ఎలా చెప్తారో అది మీ ఇష్టం.కానీ స్వయంగా మీరు చెప్పిందే అయుండాలి



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై !!

ఒకసారి నేను సంక్రాతి పండగకి ఇంటికి వెళ్ళాను.హైదరాబాద్ కి మళ్ళీ గురువారం ఉదయం రావాలి.ప్రతి బుధవారం సాయంత్రం బాబా ఫోటోకి అలకరిస్తాను కదా,ఈ రోజు బుధవారం నేను టెంపుల్ లో అలంకరించలేక పోయాను.ఇంకా ఎవరైనా అలకరిస్తారేమో ఈ రోజు.నేను లేను కదా.బాబా ఎవరితో అలకరించుకుంటారో ?వాళ్ళు బాబా ని సరిగ్గా అలకరిస్తారో లేదో.?ఎలా అలకరిస్తారో ఇలాగె ఆలోచిస్తూ పడుకున్నాను.

కలలో బాబా ఫోటో నీట్ గా తుడిచి ఉంది కానీ,అలంకరించి లేదు.అయ్యో బాబా ఫోటోకి ఎవరు అలకరించలేదేమో అందుకే అలా కనిపించారేమో బాబా నాకు అనుకున్నాను.మళ్ళీ అలా ఎలా పట్టించుకోకుండా ఉంటారు.గురువారం కచ్చితంగా,అలా ఖాళీగా ఉంచరు అనుకున్నాను.

ఉదయం ఇంటిదగ్గరినుండి వచ్చేసరికి 9 అయిపోయింది.నేను ఆతృతగా టెంపుల్ కి వెళ్లేసరికి మెట్ల దగ్గరే టెంపుల్ లో పని చేసే రాములమ్మ అనే ఆమె,నన్ను చూసి,నిన్న బుధవారం కదా ఎందుకు రాలేదు?నువ్వు వచ్చి బాబాకి గంధము పెడతావని చాల సేపు ఎదురు చూసాను.నువ్వు రాలేదు కానీ చాల మంది మేముపెడతాము అంతే మేము పెడతాము అని వచ్చారు,కానీ నేనే ప్రతిభనే ఎప్పుడు గంధము తో బాబాకి బొట్టు పెడుతది.కాబట్టి ఆమెనే పెట్టాలి .ఆమె కోసమే చూస్తున్నాను.అని అందరిని వెళ్ళగొట్టాను.నువ్వేమో రాలేదు.

ఈ రోజు గురువారం టెంపుల్ కి భక్తులు అందరు వస్తారు.ఇలా ఫోటో ఖాళీగా ఉంటె టెంపుల్ మెంబెర్స్ ఏమంటారో అనిఇప్పుడే నాకు భయం వేస్తుంది.సరిగ్గా నువ్వు వచ్చావు.సరే తొందరగా వెళ్లి అలంకరించు అని చెప్పగానే హ్యాపీ గా లోపలి వెళ్లేసరికి కలలో బాబా ఫోటో కనిపించినట్టుగానే నీట్ గా తుడిచి,అలంకరణ లేకుండా ఖాళీగా ఉంది.

ఓకే బాబా నాతో అలకరించుకోవాలనే అలా కనిపించారు అనిపించింది.

ఇంకొకసారి ఉప్పల్ లో మా కజిన్ అక్క వాళ్ళింటికి వెళ్లాల్సి వచ్చింది.బుధవారం రాత్రి అక్కడే ఉండాల్సి వచ్చింది గురువారం ఉదయం టెంపుల్ కి వచ్చేసరికి,పాఠం మొత్తం నీట్ గా తుడిచి ఏ అలంకారం లేకుండా ఉంది.

నేను టెంపుల్ కి వచ్చేసరికి ఉదయం 11 ఐంది.అసలు బాబా ఫోటో నేను తప్ప ఎవరు తుడిచి అలకరించరు.ఒకవేళ పొరపాటున ఎవరైనా తుడిచారా అంటె కచ్చితంగా అలకరించవలసిందే కానీ,గురువారం కి అలా బోసిగా ఉండకూడదు.

కానీ ఆరోజు టైం 11 ఐన కూడా ఎవరు ఆ ఫోటోకి అలకరించలేదు.ఆంటీ పని ఆమెతో ,ప్రతిభ లేదేమో ఉంటె కచ్చితంగా వచ్చి ఉండేది.కొంచం సేపు చూసి ఆరతి టైం వరకైనా ఎవరో ఒకరు అలంకరిస్తే మంచిది అంటున్న టైం లోనే నేను టెంపుల్ కి వెళ్లడం,మళ్ళీ నన్నే బాబా కి అలకరించమనడం జరిగింది.

ఆరోజు తొందర తొందరగా అలకరించాను టైం అవుతుందని కానీ,చాల బాగా వచ్చింది బాబా మాల ,గంధము కుంకుమ విభూదితో,అచ్చు రియల్ పువ్వుల మాల లాగా.అందరు చాల బాగుంది అని చెప్పారు.ఇలా అప్పుడప్పుడు చాల సార్లు జరిగింది.

ఒకరోజు డిసెంబర్ 31 బుధవారం జరిగింది.31 రాత్రి టెంపుల్ లో పూజలు జరుగుతాయి..బాబాని నేను అలకరించాను.పైన విగ్రహాన్ని పూజారులు అలంకరిస్తున్నారు.

నేను కింద ధుని దగ్గర బాబా ఫోటోని చూస్తూ కూర్చున్నాను.మా వెనక కూర్చున్న అంకుల్ ఒకతను.వేరే ఆంటీ తో పైన ఓ బాబా ని తెగ డెకరేట్ చేస్తున్నారు కానీ,బాబాకి ఇవేమి అవసరం లేదు.వీళ్ళు డెకరేట్ చేయకుండా ఉంటేనే బాబా అందంగా ఉంటారు అని అంటున్నారు.

నాకు వినిపించి.నేను కూడా అంతేనా?డెకరేషన్ అనే పేరుతొ పాపం బాబా ని ఇష్టమొచ్చినట్టు గంధము ,కుంకుమతో పూస్తున్నానా?అసలు బాబా కి ఇష్టమేనా ? ,పాపం బాబా ని నా ఇష్టం తో అలా కష్టపెడుతున్నానేమో ?యిలా ఆలోచనలు.

అప్పుడు నేను స్ట్రాంగ్ గా అనుకున్నాను.బాబా మీకు నేను అలా గంధము,కుంకుమతో మీకు డెకరేట్ చేయడం ఇష్టం ఐతే ఇన్ని రోజులు చెప్పినట్టు కలలో కాదు మాస్టర్ గారు,గురువుగారు,ఇంకెవరివో ఒపినిఒన్స్ కాదు.ఎవరో రచయితలు రాసిన బుక్ లో నుండి కాదు.మీకు మీరు స్వయంగా చెప్పాలి.

నాకు మీరు కలలో తప్ప రియల్ గా కనిపించలేదు.అలా కనిపించి చెప్పాలని కూడా నేను అడగట్లేదు.కానీ ఏ సారి కలలో కాదు.ఎలా చెప్తారో అది మీ ఇష్టం.కానీ స్వయంగా మీరు చెప్పిందే అయుండాలి .అనుకున్నాను.

నెక్స్ట్ డే గురువారం ,శుక్రవారం చూసాను.ఎల్లాంటి సమాధానం రాలేదు.నేను అనుకున్నాను .నువ్వు పెద్ద అది అని బాబా స్వయంగా చెప్పాలా?కలలో కాదు బుక్స్ లో ఎవరో రాసిన ఒపినిఒన్స్ కాకుండా స్వయంగా బాబా చెప్పిందే తెలియాలంటే ఎలా తెలుస్తుంది.ఇప్పటికే బాబా చాల సార్లు చెప్పారు నువ్వు అడిగిన వాటికీ అన్ని .సో ఇంకా ఓవర్ చేయకుండా కూర్చో అనుకున్నాను.

శనివారం ఉదయం జనార్దన్ అంకుల్ వాళ్ళింటికి సత్సంగ్ కి వెళ్ళాను అక్కడ సత్సంగ్ అయిపోయే టైం కి అంకుల్ఒక బుక్ ఓపెన్ చేసారు. అది ఒక భక్తుడికి ధ్యానం లో బాబా స్వయంగా కనిపించి చెప్పిన మాటలను,అలా రాసుకున్నారు .

అంకుల్ చదువుతున్నారు దానిలో ఒకదగ్గర “నన్ను అలంకరిస్తే ఆనందిస్తాను,ఆనందిస్తే అనుభూతినిస్తాను “అని ఉంది.

నా డౌట్ కి సమాధానం అది అనిపించి అంకుల్ ని మళ్ళీ చదువుమన్నాను.చాల హ్యాపీ గా అనిపించి .ఆ బుక్ రాసిన రచయితకి బాబా ధ్యానం లో కనిపించిన డేట్, టైం ,ఇయర్ అన్ని అడిగి తెలుసుకున్నాను.

ఇప్పుడు సరిగా గుర్తుకు లేదు కానీ 1991 మార్చ్ లేదా మే 21 అని గుర్తు. ఈ విదంగా బాబా తాను స్వయంగా అలంకరణ గురించి చెప్పింది నాకు తెలిసేలా చేసారు.

అప్పుడు అనుకున్నాను.ఇంకెప్పుడు బాబాని ఇలా అడగొద్దు.ఎన్ని సార్లు నేను అలంకరించడం మీకు ఇష్టమా? అని అడిగి అడిగి నాకు విసుగు రావాలి కానీ,నాకు ఇష్టం అని తెలియచెప్పడం లో బాబా కి మాత్రం విసుగు రాదు అని.అప్పటి నుండి బాబా ని అడగడం మానేసాను.

తరువాతి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “ఎలా చెప్తారో అది మీ ఇష్టం.కానీ స్వయంగా మీరు చెప్పిందే అయుండాలి

Sreenivas

Sai Baba…Sai Baba…Sai Baba

Prathiba Sainathuni

saibaba saibaba saibaba saibaba..

సాయినాథుని ప్రణతి

Your experiences are so nice. Saibaba ki jai , Sarath Babuji ki jai

Prathiba Sainathuni

tnq pranati garu..

Maruthi

Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles