Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
10 సంవత్సరాల క్రిందటి విషయం. నా కోడలు ఆశ, మొదటిసారి గర్భవతి అయింది.
తొమ్మిది నెలల పాపం చెప్పలేనంత కష్టాలు పడింది. ప్రసవం కూడా మామూలుగా కాలేదు. operation చేశారు ఒక అబ్బాయి పుట్టాడు.
నా కోడలు పడిన కష్టాన్ని మనసులో పెట్టుకొని, నా కొడుకు, కోడలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంక మనకు పిల్లలు వద్దు ఒక్క కుమారుడు చాలు అని దృఢ సంకల్పం చేసుకున్నారు.
ఇప్పుడు చెప్పబోయేది వినండి. మా మనవడు 5 సంవత్సరాల పిల్లడు అయ్యాడు. ఎప్పుడు ఎదురింటికి వెళ్ళి కూర్చునే వాడు. వాళ్ళు శిరిడీ సాయిబాబాకు మంచి భక్తులు.
T .V లో వచ్చే సాయిబాబా సీరియల్ మా చిన్న మనవడు రోజు వెళ్ళి చూసేవాడు. మా ఎదురింట్లో వాళ్ళు బాబా హారతి, భజనలు అన్ని చేసేవారు. ఈ పిల్లాడు వాళ్ళింట్లో జరిగే అన్ని సాయిబాబా భజనలకు attend అయ్యేవాడు.
ఆ బాబా కృప ఏ రూపంలో ఎవరిపై వర్షింస్తుందో చెప్పడం చాలా కష్టం. 5 సంవత్సరాల పిల్లాడు సాయి మహిమలు భజనలు పాడేవాడు. వాడు వాళ్ళ అమ్మ, నాన్నలను బాబా గుడికి వెళ్దాం, భజనలు, హారతులు చేద్దాం అని పోరు పెట్టేవాడు. అందుకని రోజు వాడిపోరు పడలేక తల్లిదండ్రులు ఇంట్లోనే మారాఠి హారతులు చేయడం మొదలు పెట్టారు.
ఇలా రోజులు గడుస్తూ వుండగా, మా కోడలు వద్దు వద్దు అనుకుంటూనే మళ్ళీ గర్భవతి అయింది. మా మనవడు ఎప్పుడు అడిగేవాడు “అమ్మ నాకో చెల్లి కావాలి” అని. ఇది మాములుగా అందరి ఇండ్లలో జరిగేదే.
ఆ సాయిబాబా హారతులు చేస్తున్నాం కదా! అందుకే నేమో మా కోడలికి ఏ కష్టం రాకుండా నెలలు గడుస్తున్నాయి.
కానీ doctor ఆదేశానుసారం Sonography చేయించాము. చూస్తే ఏముంది ఇద్దరు పిల్లలు వున్నారు కవలలు. మా ప్రాణాలు భయంతో కపించిపోయాయి.
బాబా ఎలా, ఒక్క బిడ్డనే కష్టం అనుకుంటే ఇప్పుడు ఇద్దరు అంటున్నారు. ఇంక నీవే దిక్కు స్వామి అనుకుంటున్నాము.
మా తడబాటు అంతా నా మనవడు వింటున్నాడు. ఏదో అర్ధం అయి, కాక అలా వున్నాడు. కానీ వాళ్ళ అమ్మతో అంటున్నాడు. ఏమి కాదు మమ్మి , బాబా వున్నారు కదా! అంటున్నాడు. అంత చిన్న 5 సంవత్సరాల పిల్లాడికి ఎంత నమ్మకం బాబా మీద, మేము ఆశ్చర్య పోయేవాళ్ళం.
మా అందరికన్నా మా చిన్న మనవడి మనసు, భక్తి, విశ్వాసాలు బాబాకు బాగా నచ్చాయి. పిల్లలు దేవతలతో సమానం అంటారు. అంత చిన్న మనసులో బాబా పైన అపారమైన భక్తి, విశ్వాసాలు వున్నాయి.
9 నెలల తరువాత మా కోడలికి ప్రసవం అయింది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పుట్టారు. పైగా నార్మల్ డెలివరీ అయింది. తల్లి, పిల్లలు క్షేమంగా వున్నారు.
నేను విశ్వాస పూర్వకంగా చెప్తాను. ఎవరైతే నిజమైన భక్తి శ్రద్దలతో చిన్న అయినా, పెద్ద అయినా, ఎవరైనా ఆ సాయినాథుడిని నమ్ముకుంటారో వాళ్ళ కార్యలన్ని బాబా స్వయంగా చేయిస్తారు. నా చిన్న మనవడి మాటలు ఇందుకు ప్రమాణం. అందుకే అందరూ ఏకకాలంలో అనండి.
“అనంత కోటి బ్రహ్మాది నాయక, రాజాధిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై .
మదన్ గోపాల్ గోయల్
కోట, రాజస్థాన్
ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్
Latest Miracles:
- బాబా! నా జీవితాన్ని నీచేతిలో పెడుతున్నాను. నీదే భారం తండ్రీ” అని ఏడ్చేశాను—Audio
- అదృశ్య హస్తం – సుఖ ప్రసవం
- నా మీద బాబా కు చాలా కృప ఉంది, నా పిల్లలు కూడా నాకు ఇంత సంతోషం ఎప్పుడూ ఇవ్వలేదు.
- కష్టములొ ఉన్న భక్తురాలికి, మరచిన మ్రొక్కును గుర్తు చేసిన బాబా వారు….
- సమస్యలలో ఉన్న తన తోటి సాయి భక్తులకు సచ్చరిత్ర, సహస్రనామ పారాయణ ద్వారా పరిష్కారం చూపించిన రాజేశ్వర రావు గారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
8 comments on “పిల్లలు వద్దు అనుకున్న భక్తురాలికి , సుఖ ప్రసవం ద్వారా కవలలను ప్రసాదించినా బాబా వారు”
Rohith T V
January 4, 2018 at 9:00 amOm Sai Ram!
Pathuri
January 4, 2018 at 9:01 amSairam
Madhavi
January 4, 2018 at 3:09 pmdayaku prathiroopamee dharma paadham..saranam sri sai paadham.
Vidya
January 4, 2018 at 7:30 pmOm Sairam
Vidya
January 4, 2018 at 7:30 pmOm Sairam !!
Prathibha sainathuni
January 5, 2018 at 10:15 amSaibaba saibaba saibaba saibaba…
T.v.pramada
January 6, 2018 at 12:06 pmOm Sai ram
kishore Babu
January 7, 2018 at 4:01 amబాబా వద్దు అనుకుంటేనే ఇస్తారు కొన్ని విషయాలలో……సతచరిత్ర లో తాత్యాకు కూడా మొదటిలో సంతానము లేదు….ఒక్క సారి బాబా ఆశీర్వదించిన తర్వాత …..ఎంతో మంది కలిగారు…ఎప్పుడు షిర్డీ అంతా వాళ్లే…