అదృశ్య హస్తం – సుఖ ప్రసవం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భక్తురాలు:అనురాధ

నివాసం:హైదరాబాద్

సాయి రహమ్ నజర్ కర్ నా- బచ్చోంకా  పాలన్ కర్ నా !

మై అంధహు బంధా ఆప్ కా – ముఝకో ప్రభు దిఖలానా !!

“బాబా మీ కృపా దృష్టి మాపై ఉంచండి. మీ పిల్లలమైన మమ్మలిని ఏలుకోండి. అజ్ఞానం అనే  అంధకారంలో ఉన్న మీ బానిసని ఎలాగైనా నాకు మీరే భగవంతుణ్ణి చూపాలి. మీకు నా ప్రణామాలు”

సాయి బందువులకు సాయిరాం. నా పేరు అనురాధ. మాది అంబర్పెట్.

నేను చిన్నగా  ఉన్నప్పుడు అంటే 35 సంవత్సరాల క్రితం మా నాన్నగారు మా అందరిని నెలనెలా శిరిడీ తీసుకుని పోయి 5 రోజులు ఉండి వచ్చేవాళ్ళం.

అక్కడి పంతుళ్లు మా నాన్నగారికి పరిచయం ఉండడం వల్ల మా నాన్న గారు స్వయంగా శిరిడీ బాబాకి అభిషేకం చేసేవారు.

మేము రాత్రిళ్ళు బాబా మూర్తి ఉందిగా దాని ముందే పడుకునే వాళ్ళం. రోజు నాలుగు హారతులు పాడే వాళ్ళం.

మా నాన్నగారైతే బలవంతంగా ఐనా హారతికి తీసుకెళ్లేవారు. నేను అప్పుడు మా నాన్న గారికి పిచ్చి అని, బాబా పిచ్చి అని అనేదాన్ని.

అంత దగ్గరగా నెల నెలకు శిరిడీ వెళ్లినా నాకు బాబా పై నమ్మకం కలిగేది కాదు. నాకు పెళ్ళైన తరువాత కూడా పెద్దగా భగవంతుడిని నమ్మే దానిని కాదు.

జీవితంలో చాలా కష్టాలను ఆటుపోట్లను ఎదుర్కొని ప్రస్తుతం ఈ పరిస్థితిలో ఉన్నాం. నా జీవితంలో జరిగిన ఒక లీలను మీతో పంచుకుంటున్నాను.

నేను ప్రెగ్నెంట్ గా ఉన్న సమయం అది. నాకు బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పారు. కాబట్టి నేను తొమ్మిది నెలల వరకు మంచం మీదనే ఉన్నాను.

తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలి అని డాక్టర్ లు చెప్పారు. అప్పుడు నాకు తొమ్మిదో నెల బెడ్ మీద ఉన్నాను. నా పక్కన ఎవరు లేరు.నేను కొంచం పడుకుని ఉన్నాను. నాకు బాగా గుర్తుంది.

నా కడుపు పక్కనుండీ ఒక “అదృశ్య హస్తం” నాకు కనపడుతుంది. చెయ్యి వేళ్ళు కనపడుతున్నాయి నేను స్పృహలోకి వచ్చేసరికి నా కడుపు మీద గట్టిగా కొట్టినట్టు అయింది.

వెంటనే గట్టిగా అరుస్తూ మా అమ్మకి చెప్పాను. ఎవరో కొట్టారమ్మా నా కడుపు మీద అని. ఎవరు లేరు అంత చూసాను అంది. లేదు నేను చేతులు చూసా అని చెప్తే అంతా నీ భ్రమ అని చెప్పింది.

కానీ నేను చూసాను. నేను టెన్షన్ పడుతున్నానని నన్ను మా అమ్మ హాస్పిటల్ కి తీసుకు వెళ్ళింది.

కాస్త డాక్టర్ తో మాట్లాడితే కుదుట పడతానని. డాక్టర్ పరీక్ష చేసి నాకు ఇంకా రెండు గంటల్లో డెలివరీ అవుతుందని. అసలు తనకి డెలివరీ అవడానికి చాలా సమయం ఉంది కానీ బాడీ హెడ్ కిందకు వచ్చింది ఇంత తొందరగా ఇలా జరగానే జరగదు. ఇది ఎలా సాధ్యం అంటూ డాక్టర్ లే ఆశ్చర్యపోయారు.

ఆపరేషన్ చేయాలి అన్నారు. కానీ బాబా దయ వలన నార్మల్ డెలివరీ అయ్యి బాబు పుట్టాడు.

కుండపోతగా వర్షం. అసలు బాబుకు పాలు పట్టడానికి బాటిల్ కూడా బయటకు తీసుకురాలేని పరిస్థితి.

బాబాను ప్రార్థిస్తే ఎవరో ఒకరు పాల బాటిల్ తెచ్చి ఇచ్చారు.

బాబా అదృశ్య హస్తం అలా వచ్చి ఉండకపోతే నేను ఆరోజు హాస్పిటల్ కి వెళ్ళేదాన్ని కాదు. ఇంకా ఇంటి వద్దే ఉండి ఉంటే బేబీకి ప్రమాదం జరిగి ఉండేదని డాక్టర్ చెప్పారు.

+నాకు అంతకన్నా ముందు మూడు సార్లు అబార్షన్  అయింది. ఇప్పుడు అదే జరిగితే నేను తట్టుకోలేక పోతుండేదానిని. నన్ను నా కడుపులోని బిడ్డను కాపాడింది ఆ సాయి నాథుడే ఎన్ని  కృతఙ్ఞతలు చెప్పినా గాని తక్కువే తనకి.

~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~

***సాయిసూక్తి:

 

“ఎవరైనా నిన్ను ఏదైనా అడిగితే నీ దగ్గర ఉంటే ఇవ్వు లేదంటే ఇవ్వను అని మంచిగా చెప్పు అంతే కానీ ఎదుటి వాళ్ళ మీదకు అరవవద్దు”.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles