Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
చెల్లెలి పెళ్ళయిపోవడంతో చాంద్‌పాటిల్, బంధు మిత్ర సపరివారంగా ధూప్‌గాం వెళ్ళిపోయాడు. సాయిబాబా షిరిడిలోనే ఉండిపోయారు.
అయిదున్నర అడుగుల ఎత్తు. పచ్చగా పసిమిరంగులో ఉండేవారు బాబా. అటు లావూ కాదు, ఇటు సన్నమూ కాదు, చూడముచ్చటగా ఉండేవారు. కళ్ళు నీలంగా ఉండి, వెలుగులీనుతుండేవి. ఆ కళ్ళలోకి చూసి, తల తిప్పుకోవడం కష్టంగా ఉండేది. ముక్కుపుటాలు పెద్దవి. శ్వాస మీద ధ్యాసకు అనువుగా ఉండేవవి.తన నివాసంగా మళ్ళీ వేపచెట్టునే ఎన్నుకున్నారు బాబా. ఆ చెట్టు కిందనే రాత్రీ పగలూ ధ్యానం చేస్తూ కూర్చునేవారు.
మంత్ర బద్ధుడిలా మహల్సాపతి దగ్గరయ్యారయనికి. రోజులో ఏదో సమయంలో మహల్సాపతి వచ్చి బాబా దర్శనం చేసుకునేవాడు.
చెట్టు కింద బాబా లేరంటే, పక్కనే ఉన్న అడవిలో ఉన్నట్టే! అడవిలో గుబురు పొదల మధ్యా, తుప్పల మధ్యా బాబా తిరుగుతూ కనిపించే వారందరికీ. అక్కడి పువ్వుల్ని చూసి పొంగిపోతూ, లతల్ని నిమిరి ఆనందించేవారు. వాటితో సంభాషించేవారు. కష్ట సుఖాలను అడిగి తెలుసుకునేవారు. అదంతా చూసిన ప్రజలు బాబాని ‘పిచ్చిపకీరు’ అన్నారు. నవ్వుకున్నారు
.కాశీరాం, అప్పాజోగ్లేలు కూడా అదే భావనలో ఉండేవారు. అయితే మహల్సాపతి వారి భావనను పోగొట్టేందుకు చాలా కష్టపడ్డాడు.
బాబా పిచ్చిపకీరు కాదని గొప్పవాడని చెప్పేందుకు, వారిని నమ్మించేందుకు నానా యాతనలు పడ్డాడు.‘‘మనిషి మనిషితో మాట్లాడడం గొప్పకాదు, మనిషి మొక్కలతో మాట్లాడడం గొప్ప. జంతువులతో మాట్లాడడం గొప్ప. దయచేసి, బాబాని పిచ్చివాడు అనొద్దు. ఆలోచించండి.’’మహల్సాపతి వేడుకోలు అర్థం చేసుకున్నారు కాశీరాం, అప్పాజోగ్లే. అతని వెంట నడిచారు. బాబాని ఆరాధించసాగారు.
మహల్సాపతిలాంటి గ్రామపెద్దలు బాబాని నమ్మి, అయన సామాన్యుడు కాదని ప్రచారం చెయ్యడంతో గ్రామప్రజలు కూడా బాబాని దైవంగా నమ్ముతూ వచ్చారు. దేవుడి ముందు ఏకరువు పెట్టుకున్నట్టుగానే ప్రజలంతా బాబాకి తమ బాధలూ గాధలూ చెప్పుకునే వారు. కన్నీరు పెట్టుకునే వారు.
నవ్వుతూ బాబా వారందరినీ ఓదార్చేవారు. ఆ ఓదార్పు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చేది. ఇది ఆ నోటా ఈ నోటా విన్న అప్పాకోతే పాటిల్ బాబాని దర్శించేందుకు వచ్చాడు. తానొక్కడే వద్దామనుకున్నాడతను. అంతలో భార్య బయిజాబాయి, కొడుకు తాత్యాపాటిల్ కూడా బాబాని దర్శించుకునేందుకు వస్తామంటే కాదనలేక
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- పిల్లల్లో పిల్లాడు దేవుళ్లలో దేవుడు (1వ. భాగం)
- పిల్లల్లో పిల్లాడు దేవుళ్లలో దేవుడు (3వ. భాగం)
- పిల్లల్లో పిల్లాడు దేవుళ్లలో దేవుడు (2వ. భాగం)
- బాబా దేవుడు. ఆయనకి మరణం లేదు
- ‘‘సద్గుణానికీ దాసగుణానికీ దేవుడు లొంగిపోతాడు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “పిల్లల్లో పిల్లాడు దేవుళ్లలో దేవుడు”
సాయినాథుని ప్రణతి
December 19, 2016 at 9:34 amబాబా సశరిరులై వున్నపుడు ఆ భక్తులు ఎంత ఆనందాని పొందరో చదువుతుంటె ఎంతో ఆనందానుభుతి కలుగుతుంది. మనం కూడ వారిలా ఆనందాని పొందాలంటె బాబాను మనం అర్తిగా మన కొరికలు కొరుకోగలగాలి ,మనకు ఉండె కష్టాలకు మనం అంతగా అర్తిగా కొరుకోలెక పొవచు .కాని సాయిబాబాను మనస్సార ఎదైన కొరితె వారు అది మనకు మంచి అయితె నెరవేరుస్తారనది నా అనుభవం. మనం సాయి సురేష్ గారు శిరిడీలో పొందిన అనుభవాలు చదివాము .అలాగె నేను కూడ శిరిడీలో హరతులకు వెలాలని బాబాను చుసి ఆనందించాలని అనుకునాను కాని నా పిల్లల వల్ల అది కుదరలేదు .కొంచం బాద కలిగింది సరె అని సరిపెటుకునాను .తరువాత నేను ఈ మద్య రాత్రి ,ఉదయం హారతి చుడడం మొదలు పెటాను అపుడు ఒకసారి బాబా ముఖంలో ఆ చిరునవ్వు చూసి ఎంతో సంతోషించాను .ఎంతటి ఆనందం అది మాటలతో చెపలేను మనం ఖాపర్డె అనుభవాలలో బాబా చిరునవ్వు గురించి చదివెం అపుడు ఎంత ఆనందించింటం అలాగె నాకు ఆ హారతులలో బాబా ముఖం ఎంత ఆనందంతొ చిరునవ్వు చిందిస్తునారని పించింది .ఎంతో ఆనందించాను నాకు ఈ భాగ్యనికి కనులలో ఆనంద బాష్పాలు దొర్లాయి .అలాగె అందరు బాబాను అర్తితో వెడుకుందా బాబా మన కోరిక తప్పక తిరుస్తారు.