రాముడే చూసుకుంటాడు…. మహనీయులు – 2020…ఫిబ్రవరి 19



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా తాను ఇతర స్నేహితులతో కలసి గురువుకై అన్వేషణ చేశానని చెప్పారు.

ఫిబ్రవరి 19 , 1845లో రాజీవ్ ఇనాందార్, గీతాబాయిలకు బిడ్డడు జన్మించాడు. ఆ శిశువు ధైర్యవంతుడు, తెలివితేటలు కలవాడు. ఐదవ ఏటనే ఉపనయనం చేశారు.

ఒక రాత్రి బాలుడు ఇంట్లో లేకపోతె, కుటుంబ సభ్యులు చుట్టుప్రక్కల వెదికారు. స్మశానంలో ధ్యాన నిష్ఠలో ఉన్నాడు ఆ బాలుడు.

“పాములు, తేళ్లు, నిన్ను భయపెట్టలేదా?” అని తాతగారు అడిగితే “లేదు, మనం ఎందుకు భయపడాలి?” ఎదురు ప్రశ్నించాడు ఆ బాలుడు.

ఇంటిపట్టున ఉంటాడని 11వ ఏటనే వివాహం చేశారు తల్లిదండ్రులు. 12వ ఏట ఇల్లు వదలి గురువుకై అన్వేషించాడు.

హరిపూర్ లో రాధాబాయిని, మీరజ్ లో అనానబువాను, నాసిక్ లో దేవ్ మామ్లేదారును, అక్కల్ కోటలో స్వామి సమర్దను, కలకత్తాలో రామకృష్ణ పరమహంసను కలిసాడు. వారెవరూ ఆయనకు గురువు కాలేదు.

యోహాల్ గాంలో తుకారాం చైతన్యను తన గురువుగా గుర్తించాడు.

కాబోయే ఆ గురువు గణపతిని ఎన్నో పరీక్షలు పెట్టి చివరకు శిష్యునిగా స్వీకరించి, బ్రహ్మచెతన్య అనే పేరును ఇచ్చి “శ్రీరాం జయరాం జయ జయరాం” అనే మంత్రాన్ని ఉపదేశించాడు. గణపతిని బ్రహ్మచైతన్య అని గోందావలెకార్ మహారాజ్ అని అంటారు.

ఒకసారి తల్లిని కాశీ తీసుకువెళ్లాడు. ఆమెను సంతృప్తికరంగా ధన దానాన్ని చేయమన్నాడు.

చాప క్రింద నుండి ధనాన్ని తీసి ఇమ్మన్నాడు. ఆమె అలా దానాన్ని చేస్తూనే ఉంది. ధనం తరగలేదు ఎంతసేపటికి.

“డబ్బు ఎలా వస్తోందిరా?” అని అడిగింది తల్లి. “ఆ సంగతి నీకు అనవసరం” అన్నాడు బ్రహ్మచైతన్య.

ఒకసారి బ్రహ్మచైతన్యకు ఆకలైంది. అక్కడ ఎండిపోయిన పొగరుబోతు అవును ఎవరో చూపారు. ఆ గోవుకు బ్రహ్మచైతన్య నమస్కరించి “అమ్మా! నాకు ఆకలిగా ఉంది” అన్నాడు.

ఆ గోవు పాలధారను ప్రవహింపచేసింది. ఇది చూసి అందరు ఆశ్చర్యపోయారు. గోందావలె రామ మందిరం నిర్మంపదలచాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు.

పని మొదలైంది. ధనం దానంతట అదే వచ్చేది. విగ్రహ ప్రతిష్ట రోజు దగ్గర పడుతొంది. విగ్రహాలేవీ లేవు. అందరూ కంగారుపడుతుంటే

“ఇది రామ మందిరం. రాముడు చూసుకోడా ఆ సంగతి?” అన్నాడు. సీతా రామ లక్ష్మణుల విగ్రహాలను ఎవరో తెచ్చి ఇచ్చారు – రాముడు నిన్న స్వప్నంలో కనిపించి ఈ విగ్రహాలను మీకు అందచేయమన్నాడని చెప్పాడు.

ముముక్షువులకు తమరు ఏదైనా గ్రంథం వ్రాస్తే బావుండేదని అన్నారు ఎవరో.

“నేను వ్రాసిన దాసబోధ ఉంది గదా!” అన్నారు బ్రహ్మ చైతన్య. అప్పుడు అందరకూ తెలిసింది బ్రహ్మచైతన్య గతంలో రామదాసులవారని.

“భగవంతుని పేరు ఎక్కడ స్మరిస్తారో, అక్కడ నేనుంటాను. ఇదే నేను ఇచ్చే మాట” అంటారు చివరి వాక్కుగా.

నేడు ఫిబ్రవరి 19. బ్రహ్మచైతన్య జయంతి దినం. ఆయనను స్మరించెదము గాక!

శ్రీరామ జయరామ జయ జయరామ.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles