అడుగడుగున గుడి ఉంది…..సాయి@366 నవంబర్ 16….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సాయి బాబా జన్మ భూమి ఏమిటో తెలియదు కాని, షిరిడీ ఆయన కర్మ భూమి అయింది. షిరిడీలో కొలువైన సాయికి మొగలాయి ప్రదేశాలతో సంబంధం ఉండి ఉండాలనిపిస్తుంది అంటారు కాకా సాహెబ్‌ దీక్షిత్‌ .

ఎందుకంటే సాయి మాటలలో సేలు, జాల్నా, మనపద్‌, పాథరి, పరభణి, నౌరంగాబాదు, బీడ్‌, బీదర్‌ మొదలైన ఊర్ల పేర్లు వచ్చేవి.

అదీకాక సాయి ధూప్‌ఖేడ గ్రామం నుండి చాంద్‌భాయ్‌ అనే పెద్దమనిషితో, ఒక వివాహ సందర్భంలో షిరిడీ వచ్చాడు సాయి అని హేమాద్‌పంత్‌ తెలుపుతారు.

ధూప్‌ఖ్‌డ్ గ్రామానికి రాబోయేముందు సాయి చూపిన మొదటి లీల, తప్పిపోయిన చాంద్‌ పాటిల్‌ గుర్రం జాడ తెలుపుట.

చిలుం పీల్చటం కోసం భూమి నుండి నిప్పు, నీరు తెప్పించారు సాయి అది మరో లీల. ఈ రెండు లీలలు చాంద్‌ పాటిల్‌కు సంబంధించినవి.

సాయి మహత్తును గ్రహించిన చాంద్‌ పాటిల్‌, సాయిని ధూప్‌ఖ్‌డ్ గ్రామానికి ఆహ్వానించాడు. ఇద్దరూ పయనిస్తున్నారు. అప్పుడు అద్భుతాలే జరిగాయి.

ఒకటి, రెండు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ధూప్‌ఖ్‌డ్ గ్రామంలోనికి వెళ్ళాటానికి కొందరు ఆ ఇద్దరకూ అడ్డుపడ్డారు. అప్పుడు సాయి వారిపై రాళ్ళు రువ్వారు.

ఒక రాయి వెళ్ళి ఒక కుంటి అబ్బాయికి తగిలింది. దగ్గరనే ఉన్న వాడి తల్లి వాడిని లేవనెత్తింది. ఆశ్చర్యం! ఆ పిల్లవాడు లేచి నడవసాగాడు.

ఇంకో అమ్మాయి పిచ్చిగా బట్టలు వేసుకోకుండా తిరిగేది ఎప్పుడూ. ఆమె నుదిటి మీద రాయి తగిలి పిచ్చి నయమైంది. వెంటనే ఇంటికి వెళ్ళి బట్టలు కట్టుకు వచ్చింది.

అప్పుడు అందరూ సాయి ఫకీరు మహిమను గుర్తించారు. సాయి ధూప్‌ఖ్‌డ్ లో కొంతకాలం ఉన్నాడు.

ఆ రోజుల్లో సాయి ఆ ఊరిలో ఉన్న వేప చెట్టు క్రింద శీతోష్ణాదులను లెక్కచేయక, పగలనక, రాత్రనక ఆ చెట్టు క్రిందనే ఉండేవారు.

కాలం గడుస్తోంది. రెండు చెట్ల వద్దే సాయిబాబా మందిరం నిర్మింపమని ధూప్‌ఖ్‌డ్ గ్రామస్తులు గులాబ్‌ బాబాను కోరారు.

16-11-1991న సాయిబాబా మందిరానికి గులాబ్‌ బాబా శంకుస్థాపన చేశారు.

నేడు నవంబరు 16.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles