Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
షిరిడీ, సాయినాథుని జన్మ భూమి కాదు. ఆయన కర్మభూమి.
అప్పటికి సాయి బాబా మహా సమాధి చెంది రెండు దశాబ్దాలైంది. షిరిడీ గ్రామంలో నివృత్తి పాటిల్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన బాబా భక్తుడు. రైతు.
ఉన్నట్టుండి ఆయనకు ధాన్యాన్ని వేరు చేసే వ్యవసాయపు యంత్రం కావలసివచ్చింది. దాని పేరు సారక్.
దానికోసం కోపర్గాం వెళ్ళి అక్కడున్న ఏజెంటును అడగగా ”సారక్‌లు స్టాకులో లేవు, కొంత సమయం పడుతుంది” అని చెప్పాడు. సారక్ కావాలంటే ముందుగా పేరు నమోదు చేయించుకోవాలని కూడా చెప్పాడు.
ఇప్పుడు పేరు నమోదు చేయించుకుంటే ఎప్పుడో గదా వచ్చేది అని ఆలోచించి అసలు వ్యాపారస్తుని కలిస్తే బాగుంటుందని తలచి కిర్లోస్కర్ వాడి వెళ్ళి షాపు యజమాని శంకర రావును కలవటానికి వెళుతుండగా దారిలో సారక్‌లు కావలసిన మరో ఇద్దరు షిరిడీ వాసులు కలిసారు.
ముగ్గురూ శంకర రావును కలసి తమ అవసరాన్ని తెలిపారు. శంకర రావు కూడా సాయి భక్తుడే.
శంకర రావు సారక్‌లు ఇప్పుడు అమ్మకానికి లేవని చెప్పాడు. ఇక ఆ ముగ్గురు అక్కడ నుండి వెళ్ళిపోదాము అనుకొనుచుండగా, శంకర రావు వద్ద పని చేస్తున్న కులకర్ణి అనే గుమస్తా వచ్చాడు.
అతను షిరిడీలో ఆ ముగ్గురిని చాలాసార్లు చూసాడు. అతను కూడా సాయి భక్తుడే. ఆ ముగ్గురు తాము షిరిడీ నుండి వస్తున్నామని, సాయిబాబా వద్ద చీట్లు వేయగా, సారక్‌లు లభిస్తాయని వచ్చిందని అబద్దం చెప్పారు.
సాయి మాటలు ఎన్నడు వృథా కావని కులకర్ణికి తెలుసు. తన యజమాని శంకర రావుతో, వారికి సారక్‌లు లభిస్తే బాగుంటుంది అన్నాడు.
శంకర రావు ”పరిస్థితిని నీవు చూస్తున్నావు గదా” అన్నాడు. అదే సమయంలో హైదరాబాదు నుండి తమకు కావలసినవి 61 సారక్‌లు కాని 63 కాదు అని టెలిగ్రాం వచ్చింది. అంటే రెండు సారక్‌లు ఇప్పుడు వారికి లభిస్తున్నాయన్నమాట.
సాయి పేరుతో అబద్దం చెప్పకుంటే మూడు సారక్‌లు దొరికేవేమో! ఆ రెండు సారక్‌లను కులకర్ణి, శంకర రావులు వారికి విక్రయించారు.
నివృత్తి పాటిల్ ఆగస్టు 1983లో మరణించబోయే ముందు జరిగిన సంఘటన ఇది.
సాయి పేరును అవసరాలకు వాడుకోవటాన్ని సాయి చూస్తూనే ఉంటాడు.
సాయి ఎల్లవేళలా మనని గమనిస్తూనే ఉంటాడు జాగ్రత్త!
Compiled by: – ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented by: – Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సాయి ‘పిచ్చుక’ నానా …..సాయి@366 ఆగస్టు 21….Audio
- సాయి ముంగిట తొలి ‘స్వాతంత్య్ర’ వేడుక …..సాయి@366 ఆగస్టు 15….Audio
- అందరూ బిడ్డలే! …..సాయి@366 ఆగస్టు 5…Audio
- మూలాన్ని చూడు…. మహనీయులు – 2020… సెప్టెంబరు 7
- వేయి కనులు చాలవుగా!…..సాయి@366 అక్టోబర్ 7…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments