”నేను అపకారం చెయ్యడానికి రాలేదు. కళ్యాణం చెయ్యడానికి వచ్చాను.”



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నాకు తరచూ ‘శిరిడి’ కి వెళ్లకుండానే గురుస్థాన మందిరం కలలోకి వస్తూ ఉండేది .

ఒకసారి నేను, మా కుటుంబం తో శిరిడి వెళ్లి అక్కడ గురుస్థానం చూసి ఆశ్చర్యపోయాను.

మధ్యాహ్నం హారతి సమయంలో అందరం గురుస్థానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం, మొదటి ప్రదక్షిణ అయి, బాబా ఫోటో ఎదురుగా రాగానే

సడన్ గా కుడి చేతి వైపు చెట్టు మొదట్లో ఒక స్టూలు, దాని మీద అచ్చు బాబా లాంటి పోలికలతో ఇరవై, ఇరవై ఐదు సంవత్సరాలు వయసు ఉన్న అబ్బాయి అక్కడ కూర్చొని ఉన్నాడు.

బాబా లాగే ఎడమ కాలు మీద కుడికాలు వేసుకొని, అతని చూపు శూన్యంలో ఉంది. అంటే ఏ భావమూ లేదు.

ఒక్క మాట మాట్లాడలేదు. పాదుకలు మీద ఉన్న పెద్ద ముద్ద బంతి పువ్వు తీసి నా చేతికి ఇచ్చి ”నీ ఎడమ వైపు చీర కుచ్చిళ్లలో దోపుకో” అని అంటున్నాడు.

అది పువ్వు పెట్టుకునే స్థలమా? ఈ లోగా మా ‘పాప నాకివ్వు పువ్వు’ అని అడిగితే తన తలలో పెట్టి రెండో ప్రదక్షిణం ముగించాను .

మళ్ళీ మరో పువ్వు ఇచ్చి ”దోపుకో” మని సైగ చేసాడు. రెండో పాప ‘నాకివ్వు’ అంది. అది తీసుకున్నది .

3 వ ప్రదక్షిణ పూర్తికాగానే ఎవ్వరికి ఇవ్వవద్దు అని సైగ చేసి, మరో పెద్ద ముద్ద బంతి పువ్వు పాదుకల మీద నుండి తీసి  ‘ఎడమ వైపు నడుము దగ్గర దోపుకోమని పదే పదే సైగ చేసాడు. నేనలాగే చేశాను .

చీర లోపలనుండి ఆ పువ్వు నా పొత్తి కడుపును తాకుతోంది. ఆ తర్వాత నా చెయ్యి పట్టుకొని, ‘ఊది’ ఉన్న స్టాండ్ దగ్గరికి తీసుకు వెళ్ళాడు. నా నుదుట ఊది పెట్టాడు.

తన చేత్తో ఊది తీసి, పువ్వు పెట్టుకోమన్న చోట, నా ఎడమ పొట్ట వైపు తానే రాయబోయాడు.

తెలివిని కప్పిన మాయ నన్ను ఆవహించి తన చేతిని ఆపి, నేను రాసుకుంటాను అని సైగ చేసి, గురుస్థాన గోడ అవతలికి వెళ్లి నేను రాసుకున్నాను.

‘ఏమో! నా కన్నా ఎంత చిన్నవాడు అయినప్పటికీ  ‘మద పిచ్చి ఉన్నవాడేమో !’ అని భ్రమించి నేనలా వద్దని వెడుతుంటే, అతని మోహంలో కనిపించిన భాధ నేనింకా మర్చిపోలేదు.

మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత మూడు రోజులలోనే నాకు కడుపునొప్పి వచ్చి స్కానింగ్ చేస్తే అతను ‘ఊదీ’ రాయమన్న చోట , పువ్వు దోపుకోమన్న చోట పెద్ద ‘ ఒవేరియన్ సిస్ట్ ‘ ఉన్నట్టుగా తేలింది.

బాబాను, ఆయన దయను తలచుకొని వెక్కి వెక్కి ఏడ్చాను. ఆయనను బాబాగా గుర్తుపట్టనందుకు , శిరిడి నుంచి వచ్చిన నెల లోపే నాకు వృత్తి లోను , ఆరోగ్య పరంగాను సమస్యలు తలెత్తాయి.

మరోసారి షిరిడీకి వెళ్ళినప్పుడు, మా ఆడ పిల్లలు, మా వారు ద్వారకామాయి లోపలకి వెడుతున్నారు. ఇంకా మెట్లు ఎక్కుతున్నారు.

నేను, మా అబ్బాయి అక్కడే కూర్చొని ఉన్నాం నేను, ”బాబా నువ్వారోజు కనపడితే నేను గుర్తించ లేక పోయాను. ఈ రోజు కూడా నువ్వు నాకు కనపడు బాబా” అని దండం పెట్టుకొని కళ్ళు తెరిచేటప్పటికి

అక్కడ అరుగు మీద అప్పుడు గురుస్థానం లో కనిపించిన అతను ఇప్పుడు ఇక్కడ ఉండి లోపలకి వెడుతున్న మా వాళ్ళని దీవిస్తున్నాడు .

నేను కళ్ళు తెరవడం చూసి, ఆయన నా దగ్గరికి వచ్చి నా చెయ్యి పట్టుకున్నాడు. నన్ను ఆయన ద్వారకామాయిలోకి తీసుకెళ్లబోతూ ఉంటే, పక్కనే ఉన్న మా అబ్బాయి చెయ్యి పట్టుకున్నాను ద్వారకామాయిలో చాలా రద్దీగా ఉంది.

అడుగు పెట్టడం కూడా చాలా కష్టంగా ఉంది . అలాంటి జనంలోనుంచి ఎలా తీసుకువెళ్లాడో లోపలకి తీసుకు వెళ్లి తిన్నగా కుండ దగ్గరకి తీసుకెళ్లి ఆ కుండ లోనుంచి నీళ్లు తీసి నాకు ,మా అబ్బాయికి  తీర్థం ఇచ్చాడు .

అవి మేము తాగాము .నేనాయన పాదాలు వంగి నమస్కరించుదామని చూసేసరికి ఆయన కాళ్ళ నిండా చాలా బురదగా ఉంది .

అది చూసి నేను బురదగా ఉన్న కాళ్ళకి నేనట్లా నమస్కారం చేయను, అనుకోని ద్వారకామాయికి ఉన్న అటు గేట్ నుండి బయటికి వచ్చేసాను.

బయటికి వచ్చాక నేనప్పుడే స్పృహ లోకి వచ్చినట్లు అయి అదేంటి? బాబా కాళ్ళకి బురద ఉంటే నాకేంటి? నేను దండం పెట్టుకోవచ్చు కదా! అనుకుని వెంటనే వెనుదిరిగాను .

ఇదంతా జరగడానికి రెండు నిముషాల సమయం కూడా పట్టి ఉండదు .

నేను తిరిగి ద్వారకామాయి లోకి అడుగు పెట్టేసరికి ఇంతకు ముందున్న జనం ఎవ్వరూ లేరు, ఒక పూజారి మాత్రం ఒక పెద్ద నిచ్చెన ఎక్కి పైన కప్పు దులుపుతున్నాడు .

నేను ఇక్కడొకతను ఉండాలి అంటూ పూజారిని అడిగితే , ”ఇక్కడ ఎవరూ లేరు, చాలా సేపటినుండి నేను మాత్రమే ఇక్కడ ఉన్నాను, వేరే ఎవ్వరూ లేరు ” అని చెప్పాడు .

నాకు బాబా కనపడితే దండం పెట్టుకోలేక పోయానే అని బాధ పడుతుంటాను. ఒక్క సెకనులో సీను ఎలా మారిపోయిందో. ఇదంతా బాబా చమత్కారం.

ఒక రోజు రాత్రి సడన్ గా మా చిన్నమ్మాయికి చాలా జ్వరం , విపరీతమైన తల నొప్పి అని ఏడవసాగింది. అప్పుడే నేను ఒక ”మెదడు వాపు” కేసు చూడడం జరిగింది. చాలా ఆందోళన పడ్డాను.

బాబా ”ఊదీ” పాప నోట్లో కొంచెం వేసి నుదుటి మీద రాస్తూ ”ఏమిటో ‘శిరిడి’ నుండి వచ్చిన దగ్గరి నుండి అన్నీ ఇలా జరుగుతున్నాయి ” అనుకున్నాను.

పాప పక్కనే పడుకొని మెదడు వాపే మోనని అనుమానం తో భయపడుతున్నాను. అంతలో పాప నిద్ర జ్వరం కలిసిన మైకంలో నీ పేరేంటి ? అంది. నేనేమీ మాట్లాడలేదు.

మళ్ళీ నీ పేరేంటి? అంది. ‘నా పేరు సరస్వతి’ అని చెప్పాను. అయినా మళ్ళీ మళ్ళీ నీ పేరు ఏంటి? అని పాప అడగడం జరిగింది .

రెండు మూడు రోజుల తర్వాత పాపకి జ్వరం తగ్గాక స్నానం చేయిస్తూ ఉంటే, అమ్మా నాకు బాబా కనిపించాడు.

”నాకు జ్వరం వచ్చినప్పుడు నా మంచం ఎదురుగా ఎర్ర చొక్కాతో తలకి బట్ట కప్పుకొని నించున్నాడు”  (మా ఇంట్లో ఉన్న బాబా ఫొటోలో బాబా బట్టలు ఎర్రగానే ఉన్నాయి).

మీరా ! బాగా చదువుతున్నావా ? అని అడిగారు ” ఆ బాబా చదువుతున్నాను” అని చెప్పాను అంది. ఆ తర్వాత నేను బాబాని ” నీ పేరేంటి ?” అని అడిగాను.

తను నా పేరు ”కల్యాణ చక్రవర్తి” అని చెప్పాడు, అంది. నేను నిశ్చేష్టురాలినయ్యాను.నీ పేరేంటి? అని పాప కలవరించితే ఆయన ” కల్యాణ చక్రవర్తి ” అని చెప్పాడని పాప చెప్పింది.

నేను శిరిడి నుండి వచ్చాక అన్ని చికాకులుగా ఉన్నాయి అని అనుకోవడం వలన ఆయన ఇచ్చిన జవాబు అనిపించింది .

అంటే , ”నేను అపకారం చెయ్యడానికి రాలేదు .కళ్యాణం చెయ్యడానికి వచ్చాను” అని బాబా చెబుతున్నారు.

కళ్యాణం అంటే జీవాత్మ పరమాత్మతో కలిసేదే కళ్యాణం .నిజంగానే నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నా కన్నా ఎక్కువగా బాబా శ్రమించి నాతో ఆత్మోద్ధరణ గావించాడు.

మన తండ్రికి మనం కృతజ్ఞతలు చెబితే సరిపోతుందా ? మన ఆత్మకు పరమాత్మతో అనుసంధానం చెయ్యడానికి మనం చేసే ప్రయత్నాలే ఆయన ఋణం తీరుస్తుంది, అని అనిపిస్తుంది.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles