం చెందాడు పొగరుబోతు.
“నీవు దొడ్డ అబ్బాయివి. గత జన్మలో యోగభ్రష్టుడవు” అన్నాడు తిరువల్లువర్.
“ప్రతి వస్తువును డబ్బుతో వెలకట్టలేము. ఈ చీర కోసం పత్తిని పండించటానికి రైతు ఎంత శ్రమపడ్డాడో తెలుసా? పత్తిని వడికి దారం తీయటానికి మా ఆవిడ పడిన శ్రమ ఎంత ఉంటుందో తెలుసా? ఈ చీరను నేయటానికి నేనెంత శ్రమపడ్డానో తెలుసా? మానవులతోపాటు భగవంతుడు కూడా శ్రమలో భాగస్తుడే.
భగవంతుని సహకారం లేనిదే మానవుడు ఏ పనిచేయలేడు. అలాంటప్పుడు భగవంతుని శ్రమకు విలువ కట్టగలమా?” అన్నాడు.
ఆ పొగరుబోతుకు జ్ఞానం అంకురించిది. తిరువల్లువర్ పాదాలపై పడ్డాడు, శిష్యుడయ్యాడు.
తిరువల్లువర్ 1330లో ఖండికలున్న తిరువక్కురుల్ రచించాడు. దానిని తమిళ వేదం అంటారు, మరో బైబుల్, మరో జింద్ అవెస్తాగా పరిగణిస్తారు.
తెలుగులో కూడా అనువాదాన్ని ఎందరో చేశారు. కన్యాకుమారిలో, మహాసాగర్ జిల్లాలో అయన నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించారు.
ఫిబ్రవరి 15 (1960) ఆయన స్మారక తపాలా బిళ్ళ విడుదలైంది.
నేడు 15 ఫిబ్రవరి. ఆయన రచించిన వేదంలోని సూక్తిని పాటిద్దాం –
“సంపద ఉన్నప్పటికి అసూయ నిన్ను పేదవాడిని చేస్తుంది. నీ సంపద దోచుకోవటానికి (వేరే) దొంగ అవసరం లేదు”.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy.
Latest Miracles:
- రాముడే చూసుకుంటాడు…. మహనీయులు – 2020…ఫిబ్రవరి 19
- ప్రసాదపు విలువ…. మహనీయులు – 2020… ఏప్రిల్ 13
- నీకు అర్ధం కాదులే! …. మహనీయులు – 2020… నవంబర్ 15
- కన్నీటి విలువ…. మహనీయులు – 2020… ఆగస్టు 27
- చెప్పుదెబ్బలు …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 28
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “శ్రమ విలువ…. మహనీయులు – 2020…ఫిబ్రవరి 15”
Sai Baba
February 15, 2020 at 8:32 amBaba grace is boundless and priceless…..Sai Baba….Sai Baba