సాయి ముంగిట తొలి ‘స్వాతంత్య్ర’ వేడుక …..సాయి@366 ఆగస్టు 15….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


ఏ గ్రామంలో ఎటువంటి ఆచారం ఉంటుందో మనం ఊహించలేం కానీ, షిరిడీ గ్రామంలో ఉన్న ఒక ఆచారాన్ని మాత్రం మనం తెలుసుకోగలం. అది సాయికి, ఆ గ్రామ ప్రజలకు ఉన్న బంధం.

షిరిడీ గ్రామస్తులు తమ కష్ట, సుఖాలను సాయినాథునకు విన్నవించుకునే వారు. ఆ గ్రామస్తులు సాయితో కష్ట, సుఖాలను పంచుకోవటం ఆనందదాయకంగాను, తమ కర్తవ్యంగాను భావిస్తారు.

సాయి మహా సమాధి చెందారు.

భారత దేశానికి స్వాతంత్య్రం సాయి మహాసమాధి అనంతరం వచ్చింది.

ఆ గ్రామస్థులకు ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో సాయి ఉండటం, స్వాతంత్య్ర సముపార్జనకోసం తిలక్‌ వంటి మహనీయులు సాయి వద్దకు రావటం తెలుసు.

అంటే స్వాతంత్య్రం కోసం సాయి పడిన ఆరాటాన్ని వారు గ్రహించారు. స్వాతంత్య్రం ఇక వచ్చేస్తోంది కొద్ది క్షణాల్లో…

ఆ దినం 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి అంటే 12 గంటలు ఇంకా కాలేదు. అవుతాయి కొంచెం సేపట్లో. ఆ గ్రామస్తులు ప్రథమ స్వాతంత్య్ర దిన ఆనందోత్సాహాలను సాయితో పంచుకున్నారు.

ఆ నాటి రాత్రి అంటే అర్ధరాత్రికి ముందు సాయి చిత్తరువును అలంకరించిన రథంపై ఉంచారు. త్రివర్ణ పతాకాలతో ఆ రధాన్ని అలంకరించారు.

ఒకటా రెండా, మూడు వందల దివిటీలు, ఆపై వివిధ వాద్యాలపై కీర్తనలు, అభంగాలు, గేయాలతో, ఇంకా మిలటరీ బ్యాండుతో కూడా ఆ సాయి (చిత్రం) అధిరోహించిన రథం గ్రామంలో ఊరేగి, ద్వారకామాయి, చావడుల మీదుగా బూటీవాడా చేరింది.

అప్పటికే బూటీ మందిరంపై త్రివర్ణ పతాకాన్ని సరిగ్గా 12 గంటల ఒక నిమిషానికి సాయి భక్తుడైన శ్రీ రఫువీర భాస్కర పురందరే ఎగురవేశాడు.

బాణాసంచా మ్రోగింది. సాయినాథ మహారాజ్‌కీ జై అనే నినాదాలు పిక్కటిల్లాయి.

తెల్లవారింది …

అందంగా అలంకరింపబడింది ఆ గ్రామం కూడా. ఆగస్టు 16న సాయి మహాసమాధి ప్రాంగణంలో 500 మంది సామూహిక విందుతో ముగిసాయి.

ఇది గ్రామస్తులు, సాయి భక్తులు సాయికి నివేదించిన ప్రథమ స్వాతంత్య్ర వేడుక ఉత్సవాల తంతు.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles