Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అందరికీ సాయిరాం
నా పేరు విజయ.మావారి ఉద్యోగరీత్యా మేము ఢిల్లీలో వుండేవాళ్ళం.నాకు ఒక కొడుకు,ఒక కూతురు.కూతురు బెంగళూరు.కొడుకు మెల్బోర్న్,ఆస్ట్రేలియా.
నేను 6 నెలలు బెంగళూరు లోన మరియు 6 నెలలు మెల్బోర్న్ లో వుండాలసి వస్తుంది వీస వలన.
అవి మేము ఢిల్లీలో ఉన్న రోజులు.నేను,మావారు షిర్డిసాయి టెంపుల్ కు వెళ్ళేవాళ్ళం.
తెల్లని పాలరాతి విగ్రహంతో స్వామి నడిచి మాతో వస్తున్నారా అనిపించేది.
ఇంటికి వచ్చినా,అదే రూపం నన్ను వెంటాడేది.అందుకే ప్రొద్దున కాఫి తాగినా ఆయనకు సమర్పించే తాగేదాన్ని.ఆవిధంగా ఆయన మాఇంట్లో ఒక వ్యక్తిగా వుండేవారు.
పొయిన సంవత్సరం నేను ఇండియా వచ్చినపుడు జరిగిన సంఘటన ఇది.చాలా ఆశ్చర్యాన్ని,ఆనందాన్ని కలిగిస్తుంది.
మా అత్తగారివూరు అనంతపురం.కాబట్టి నేను అక్కడికి వెళ్లాను.అక్కడ ‘శివికోటి’ అనే పెద్ద శివాలయం వుంది.అక్కడ పిల్లల పేరిట రుద్రాభిషేకాలు,కుంకుమార్చనలు చేయించాను.
ఆటెంపుల్ వాళ్ళు నాకు కుంకుమార్చన తరువాత చాలా కుంకుమ ఇచ్చారు.నేను ఇంటికి వచ్చి అందరికీ పంచాను ఆకుంకుమను తరువాత నాకోసం,నాకూతురు కోసం రెండు కవర్లలో పెట్టుకున్నాను.బెంగళూరు వెళ్ళాను కూతురు దగ్గరికి.
నాకు ఫ్లైట్ బెంగళూరులోనే వుంది.మా కూతురు కోసం ఉన్న కుంకుమ తనకి ఇచ్చేసాను.నా కోసం పెట్టుకున్నది నా రూమ్ లో పెట్టుకున్నాను.అప్పటినుంచి ఆరూమ్ మంచి సుగంధ పరిమళం వచ్చేది.ఎక్కడనుంచి అనుకునే వాళ్ళం.ఇంట్లో అందరూ చూచారు.ఏంటో ఈ లీల అనుకునేవాళ్ళం.తరువాత నేను వెళ్ళాలసిన రోజు రానే వచ్చింది.
అపుడు ఆకుంకుమ ఉన్న కవర్ పాక్ చేసుకుందామని చూశాను.ఆశ్చర్యం… దానిలోనుంచి చిన్న బాబా విగ్రహం ఎలా వచ్చింది? అని ఆశ్చర్యపోయాను.
ఆ టెంపుల్ వాళ్లకు ఫోన్ చేసి కనుక్కున్నాను,మీ బాబా విగ్రహం నా కుంకుమతో ఏమన్నా వచ్చిందా!ఎవరన్నా పోగొట్టుకున్నారేమో అని.
కానీ ఆపూజారి అన్నాడు,లేదు ఇక్కడికి ఆవిగ్రహం ఎలా వస్తుంది,ఇక్కడ బాబా విగ్రహాలు లేవు అని చెప్పారు.
అప్పుడు అనుకున్నాను బాబా నన్ను ఈవిధంగా ఆశీర్వదించావా అని నాతో మెల్బోర్న్ తీసుకెళ్ళాను.ఇపుడు మా మందిరంలో వుంది. నేను రోజు కాఫీ ఇచ్చేదాన్ని బాబాకు.అంత చిన్నసేవకు స్వయంగా నాతో వచ్చేశారు ఆయన.
ఇంక మీరే ఆలోచించండి ఆయన కృప ఎలావుంటుందో.మా చెల్లి మాధవి రాయమంటే ఏమి రాయను అనుకున్నాను.ఆయనే నాతో రాయించారు.ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.సాయిరాం
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- కొంత సమయం తరువాత పాప బ్రతికింది అందరూ బాబా లీలను చూసి ఆశ్చర్యపోయారు.
- సాయి స్మరణ – అనారోగ్య హరణం
- నా మీద బాబా కు చాలా కృప ఉంది, నా పిల్లలు కూడా నాకు ఇంత సంతోషం ఎప్పుడూ ఇవ్వలేదు.
- బాబా నాతో భగవద్గీత చదివించారు.
- బాబా మీద నమ్మకం లేని నా భార్యకు, బాబా వారు స్వయంగా వచ్చి దీవించి జ్వరం తగ్గించిన వైనం.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “ఇంత చిన్నసేవకు బాబా స్వయంగా నాతో వచ్చేశారు.”
SivaSaiKrishna
November 14, 2017 at 12:51 amSaiMaa