Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (16)దీనజనోధ్ధరణ (1వ.భాగం)
ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
సాయిబాబా షిరిడీలో ప్రవేశించిన మొదటి రోజులలోనే బీదవారికి, కష్టాలలో ఉన్నవారికి సేవ చేస్తూ ఉండేవారు. మొట్టమొదట్లో ఆయన షిరిడీ గ్రామమంతా తిరుగుతూ రోగగ్రస్తులయిన వారికి వైద్యం చేస్తూ ఉండేవారు. మొదట్లో ఆయన ఒక వైద్యునిలా రోగిని పరీక్షించి ఆయుర్వేద మందులను ఇస్తూ ఉండేవారు. ఆయన వైద్యం అద్భుతంగా పనిచేసేది. దాని వల్ల ఆయన ఒక గొప్ప వైద్యుడు (హకీమ్) అని పేరు వచ్చింది. (ఓ.వి.46)
వైద్యం చేసినందుకు ఆయన డబ్బు తీసుకొనేవారు కాదు. రోగులకు, నిస్సహాయులకు ఆరోగ్యాన్ని చేకూర్చేవారు. ఆయన చేసే అద్భుతమయిన వైద్యం వల్ల ఆయన హస్తవాసి చాలా మంచిదని గ్రామస్తులందరికీ అనుభవమయింది. అధ్యాయం – 7
సాయిబాబా వ్యాధులను నయం చేయడమేకాదు, ఒక్కొక్కసారి రోగులు అనుభవించే రోగాలను తన శరీరం మీదకు తెచ్చుకొనేవారు. ఒకసారి దాదాసాహెబ్ చిన్న కుమారుడు షిరిడీలో తీవ్రమయిన జ్వరంతో బాధపడ్డాడు. ఆ రోజుల్లో షిరిడీలో ప్లేగు వ్యాధి ప్రబలి ఉంది. పిల్లవాడి పరిస్థితికి అతని తల్లి బాగా తల్లడిల్లిపోయింది.
కంగారు పడుతూ బాబా వద్దకు వెళ్ళి తన స్వంత గ్రామం అమరావతి వెళ్ళిపోవడానికి అనుమతినివ్వమని ఆయన కాళ్ళు పట్టుకుని ప్రార్ధించింది. అప్పుడు బాబా ఆమెతో మృదువుగా ఇట్లా అన్నారు- “ఆకాశమంతా మబ్బులతో నిండి ఉంది. త్వరలోనే వర్షం కురిసి పంటలు పండుతాయి. ఆ తరువాత మబ్బులు తొలగిపోయి ఆకాశం నిర్మలంగా ఉంటుంది”. (ఓ.వి.106)
ఆవిధంగా అంటూ బాబా తన కఫనీని నడుం వరకు పైకెత్తి “ఎందుకు భయపడతావు?” అని తన శరీరం మీద ఉన్న కోడిగ్రుడ్లంత పరిమాణంలో ఉన్న బొబ్బలను అక్కడున్నవారందరికీ చూపించారు. (ఓ. వి. 107) తన శరీరం మీద నాలుగు చోట్ల లేచిన కోడిగ్రుడ్లంత పరిమాణంలో ఉన్న నాలుగు బొబ్బలను చూపిస్తూ “చూడు, నీకోసం నేనీ కష్టాన్ని అనుభవించవలసి వచ్చింది” అన్నారు. అధ్యాయం -7 (ఓ.వి. 108)
ఆవిధంగా బాబా తన భక్తులను రక్షించడానికి వారి బాధలను తాను అనుభవించేవారని మనం గ్రహించవచ్చు.
సాయిబాబా ఆపదలలో ఉన్నవారి రోగాలను నయం చేయడమే కాదు వారికి రాబోయే ఉపద్రవాలను కూడా నివారించేవారు. ఒకసారి ఒక కమ్మరి వాని భార్య తన ఒడిలో బిడ్డను ఉంచుకొని కొలిమిని ఊదుతూ ఉంది. ఇంతలో భర్త పిలవడంతో ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మర్చిపోయి తొందరగా లేచింది.
ఆమె బిడ్డ జారి, మండుతున్న కొలిమిలో పడింది. సర్వాంతర్యామి అయిన సాయిబాబా వెంటనే తన చేతిని మండుతున్న ధునిలో పెట్టారు. ఆవిధంగా ఆయన షిరిడీbనుండి చాలా దూరంలో జరిగిన ఆ సంఘటనలో ఆమె బిడ్దను రక్షించారు. సాయిబాబా చెయ్యి బాగా కాలింది.
కొంతకాలం తరువాత సాయిబాబా మందులు ఇవ్వడం మానేసి, రోగాలు నయం చేయడానికి ఊదీని ఇవ్వసాగారు. ఉదాహరణకి 33వ.అధ్యాయంలో నానాసాహెబ్ చందోర్కర్ కుమార్తె మైనతాయి ప్రసవ వేదన పడుతూ ఉంటే ఊదీని పంపించి ఆమె నొప్పులను తగ్గించారు.
అలాగే 34వ. అధ్యాయంలో మాలేగాం డాక్టరు మేనల్లుడి రాచకురుపును ఊదీతోనే నయం చేశారు. ఇప్పటికీ బాబా భక్తులందరూ బాబా ఊదీనే సర్వరోగ నివారిణిగా భావిస్తూ ఎంతో పవిత్రంగా ఉపయోగిస్తూ ఉన్నారు.
నారి కురుపు వ్యాధితో బాడపడుతున్న డా.పిళ్ళే కాళ్ళు చాపుకుని మసీదులో కూర్చున్నాడు. మసీదును శుభ్రం చేయడానికి వచ్చిన అబ్దుల్ చూసుకోకుండా పిళ్ళే కాలు మీద తొక్కాడు. వెంటనే పిళ్ళె కాలు మీద ఉన్న పుండు పగిలి గినియా పురుగులు బయటకు వచ్చి అతని బాధ నివారణయింది. ఆ విధంగా బాబా, అబ్దుల్ కాలు పిళ్ళే కాలు మీద పడేలాగ చేసి అతనిని బాధ నుండి విముక్తుడిని చేశారు.
ప్రారంభంలో సాయిబాబా రోగులకు మందులివ్వడమే కాదు, అవసరమయితే ఒంటరిగా ఉన్న రోగులకు తానే సేవ చేస్తూ ఉండేవారు. తరువాత ఆయనకు వయస్సు మీద పడిన తరువాత ఆయనకు సహాయకులుగా ఎంతోమంది భక్తులు ఏర్పడటంతో సాయిబాబా వారి చేత సేవ చేయించేవారు.
ఒకసారి తీవ్రమయిన వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ బాబా వద్దకు వచ్చింది. బాబా, భీమాబాయి అనే ఆవిడను పిలిచి ఆస్త్రీకి నీ ఇంటిలో ఆశ్రయం ఇవ్వు అని చెప్పారు. అప్పుడు భీమాబాయి “బాబా, ఆమె చాలా తీవ్రమయిన వ్యాధితో బాధపడుతూ ఉంది.
ఆమెను నాయింటిలో ఎలా ఉంచుకోను?” అని సమాధానమిచ్చింది. అప్పుడు బాబా “ఆమె అంతలా వ్యాధితో బాధపడుతుంటే ఏమయింది? ఆమె నాసోదరి – నా అనుంగు సోదరి. అమెను నీయింటికి తీసుకొని వెళ్ళు” అన్నారు. మారు మాటాడకుండా భీమాబాయి ఆమెను తన ఇంటికి తీసుకొని వెళ్ళింది.
(ఇంకా ఉంది)
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (16)దీనజనోధ్ధరణ (2వ.భాగం)
- శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (10)అహంకారం (1వ.భాగం)
- శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (9)మాయ (1వ.భాగం)
- శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (13)బ్రహ్మానందము (పరమసుఖము) (1వ.భాగం)
- శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (20)విభిన్న మతాలు (1వ.భాగం)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments