పిల్లల్లో పిల్లాడు దేవుళ్లలో దేవుడు (3వ. భాగం)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

‘‘రండి రండి’’ అని చాటునున్న పిల్లల్ని కేకేసి పిలిచే వారు.‘‘గోళీలాడుకుందామా?’’ అడిగేవారు.ఆడుకుందామంటే పిల్లల్లో పిల్లాడిలా గోళీలు ఆడేవారు బాబా.

బాబాని గురించి పదే పదే వింటున్న మాధవరావ్‌ దేశ్‌పాండే, బాబాని సందర్శించాలని అనుకున్నాడు. అతను షిరిడి పాఠశాలలో ఉపాధ్యాయుడు. మహల్సాపతిని కలిశాడు.‘‘బాబా దర్శనం కావాలి.’’ అడిగాడు.‘‘దాందేముంది, రండి.’’ అన్నాడు మహల్సాపతి. అతన్ని వెంటబెట్టుకుని బాబా దగ్గరికి వచ్చాడు.

ఆ సమయంలో బాబా పిల్లలతో గోళీలాడుకుంటున్నారు.‘‘చూడండి! ఈసారి నాదే గెలుపు.’’ అన్నారు బాబా. గిరిలో ఉన్న గోళీలను, చేతిలో ఉన్న గోళీతో గురి చూస్తూ.‘‘గెలిచి చూపించు మామా! ఇప్పటికి మూడుసార్లు ఇదే మాట అన్నావు. గెలిచావా, లేదు. ఓడిపోయావు.’’ నవ్వాడు తాత్యా.పిల్లలతో గోళీలాడుతూ దుమ్ముకొట్టుకుపోయి ఉన్న బాబాని అసహ్యంగా అసహనంగా చూశాడు పాండే.

ఈయన దేవుడా? మహిమాన్వితుడా? ఊరందరికీ పిచ్చి పట్టి ప్రచారం చేస్తున్నారు. ఛఛ! అనవసరంగా వచ్చానిక్కడకి అనుకున్నాడు పాండే. అండ పిండ బ్రహ్మాండాల్లో అలరారే ఆ దేవదేవుడెక్కడ? ఈ పిచ్చి పకీరు ఎక్కడ? గోళీలాటనే గెలువలేని వాడు, భక్త జన హృదయాలను ఏం గెలుస్తాడు? వచ్చి తప్పు చేశాను, వెళ్ళిపోవడం మంచిది అనుకుంటూ వెనకడుగు వేశాడో లేదో పాండే,

అతన్ని పట్టి నిలిపినట్టుగా ఇలా అన్నారు బాబా.

‘‘అండపిండ బ్రహ్మాండాల్లోనే కాదు, ఈ గోళీల్లో కూడా దేవదేవుడు ఉంటాడు. తేడా అంతా మన చూపులోనే ఉంది.’’ఆగిపోయాడు పాండే. ఆశ్చర్యంగా బాబాని చూశాడు.

అదేదీ పట్టించుకోనట్టుగా బాబా గోళీలాటలో మునిగిపోయారు. గోళీల్ని గురి చూసి కొట్టారు. తగల్లేదు. ఓడిపోయారు బాబా.‘‘మామ ఓడిపోయారు.’’ తాత్యా చప్పట్లు కొట్టాడు. మిగిలిన పిల్లలు కూడా చప్పట్లు కొడుతూ ఓడిపోయావంటూ బాబాని ఆటపట్టించారు. దీనంగా ముఖం పెట్టుకుని నిల్చున్నారు బాబా.

ఇందాక తను విన్నదంతా అబద్ధం. బాబా ఏమీ మాట్లాడలేదు. మాట్లాడినట్టుగా తనకి అనిపించింది. భ్రమ అనుకున్నాడు పాండే.‘‘మాతో నువ్వు గెలవలేవు మామా’’ బాబా ముందు తాత్యా చిందులేయసాగాడు.పిచ్చిపకీరు ఏం గెలుస్తాడు? దేవుడయితే గెలుస్తాడనుకున్నాడు పాండే. సన్నగా నవ్వుకున్నాడు.

‘‘పిల్లలు ముందు పెద్దలు ఓడిపోతేనే అందం. అలాగే భక్తుల ముందు భగవంతుడు ఓడిపోవాలి. జీవుణ్ణి గెలిపించడం కోసం దేవుడు క్షణక్షణం ఓడిపోవాలనుకుంటాడు. అది తప్పు కాదు, శ్యామా’’ అన్నారు బాబా.

పాండే ఆ మాటలకు విస్తుపోయాడు. ‘శ్యామా’ అన్నది తన ముద్దుపేరు.

కృష్ణునిలా నల్లగా ఉంటాడని, తల్లి తనని శ్యామా అనేది. ఆ పేరు బాబాకి ఎలా తెలిసింది?

అసలు తన మనసులోని మాటలు బాబాకి ఎలా తెలుస్తున్నాయి? అయితే బాబా పిచ్చిపకీరు కాదు, దేవుడే! అనుమానం లేదు అనుకున్నాడు పాండే.

అయినా చేతులు జోడించి నమస్కరించడానికి సిగ్గుపడ్డాడు.‘‘నీకూ నాకూ అందరికీ దేవుడు ఒక్కడే! సబ్‌ కా మాలిక్‌ ఏక్‌! దేవుణ్ణి శరణు కోరడానికీ, చేతులెత్తి నమస్కరించడానికీ సిగ్గుపడితే ఎలా?’’ ప్రశ్నించారు బాబా.

వెంటనే చేతులు జోడించాడు శ్యామా. నిలువునా బాబా పాదాల మీద పడిపోయాడు.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles