మాట పోయిన భక్తునికి మరల మాట్లాడునట్లు చేయించిన బాబా వారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా భక్తులు దూర దురాన వున్న పల్లెల్లోనే కాదు, పెద్ద పట్టణాలలో కూడా వున్నారు.

బాగా విద్యావంతులు, ధనవంతులు,రాజులు,మంత్రులు. ఆయన భక్తికి ఒక కాల, వర్ణ , వర్గాలతో సంబంధం లేకుండా అన్ని చోట్ల వున్నారు.

వాళ్ళలో ఒకళ్ళు ఈ సాయి భక్తుడు, ఆయన ముంబయి పోలీసు service agency లో పనిచేసే శ్రీ జగదీశ్ లోహర్కర్. ఈయన “శ్రీ సాయి రాజమిత్ర మండలి’ అధ్యక్షుడు. అదీ కూడా కాకుండా ముంబయి నుంచి శిరిడీ కి పాదయాత్ర కూడా చేస్తారు.

ఈయనకు సాయి భక్తి తల్లిదండ్రుల నుంచి వచ్చింది. ఈయన 1977 లో మొదటి సారి శిరిడీ యాత్ర వెళ్ళారు.

పోలీసు విభాగంలో వుద్యోగం రావడానికి ముందు అంటే 1980 – 85 వరకు ఆయన తన స్నేహితులతో కలిసి ప్రతి సంవత్సరం శిరిడీ వెళ్ళేవాడు.

బాబా యందు భక్తి విశ్వాసాలు వున్నాయి ఈయనకు.  దాని వల్లనే ఈయన జీవితంలో అద్భుతమైన ఘటన జరిగింది.

2003 లో ఈయన మహారాష్ట్ర కొంకణ్ విభాగంలో రాజాపూర్ పోలీస్ స్టేషన్ లో ఉద్యోగం చేసేవారు.

అందువలన అక్కడ రాజకీయ పరిస్థితుల వలన ఆయన మానసిక పరిస్థితి మీద చాలా ప్రభావం పడింది. అంత ఉద్వేగ భరితమైన వాతావరణములో పాపం ఆయన వాక్కు(అంటె మాటలు) పడిపోయింది. మానసిక ఒత్తిడి వలన మూగవాడు అయ్యాడు.

ఎంతోమంది doctors కు చూపించారు వాళ్ళ ఊరిలో. ఏ ప్రయోజనం లేకపోయింది. తరువాత ముంబయి(జన్ లోక్) జస్లోక్ ఆస్పత్రిలో పెద్ద పెద్ద doctors కు చూపించారు. Doctors అందరూ ఏకగ్రీవంగా అన్నారు., దీనికి treatment ఏమి లేదు.

ఇలా ఏదో లక్షల్లో ఒకరికి అవుతుంది, దీనికి ఇంతవరకు సరియైన మందులు లేవు. అందుకే మేము ఇంకా ఏమి చేయలేము’ అని చేతులేత్తెశారు.

జస్లోక్ Doctors ఆలా అంటె ఇంకా ఆయన పరిస్థితి వర్ణనాతీతం. వేరే Doctors దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు అన్ని tests చేసి అన్ని normal గా వున్నాయి. ఎందుకు ఇలా అయిందో చెప్పలేము అన్నారు.

ఇంకా లోహర్కర్ మూగవాడు అయ్యాడు. ఆయన భార్య దిక్కుతోచకుండా వుంది. అప్పుడు ఆమె మనసులో అనుకుంది. మనము సాయిబాబా ను ఎలా మర్చిపోయాం. అయ్యో ప్రభూ…మా మంద బుద్ది , నీ మాయ నిన్ను మర్చిపోయేటట్లు చేసింది సాయి అని అనుకుంది.

ఎక్కడైతే మందులు పనిచేయవొ అక్కడ ఆ భగవంతుని దీవెనలు పనిచేస్తాయి అని నానుడి వుంది.

లోహర్కర్ కు ఇంక జీవితం మీద ఆశ పోయింది.(మనిషికి మధ్యలో మూగతనం వస్తె అలాగే అనిపిస్తుందేమొ)

కార్యాలయంలో కూడా ఎవ్వరూ అతనితో మాట్లాటం లేదు. అతని దగ్గర ఎవ్వరూ కూర్చోరు. మాట్లాడారు కూడా , అని అందరూ పలకరించడం కూడా మానేశారు. ఒకానొక రోజు నాతొ పాటు పనిచేసిన వాళ్ళు ఈ రోజు నన్ను చూస్తేనే ముఖం చాటేస్తున్నారు..

ఇంక లోహర్కర్ కు ఇవన్నీ భరించే శక్తి చేయి దాటి పోయింది. ఇంక నేను వుండి ఏమి ప్రయాజనం అనుకున్నాడు. దీనికి ఒకటే ఉపాయం అనుకున్నాడు.

ఇంక ఉద్యోగ ధర్మం ప్రకారం బందూక్(తుపాకీ) office లో return చేశాడు. అన్ని No Dues తెచ్చుకున్నాడు. office నుంచి బయటికి వస్తు బయట నిలబడి వున్న హవల్ దార్(కానిస్టేబుల్) ను ఒకసారి, నీ బందూక్ ఇవ్వు అని అడిగాడు.

అక్కడే వున్న సహా ఉద్యోగి ఇవన్నీ గమనిస్తున్నాడు. లోహర్కర్ కు ఏమైంది? విచిత్రంగా వ్యవహరిస్తున్నాడు, అనుకున్నాడు. హవల్ దార్, బందూక్ ఇచ్చే లోపాలే అతడు పరుగు పెడుతూ వచ్చి బందూక్ return తీసుకున్నాడు.

నిజానికి లోహర్ కార్ ఆ బందూక్ తో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. అతని తోటి ఉద్యోగి(బాబా నేమో) గమనించి లోహర్కర్ నడుం చేత్తో గట్టిగా పట్టుకొని లాగాడు.

అప్పుడు లోహర్కర్ కు సాయి చరిత్ర గుర్తు వచ్చింది. ‘అంబాడేకర్ ఆత్మహత్య ప్రయత్నం, బాబా రక్షించిన విధానం ఆత్మహత్య మహాపాపం’ అన్ని సినిమాలా గుర్తు వచ్చాయి.( అందుకే నేను ప్రతి క్షణం గుర్తు చేసుకుంటాను. మన అందరి జీవితాలు సాయి చరిత్రలో భాగాలే. పాఠకులు గమనించగలరు.మాధవి)

ఇంక లోహర్కర్, ఆ మానసిక ఉద్వేగభరితమైన ఉద్యోగం వదిలేసి ముంబయి transfer చేసుకొని వచ్చేశాడు.

కొన్ని రోజుల తరువాత 2006 లో అతనికి “సాయి పాదయాత్ర మండలి” సభ్యులు భాస్కర్, ప్రఫుల్ల గార్లతో పరిచయం అయింది.

వాళ్ళు ఒకరోజు అడిగారు సార్ మీకు సాయిబాబా మీద నమ్మకం వుందా! అని అంటే లోహర్ కర్ ‘వుంది’ అన్నాడు. మేము శిరిడీ కి పాదయాత్ర చేస్తున్నాం, మాతో రండి, మీకు బాగుంటుంది అన్నారు.

2007 లో లోహర్కర్ వాళ్లతో పాటు పాదయాత్ర శిరిడీ కి వెళ్దాం అని తయారు అయ్యాడు. అంత దూరం వేళ్ళ గలనా! అని సంకోచిస్తూనే మామూలు చెప్పులు వేసుకొని బయలు దేరాడు.

తరువాత రోజు వాళ్ళు నడుస్తూ షహాపూర్ చేరినారు. అంత దూరం నడిచే అలవాటు లేనందువలన కాళ్లలో పుండ్లు వచ్చాయి.

ఇంక చెప్పులు వేసుకోలేక మాములు హవాయ్ చెప్పులు వేసుకొని నడవడం మొదలు పెట్టాడు. రాళ్ళు, రప్పలు మధ్యలో దాటుకుంటూ నడుస్తున్నారు. హవాయ్ చెప్పులు కనుక రాళ్ళు చెప్పుల్లోకి దూరినాయి. ఆలా రాళ్ళ మీద నడుస్తువుంటే లోహర్ కర్ కు చాలా బాగా అనిపించింది.

చెప్పులు మొత్తం తీసేసి bag లో పెట్టుకొని వట్టి కళ్ళతో నడవడం మొదలు పెట్టాడు. దాని వలన అయన కాళ్ళకు acupressure బాగా పనిచేసింది నడుస్తూ నడుస్తూ కసారా అనే చోటికి వీళ్ళు చేరారు.

ఇంట్లో వాళ్ళు బెంగపడుతుంటారు అని phone చేద్దాం అనుకోని ఒక STD Booth దగ్గర ఆగి phone చేశాడు. అతనికి తెలియకుండానే మాటలు వచ్చేస్తున్నాయి. తను మూగవాడి నాన్న సంగతి మర్చిపోయినాడు. నోట్లోనుంచి స్పష్టంగా శబ్దాలు వస్తున్నాయి. అతనితో నడిచేవాళ్ళు అందరూ ఆగిపోయి అతన్ని చూస్తున్నారు. లోహర్ కర్ ‘ఎందుకు వీళ్ళు నన్ను చూస్తున్నారు’ అనుకున్నాడు.అప్పుడు అర్థమైంది, తనకు మాటలు వచ్చినాయని “అరె ఏంటి ఈ చమత్కారం నువ్వు బాగా మాట్లాడుతున్నావు.

ఇక మీరే ఆలోచించండి లోహర్కర్ ఉద్వేగం భగవంతుడు సాయినాథుని అశీమ కృప(విష్ణు మాయ – శివుడినే వదలలేదు…మనమెంత? మన ఆలోచనలు అహంకారాలు ఎందుకు పనికి వస్తాయి).

అతను బాబా కృపను భరించలేక ఏడుస్తూ క్రిందపడిపోయాడు. సంతోషమో, దుఃఖమో తెలీదు. అనుభవించే వాళ్ళకు మాత్రం తెలుస్తుంది.

(సాయి – మమ్మల్ని కూడా ఆలా నీ కృపకు పాత్రులను చేయి ఈ జన్మలోనే)

ఇంక వాళ్ళు బాబా దర్శనం శిరిడీలో చేసుకొని, ముంబయి వెనక్కు వచ్చారు. ఒక వారం రోజుల్లో అన్ని
బాగా అయినాయి. మళ్ళీ కార్యాలయంకు వెళ్ళాడు.

అతను స్వయంగా పోలీసు విభాగంలో ఒక సాయి రాజ యాత్ర మండలి’ ప్రారంభించాడు. ప్రతి సంవత్సరం 50 మంది దాక శిరిడీ నడుస్తూ వెళ్తాడు. అదో ఆనందమయ యాత్ర అవుతుంది.

బాబా స్మరణ, భజనలతో మనస్సు, శరీరం ఉల్లాసంగా వుంటుంది అని అంటారు జగదీశ్ లోహర్కర్.

‘సాయి నాధుని లీలలు అగాధాలు, అగమ్యలు, మనం కూడా భక్తి శ్రద్దలతో ఆ సాయినాథుడిని సదా స్మరిద్దాం.

స్వరం సాయినాధార్పణ మస్తు

శ్రీ జగదీశ్ లోహర్కర్
ముంబయి

ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

9 comments on “మాట పోయిన భక్తునికి మరల మాట్లాడునట్లు చేయించిన బాబా వారు.

TV Gayathri

It’s really a miracle. Sarvam sainadha arpanamasthu.

Madhavi

manaku thelisi.enni leelalu..theleeka enno..mari.?

Prathibha sainathuni

Avunu aunty meru cheppindi correct….Sai sachharitra ante aa kalamlo hemandpanth rasina leelalu, anubhavalu matrame kadu…ippudu mana jeevitaalu kuda saibaba ane saagara charitralo bagaale,ayana leelaa tarangaalalo yegisipadutunna neeti bindhuvulame manam.ippati aa neeti bindhuvulaina manam eappatikaina aanimutyaluga tayaravutam anadamlo sandeham ledu…..
Saibaba saibaba saibaba saibaba….

Prathibha sainathuni

Sorry pains comment lo yegisipadutunna ani raasanu kada may be ayana leelaa tarangaalalo olalaadutunna neetibindhuvulam ante baguntundemo anipinchindi…..
Saibaba saibaba saibaba saibaba…

ఈ లీల చాల అద్భుతాలలో అద్భుతము. ఎంతోమంది తమ కష్టాలతో ఇక జీవితము వద్దు అనుకున్న వారు ..బాబా వారు దగ్గరకి వచ్చిన తరువాత..చాల హాయిగా జీవించారు.

Vidya

Om Sairam . Amazing miracle !!

Gautam

Wandrafull.Madhu..Doing gud job.baba bless u..sairam

Gaurav

.Mom.super miracle.jai sairam.

Prasanna

We don’t have any idea ,that u r doing this work.super.aunty..jaisairam

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles