శ్రీమతి ఔరంగాబాద్ కర్ కు చేసిన లీల మరల ఇప్పుడు చేసి, ఎప్పుడు తనను నమ్ముకున్న వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయనని నిరూపించుకున్న బాబా వారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


పిల్లల కోసం మేము చేయని ప్రయత్నం లేదు, మొక్కని దేవుడు లేడు, వాడని మందు లేదు, చూడని డాక్టర్ లేడు, కట్టని ముడుపు లేదు.

మా వారికి కౌంట్ తక్కువగా ఉందంటే దానికి మందులు వాడాము, ప్రయోజనం కనపడలేదు. ఆ సమయం లోనే మేము ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లాలని అనుకున్నాము.

నేను నాకు తోడుగా ఉద్యోగానికి సెలవు పెట్టి మా వారు ఇద్దరం అమెరికా వెళ్ళాము. అక్కడ ఇద్దరికీ టెస్టులు చేసారు.

ఆ టెస్ట్ లో నా గర్భసంచి వంకరగా ఉంది , సరిగ్గా లేదని అన్నారు, డాక్టర్ దానికి ఆపరేషన్ చేయాలన్నారు. దానికోసం డేట్ ఫిక్స్ చేసారు. ఆపరేషన్ రోజు వచ్చింది. నేను మా వారు హాస్పిటల్ కి బయలుదేరాం.

అమెరికా లో టైం అంటే టైం , ఆ టైం దాటితే వాళ్లింక ఆపరేషన్ చేయరు.

ఆ సమయంలో సడన్ గా మా కారు పంచర్ అయి ఆగిపోయింది. నాకేం చేయాలో తోచటం లేదు, డాక్టర్స్ మాకిచ్చిన సమయం అయిపోతోంది,

ఎలాగా బాబా అని అనుకుంటుండగానే నా పక్కన ఒక పోలీస్ వ్యాన్ వచ్చి ఆగింది, విషయం ఏమిటని అడిగాడు, నేను కారు గురించి చెప్పి ఆపరేషన్ టైం అయిపోతోంది నేను త్వరగా హాస్పిటల్ కి వెళ్ళాలి అన్నాను.

ఆయనే వెంటనే వెనక చూపించి ఎక్కమన్నారు, నేను ఇంకేమి ఆలోచించకుండా కార్లోంచి నా హ్యాండ్ బాగ్ తీసుకుని ఆ వ్యాన్ ఎక్కాను.

వ్యాన్ లో డ్రైవింగ్ సీట్ లో ఒకాయన ఉన్నాడు, వెనక నేనున్నాను, నేను హాస్పిటల్ పేరు కూడా చెప్పలేదు, తీసుకుపోయి 10 నిముషాలలో అక్కడ వదిలి పెట్టాడు.

నేను ఇంక వెనుకకి కూడా చూడలేదు. ఆలస్యం అయిపోయింది, వెంటనే లోపలికి వెళ్ళిపోయాను.

అప్పటికే అన్నీ ఏర్పాట్లు చేసుకొని నా గురించి ఎదురు చూస్తున్నారు అక్కడి డాక్టర్స్, ఆపరేషన్ థియేటర్ లోకి నన్ను తీసుకువెళ్ళారు నాకు ఆపరేషన్ చేసారు.

మా వారు కారు పంచర్ వేయించుకుని నెమ్మదిగా హాస్పిటల్ కి చేరుకున్నారు. ఈ లోపుల పుణ్యకాలం పూర్తయిపోయింది.

ఆపరేషన్ అయిన తర్వాత అప్పుడు డాక్టర్స్ ఎందుకు ఆలస్యం అయిందని, నీతోపాటు నీ భర్త రాలేదా అని అడిగారు. నేను జరిగింది చెప్పాను.

వాళ్ళు అది విని నన్ను పిచ్చిదేమో అన్నట్లుగా చూసి ఊరుకున్నారు . నాలుగు రోజుల తర్వాత నేను కోలుకున్నాక ఆఫీసుకి వెళ్లాను.

అక్కడ కూడా నన్ను ఎలా జరిగింది అని అడిగితే, ఆపరేషన్ బాగానే జరిగిందని, పోలీస్ వ్యాన్ లో పోలీస్ నన్ను ఎక్కించుకుని హాస్పిటల్ దగ్గర దింపాడని చెబితే, వీళ్ళు కూడా నన్ను మతి భ్రమించిందా అన్నట్లు చూసి పైకి ఆ మాట అనేసారు.

నీకేమైనా పిచ్చా, ఇది అమెరికా ఇండియా కాదు, ఇక్కడ పోలీసులేకాదు మామూలు మనుషులు కూడా ఒకరికొకరు సాయం చేసుకోవడం, లిఫ్ట్ లు ఇవ్వడం లాంటివి చేయరు.

అందులోనూ పోలీసులు అస్సలు చేయరు అని, ఎవరు ఎవరినీ పట్టించుకోరు అని కూడా అన్నారు.

ఈ సారి నిజంగా నాకు మతిపోయింది. మరి సకాలంలో హాస్పిటల్ కి చేర్చి నాకు ఆపరేషన్ అయ్యేటట్లు చేసింది ఎవరు? మరి ఇంకెవరూ సాక్షాత్తూ నా తండ్రి బాబాయే.

నేను తల్లి కావటానికి ఏర్పాటు చేయించి, కారు ఆగిపోతే తానే పోలీసులాగా వచ్చి, వ్యాన్ ఎక్కించుకుని, సకాలంలో హాస్పిటల్లో దింపి, ఆపరేషన్ సకాలంలో అయ్యేటట్లు చేసాడు బాబా.

అప్పుడు ఆ సమయంలో ఆపరేషన్ జరగకపోతే హాస్పిటల్ వారు మాకు మళ్ళీ ఎప్పుడు డేట్ ఇచ్చేవారో? అసలు ఇచ్చేవారో లేరో?

ఆ తర్వాత ఒక రోజు నేను ఆఫీస్ కి వెళ్లి కారు పార్కింగ్ చేస్తూ ఉండగా, వెనకనుండి నా కారును ఒకతను గుద్దేసాడు.

ఆ కుదుపుని నాకు నడుములో కలుక్కుమంది. ఏదోలే తగిలింది, అదే తగ్గి పోతుందని ఊరుకున్నాను. కానీ రాను రాను నొప్పి పెరిగిపోయింది.

అప్పుడు నేను డాక్టర్ని కలిసాను, వాళ్ళు CT స్కాన్ తీశారు. అందులో నా వెన్నులో రెండు డిస్క్ లు జారాయని, దాని వల్ల పెద్దగా ప్రమాదం ఏమీ లేదు కానీ మీరు పిల్లల కోసం చేస్తున్న ప్రయత్నం కొద్ది రోజులు వాయిదా వెయ్యండి.

ఈ లోపుల మందులు వాడితే డిస్క్ లు సర్దుకుంటాయి అని అలా ఉండగానే ప్రెగ్నెన్సీ వస్తే చాలా ప్రమాదం అనీ అన్నారు.

అసలే ఆలస్యం అయింది, ఇక్కడికి వచ్చి గర్భసంచికి ఆపరేషన్ చేయించుకున్నాక కూడా మా ప్రయత్నానికి విఘాతం ఏర్పడింది.

ఇంక చేసేది లేక కొన్నాళ్ళు జాగ్రత్త పడ్డాము. కొంత కాలానికి డిస్క్ లు సర్దుకున్నాయి. మళ్ళీ మీరు సంతానం కోసం ప్రయత్నం చేయవచ్చు అనీ డాక్టర్స్ చెప్పారు.

కొద్దీ రోజులకే మాకు నిరీక్షణ ఫలించి నేను నెల తప్పాను. 20 ఏళ్ళ వయసులో శరీరం ఎలా రెస్పాండ్ అవుతుందో 44 ఏళ్ల వయసులో నా శరీరాన్ని డాక్టర్స్ అలా రెస్పాండ్ అయ్యేలాగా మందులు వాడించారు. ఎట్టకేలకు బాబు నా కడుపున పడ్డాడు. 

ఇంతకు ముందు ఉన్న రెండు చేదు అనుభవాలు మూలంగా డాక్టర్స్ పర్యవేక్షణలో నేను ఉన్నాను.

ఇదంతా అమెరికాలో అయితే మీకు చాలా అయిపోతోంది, ఇలాగే చూసే డాక్టర్స్ ఇండియా లో హైదరాబాద్ లోనే ఉన్నారని, మేము వాళ్ళకి ఫోన్ చేసి మీకేసు పూర్తిగా వివరిస్తామని,

వాళ్ళ పర్యవేక్షణలోనే, మీ సొంత ఊళ్ళోనే ఉంటే మీకు ఖర్చులో కూడా బాగా తేడా వస్తుందని, పిల్లడు కూడా ఇండియన్ సిటిజెన్ అవుతాడని, అక్కడి డాక్టర్స్ చెప్పడంతో ధైర్యంగా అమెరికా నుండి హైదరాబాద్ (ఇండియా) వచ్చేసాము.

ఇక్కడ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము. నన్ను పరీక్ష చేసారు. బాబుకి లోపల ఎదుగుతున్నాడో , లేదో కూడా చూసి వాడికి కావాల్సిన ఫుడ్ ద్రవ పదార్ధాలను లోపలి పంపించేవారు.

మొత్తానికి 8 నెలలు నిండాక లోపల వాటర్ లేదని కదలిక కష్టం అవుతోందని ఆపరేషన్ చేసి బాబుని బయటికి తీసి ఇంక్యూబేటర్ లో పెట్టారు.

బాబు బాగు అయ్యాక నా చేతిలో పెట్టారు. ఆ రోజు నా ఆనందం వర్ణనాతీతం. వాడికి సాయి అని నామకరణం చేసుకున్నాము.

అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాము. 2007 వ సంవత్సరంలో బాబు పుట్టాడు. నా వయస్సు అప్పుడు 44 ఏళ్ళు.

బాబుని చూసుకుని నేను మురిసిపోని క్షణం ఉండదు. మా చుట్టాలనుండి, మా చుట్టుపక్కల వారి నుండి దూషణలు, తిరస్కారాలు నుండి ఆ ‘ సాయీశ్వరుడు” నన్ను రక్షించాడు.

నన్నూ, నా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు . నాకు భాగ్యాలెన్నో ఉన్న సౌభాగ్యాన్ని నిలిపిన భాగ్యప్రదాత ఈయన . ఇంతకన్నా రుజువులేమి కావాలి . ఆయన తనను నమ్ముకున్న వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయడని.

సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణ మస్తు

శుభం భవతు

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles