Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఓం సాయి రామ్.
నా పేరు లక్ష్మి ప్రసన్న.హైదరాబాద్.
గురు బందువులకు నమస్కారం. బాబా గారు ఎవరి స్తితిని బట్టి వారికి ఆయా గ్రందాలు చదవమని వాటిని బాబా స్పర్శతో పావనం చేసి ఇస్తారు.
కొంతమంది భక్తులకు గ్రందo తో పాటు ఒక రూపాయ దక్షిణతో ఇచ్చివేసిన సందర్బాలు ఉన్నాయి.
అదే విదంగా నన్ను భగవద్గీత చదవమని నాతో చదివించారు బాబా.
కొన్నాళ్ళ బాబా సేవలో నాకు విచిత్రమైన కోరిక కలిగింది. బాబా ని ( నేను తాత అని పిలిస్తానుకదా. )
ఒకరోజు పూజలో ఉన్నపుడు ఇలా అడిగాను తాత ఎక్కువ నీ ద్యాస అయ్యింది. అయిన నాకు తృప్తి లేదు నువ్వు నాకు ఇంకా దగ్గరగా కావాలి, నిన్ను చూడాలి అది ఎలా అని బాగా ఏడ్చేస్తున్నా.
అప్పటి నా స్థితి ఎలా ఉందంటే సచ్చరిత్ర తప్ప వేరే లోకం తెలియని నేను చదవడం మానేసి బాబా ఒళ్లో తల వాల్చి ఏడుస్తూనే ఉండేదాన్ని.
కారణం ఆయన నా దగ్గర లేరు నాకు నువ్వు కావాలి బౌతికంగా కావాలి. ఇదే ఏడుపు ఇది తప్పు అని తెలిసినా ఏడుపు ఆగేదికాదు.
నీ స్పర్శ కావాలి ఇదే పిచ్చి దాదాపుగా పదిహేను రోజులు దిగులుగా కావలసిన మనిషి లేకపోతె ఎలా ఉంటుంది అలా దిగులుగా ఉన్నాను.
అప్పుడు తాత చెప్పారు నువ్వు భగవద్గీత చదువు నేను నీ దగ్గరికి పరిగేత్తివస్తాను అని.
బాబా రూపం , సచ్చరిత్ర తప్ప వేరేవి నా మనసు అంగీకరించదు. అప్పటి నా స్తితి అదే.
కాని బాబా నాకు పారాడుతూ ఇంట్లో తిరుగుతూ కనిపించారు. తాత పెద్దగానే ఉన్నారు. తెల్లని కఫ్ని, జోలె తో, ఆ రూపం ఇప్పిటికీ నేను మరువలేను.
జోలెలో ఏవో చాలానే ఉన్నాయి.ఆ మూటని వేసుకొని పారడుతున్నారు. అలా ఎవరు పారడుతారు ?? కృష్ణుడు అవును బాబానే కృష్ణుడా ?? !!
అమ్మో తాత ఏమి దర్శనం ఇచ్చావు నేను తప్పక భగవద్గీత చదువుతాను అని మొదలుపెట్టాను. లేదు, లేదు బాబానే మొదలుపెట్టించారు.
ఇక రోజూ పారయనం చేస్తూ తాత మీరు రావాలి మీ స్పర్శ నాకు ఇస్తారు. ఇదే బావన తో ఉన్నా.
కానీ భగవద్గీత నన్ను ఇంకోలా మార్చేసింది నాలో తెలియని పరివర్తన తీసుకువచ్చారు బాబా.
ఇంతలో షిర్డీ వెళ్ళాము. నేను తాత కి పల్లీ లడ్డు తీసుకువేల్లాను. సమాది మందిరంలో ఇచ్చాను
వాళ్ళు కొన్ని లడ్డులు తీసుకొని సమాది మీద ఉంచారు. కొన్ని నాకు ఇచ్చారు. కాని నా ఆత్మ చెప్పింది బాబా తినలేదు అని.
నా బ్యాగ్ లో లడ్డూ బాక్స్ పెట్టుకొని ఉదయం నుండి షిర్డీ అంతా తిరుగుతున్నా తాత వస్తారు తింటారు అని, నా కళ్ళు తాత కోసం వెతికి అలసి, సొలసి పోయాయి. నన్ను పిచ్చిది అని కూడా అన్నారు.
ఇలా వెదుకుతూ గురుస్తాన్ వైపు వెళ్తున్నా అక్కడ ఉన్న వేప చెట్టు సైడ్ కి అంటే దీక్షిత్ వాడా దగ్గర అద్బుతం. ఒక పండు ముసలి, చూడడానికి అసహ్యంగా మురికి బట్టలతో చుట్టూ ఈగలతో ఒక కర్రతో ఉన్నారు తాత.
నా మనసు చెప్పింది అయన తాత ఇక వెళ్లి కూర్చున్నా, మొదట నన్ను తాత అడిగింది లడ్డూలు ఇవ్వు అని, వెంటనే కన్నీల్లతో బాక్స్ ఇచ్ఛా అన్నీ తాత తీసుకొని రెండు లడ్డూలు మాత్రం నాకు దోసిలిలో వేసారు.
ఎంత వేదాంతం చెప్పారు. కానీ అతని దగ్గర నేను కోర్చోవడం అక్కడ ఎవరికీ నచ్చలేదు ఎందుకు అంటే అతను చూడడానికి అలా ఉన్నారు.
చివరకు మా అమ్మ కూడా అరుస్తున్నారు అతనితో నీకు పని ఏంటి అందరు నిన్ను అసహ్యంగా చూస్తున్నారు లే, బాగోదు అని, నాకు మాత్రం అయన సన్నిదిలో కలిగిన అనుబూతి, ఆ కళ్ళలో తేజస్సు మాటలతో చెప్పలేను.
ఇంత ఆనందం కోల్పోయి నేను ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నా, ఎందుకు ఉన్నా, అనిపించింది. నాకు చాలా విషయాలు చెప్పారు.
నేను తాతకి దక్షిణ ఇచ్ఛా అతను వెంటనే లేచి నన్ను కౌగిలించుకొని స్పర్శ ఎలా ఉంది అన్నారు.
హా హ నేను ఇక ఏమి రాయగలను ఎలా రాయగలను. ఆ విషయంతో బాబా నన్ను ఒక మెట్టు ఎక్కించారు.
అప్పటినుండి ఇప్పటికి నేను ఈ బుక్ చదవాలి అనేది బాబానే చెప్పి ఇప్పిస్తున్నారు. ఈరోజుకు కూడా అదే జరుగుతుంది.
నా ప్రతి కదలిక బాబా నిర్నయించినదే నన్ను ఒక విదంగా బాబా వెంట ఉండి నడిపిస్తున్నారు. . తాత మీ ఋణం ఎలా తెర్చుకోగాలను. అదీ మీరే చెప్పండి బాబా.
ఓం సాయి రామ్ . ఓం సాయి రామ్
Latest Miracles:
- బాబా నాతో భగవద్గీత చదివించారు…Audio
- ఇంత చిన్నసేవకు బాబా స్వయంగా నాతో వచ్చేశారు.
- బాబా తనకు కావలసినవన్నీ సర్దుకొని నాతో వచ్చారు.
- నాతో కుంటాట ఆడి నా నడుము నొప్పి ని బాగు చేసిన బాబా వారు …..!
- యాక్సిడెంట్ జరిగే సమయానికి మా పాప నాతో ఉండకుండ చూశారు బాబా–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “బాబా నాతో భగవద్గీత చదివించారు.”
Maruthi Sainathuni
June 12, 2018 at 2:13 pmChala bagundi mee anubhavam lakshmi prasanna gaaru..ee Leelalo mee bhakthiki kallallo neellu vachhesthunnay…
Sai Baba … Sai Baba …Sai Baba