YOU LOOK AT TO ME – I LOOK AT TO YOU



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భక్తురాలు: అనురాధ

నివాసం: హైదరాబాద్

కాశీ స్నాన జప ప్రతిదివసి  – కొల్హాపుర బిక్షేసి

నిర్మల నదితుంగ  జలప్రాసి_నిద్రామాహురదేశి ఐసాఏ ఈబా!

“ప్రతి రోజు కాశిలో స్నానం చేసి, కొల్హాపురంలో భిక్ష తీసుకొని, తుంగభద్రలో నీరు సేవించి మహురంలో నిద్ర చేసే సాయి దేవా మీకు నా ప్రణామాలు”.

సాయిబంధువులకు సాయిరాం, నా పేరు అనురాధ. అంబర్ పెట్. అద్భుతమైన సాయి లీలను   మీతో పంచుకోవడానికి బాబా గారు నాకు అనుమతిని చ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది.

ఒకసారి నేను దిల్ సుఖ్ నగర్ బాబా గారి గుడికి వెళ్లినప్పుడు బాబా గారి దర్శనం చేసుకోవడానికి రెండు గంటల సమయం పట్టింది. ఇంత సేపు ఎవరు ఉంటారు లైన్ లో అని మా ఫ్రెండ్ తో అన్నాను.

నా స్నేహితురాలు మంచి సాయి భక్తురాలు. తాను నన్నుపూర్తిగా బాబా తత్వంలోకి తీసుకుపోయే ప్రయత్నంలో జరిగిన లీలను వివరిస్తూ ఉన్నాను.

నా స్నేహితురాలు బాబాకు ఊరికే చెబుతుండేది అనురాధకి కనిపించు బాబా తాను నిన్ను  నమ్మాలి అని.

తాను ఒకసారి నాతో చెప్పింది. ఇంకోవారం రోజుల్లో గురుపౌర్ణమి వస్తుంది. బాబా గారు నాకు గులాబీ మాల ఇస్తారని చెప్పింది.

అదెలా నీకెలా తెలుసనీ అడిగితే, నేను మనసులో కోరుకున్నా కదా! నాకు తెలుసు ఇస్తారని అని చెప్పింది.

గురుపౌర్ణమి రోజు ఇద్దరం కలిసి బాబా గుడికి వెళ్ళాం. కానీ పంతులు గారు గులాభిమాల తీసుకొచ్చి నాకు ఇచ్చారు.

ఐతే నేను తనకి ఇస్తూ అన్నాను. బాబా గారి మాల కావాలని ఉందిగా తీసుకో అని! కానీ నాకు మనసులో గులాబీ పువ్వు కావాలని ఉంది.

తన సంతోషంకు అవధుల్లేవు కానీ నేను అనుకునేదాన్ని, తన  అంత భక్తురాలిని నేను కాదని.

అయితే మాకు వీలైనప్పుడల్లా దిల్ సుఖ్ నగర్ బాబా టెంపుల్ కి వెళ్ళేవాళ్ళము.

అయితే ఇంట్లో కొన్ని విషయాల పరంగా నా మనసేం బాగాలేదు. బాబాని అడిగాను.

ఏమిటి “U  look  at to me  – I Look AT  to U”  అన్నావు. మరి నన్నెందుకు చూడట్లేదు. నాకెందుకు ఇన్ని బాధలు కలిగిస్తున్నారని అనుకున్నా.

ఎందుకో నా మనసుకు దిల్ సుఖ్   నగర్ బాబా టెంపుల్ కి  వెళ్లాలని అనిపించి వెళ్ళాను.

అక్కడికి కమిటీ మెంబెర్ భార్య వచ్చింది. తను లైన్ లో నాకన్నాఇద్దరి ముందు ఉంది.

అయితే పంతులుగారు తనకి గులాబీ మాల ఇచ్చారు. వెంటనే బాబాతో అన్నాను. నాకెందుకు ఇస్తావులే కమిటీ వాళ్లకు, డబ్బున్న వాళ్లకు ఇస్తావని.

బాబాకి మొక్కుతూ వెళ్లి ఒక సైడ్ కి అని కూర్చున్నాను. నాకన్నా ముందు మూడు లైన్ లలో భక్తులు కూర్చొని ఉన్నారు. నా ముందు గులాబీ మాల తీసుకున్న ఆమె  ఉంది.

తన జడలో పువ్వు కింద పడితే చూసుకోండి అని పిలిచాను. తరువాత బాబాని అడుగుతున్నా ఏం ఇవ్వవా  బాబా అని.

తను నా వెనక్కి కూడా తిరగకుండా ఒక గులాబీ పువ్వు ఇచ్చింది. ఆశర్యం అనిపించి బాబా తను నా వైపు తిరిగి కూడా చూడకుండా గులాబీ పువ్వు ఇస్తుంది.

బాబా నువ్వు నా మాటలు వింటున్నావని అర్ధం అయింది అని మనసులో అనుకున్నాను.

నేను తన కళ్ళలోకి చూస్తే, ఆ కళ్ళు విగ్రహ రూపంలో ఉన్నా బాబా గారి లాగా కనపడుతున్నాయి ఆశ్చర్యం వేసింది.

5 నిముషాలు నేను నాలా లేను అటువంటి ఒక స్థితిలో ఉండిపోయా! బాబా గారు నా కోరిక తీర్చడానికి ఆమె రూపంలో వచ్చి నాకు రోజ్ ఇప్పించారు. నన్ను పూర్తిగా మార్చేశారు. అంత బాబా గారి దయ.

ఈ సన్నివేశంను నేను  నా లైఫ్ లో మర్చిపోను.

    ~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~

***సాయిసూక్తి:

 

  “అన్నం లేని వాడికి అన్నం పెట్టు భగవంతుడు సంతృప్తి చెందుతాడు”.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles