Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
‘‘గుళ్ళూ గోపురాలూ తిరిగినంత మాత్రాన దేవుడు కనిపిస్తాడా? కనిపించడుగాక కనిపించడు. కనిపించాలంటే మనసూ, బుద్ధీ ఒకటి కావాలి.
ఆ రెంటినీ ఒకటి చేయగలిగితే విఠలుడు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాడు. ఇక్కడ కూడా కనిపిస్తాడు.’’ అన్నారు బాబా. ఈ మాటలు కూడా సహస్రబుద్ధిని ఉద్దేశించే అన్నారు.
తను పాండురంగ విఠలుని భక్తుడు. పాండురంగడు అంటే ప్రాణం తనకి. పాండురంగడు తప్ప మరో దేవుడు లేడంటాడు తను. అలాంటి తనని బాబా దగ్గరకు బలవంతాన ఈడ్చుకు వచ్చాడు నానా.
దారి పొడవునా బాబా దేవదేవుడు అన్నాడు. వినిపించుకోలేదు తను. అయితే బాబా తన పేరు తెలుసుకున్నాడు. తన ఇష్టదైవాన్ని తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకోగలిగాడివి? బాబా సామాన్యుడు కాదు అనుకున్నాడు సహస్రబుద్ధి.
ఇబ్బంది తొలగింది. అయిష్టత కరిగింది.‘‘బాబా’’ అన్నాడు సహస్రబుద్ధి.‘ఏమిటి’ అన్నట్టుగా అతన్ని చూశారు బాబా.
‘‘మనసునీ బుద్ధినీ ఒకటి చేస్తాను. నాకు ఇక్కడ విఠలుడు కనిపిస్తాడా? మీరు చూపించగలరా? విఠలుణ్ణి మీరు నాకు చూపించగలిగితే జీవితాంతం మీ సేవ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతాను. చూపించండి.’’ అన్నాడు సహస్రబుద్ధి.
అతనలా నిలదీసినట్టుగా బాబాని అడగడం నానాకి కష్టంగా తోచింది. శ్యామాకి కూడా అమర్యాదగా అనిపించింది.
‘‘మాట్లాడరేం? విఠలుణ్ణి చూపించగలరా?’’ బాబాని రెట్టించాడు సహస్రబుద్ధి.‘‘చూపిస్తాను!
అయితే నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యాలి.’’‘‘చెప్పండి, ఏం చెయ్యమంటారు?’’
‘‘ముందు నువ్వు, నువ్వు కాదని తెలుసుకో! విఠలునికి దాసుడివయిపో! మనసులో విఠలుణ్ణే ధ్యానిస్తూ ఒక వారం పాటు నామ సప్తాహం చెయ్యి. విఠలుడు ఎందుకు కనిపించడో నేనూ చూస్తాను.’’ అన్నారు బాబా.
‘‘సద్గుణానికీ దాసగుణానికీ దేవుడు లొంగిపోతాడు. నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. ప్రయత్నించు.’’ అన్నారు బాబా మళ్ళీ.
‘‘నా ప్రయత్నం ఈ క్షణమే ప్రారంభం.’’ అన్నాడు సహస్రబుద్ధి. బాబా ముందే పద్మాసనంలో కూర్చున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. విఠలుణ్ణి మనసులో ఆవాహన చేశాడు.అయన నామాన్ని ఉచ్చరిస్తూ సప్తాహంలో మునిగిపోయాడు.
పాండురంగ విఠలా! పండరినాథ విఠలా!పాండురంగ విఠలా! పండరినాథ విఠలా!సహస్రబుద్ధి గొంతు ద్వారకామాయి అంతటా ప్రతిధ్వనించసాగింది.
‘‘పట్టిన పట్టు వదలడు బాబా! విఠలుడంటే పిచ్చి.’’ అన్నాడు నానా. సహస్రబుద్ధిని జాలిగా చూశాడు.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ‘‘మీ మాట మీరు నిలబెట్టుకున్నారు. నాకు విఠలుణ్ణి చూపించారు”.
- ఎవరూ తమంతట తాముగా షిరిడీకి రాలేరు. ఇక్కడికి రావాలంటే నా అనుమతి కావాలి.
- బాబా దేవుడు. ఆయనకి మరణం లేదు
- పిల్లల్లో పిల్లాడు దేవుళ్లలో దేవుడు (1వ. భాగం)
- పిల్లల్లో పిల్లాడు దేవుళ్లలో దేవుడు (3వ. భాగం)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments