Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-63-1031-యాక్సిడెంట్ జరిగే సమయానికి 5:10
మరుసటి రోజు మా ఆయన ఆఫీస్ పని మీద కెనడా కి వెళ్ళాల్సి ఉంది.
నేను ఆఫీస్ కి బయల్దేరాలి. ఆ రోజంతా బాగా గడిచింది.
మనసుకు చాల ప్రశాంతంగ ఉంది.
కాకపోతే మా ఆయన కెనడాకి వెళ్తున్నారని బాధపడ్డాను.
బాబాకి పూజ చేసి నా పనిలో పడ్డాను.
మా ఆయన కెనడాకి చేరాక తాను చేరుకున్నట్లుగా మెసేజ్ పంపారు.
నాకు ఊరట కలిగింది. ఇక దాని గురించి మర్చిపోయి పనిలో పడ్డాను.
సాయంత్రం ఆఫీస్ అయ్యాక ఇంటికి వెళ్ళడానికి కారు తీసి బయల్దేరాను.
రెడ్ సిగ్నల్ పడింది. అక్కడ ఆగాను.
మనసులో బాబా ను తలచుకుంటూ, ఆఫీస్ లో ఇప్పుడు ఉన్న ఒడిదుడుకుల నుండి కాపాడమని బాబాని అభ్యర్థిస్తున్నాను.
మ్యూజిక్ సిస్టం లో బాబా భజన వస్తుంటే వింటున్నాను.
అప్పుడే మా పాప గురించి ఆలోచిస్తు పాపను డే కేర్ నుండి తీసుకొనిరావాలని అలోచిస్తుండగ తిరిగి మనసు బాబా భజన మీదికి మళ్ళింది.
భజన వింటుండగ హఠాత్తుగ నా వెనకల నుండి ఎవరో నా కారును గుద్దారు.
రెండు సార్లు పెద్ద అదుర్లు వచ్చాయి. దాని ఫలితంగ నేను నా ముందర కారును గుద్దాను.
ఓరి భగవంతుడా నా కారు కి యాక్సిడెంట్ అయింది అనుకొని కారులో నుండి దిగాను.
దాని ప్రభావం ఎంతగా పడిదంటే నా కారు ముందర, వెనుకల రెండు వైపుల డామేజ్ అయింది.
కారు ఎక్కడెక్కడ డామేజ్అయిందో అని నేను పరిశీలించాను.
రెండు వైపుల చిన్నచిన్న గీతలు పడ్డాయి కాని, ఎక్కువ డ్యామేజ్ కాలేదు ( రిపేర్ కి దాదాపు 500 డాలర్లు అవుతుందని అంచన).
నా వెనకాల ఉన్నతను రెడ్ లైట్ చూసుకోలేదు. అతను గంటకు 40 మైళ్ళ వేగంతో డ్రైవ్ చేస్తూ రెడ్ లైట్ చూసుకోకుండ వచ్చి నా కారును గుద్దాడు.
పోలీస్ తప్పు చేసిన అతన్ని అన్ని విషయాలు అడుగుతూ విచారిస్తున్నాడు.
నన్ను ఏమి అడగట్లేదు. నేను మనసులోపల బాబాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.
నేను పోలీస్ ను రిపోర్ట్ అడిగాను. పోలీస్ నా వైపు ప్రశ్నార్థకంగా చూసాడు.
అసలు డ్యామేజ్ ఏమి కాలేదు కదా, ఎందుకు ఈవిడ రిపోర్ట్ పదే పదే అడుగుతుంది అన్నట్టు తన మొహం ప్రశ్నార్థకంగ పెట్టుకొని నావైపు చూశాడు.
ఓ బాబా నాకు అగుపడిన దృశ్యానికి అర్థం ఇదేనా. బాబా నన్ను రక్షించినందుకు మీకు ధన్యవాదాలు.
ఈ యాక్సిడెంట్ వల్ల ఒక్క నష్టం మాత్రం జరిగింది. మా అమ్మాయి డే కేర్ కి 30 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాను.
దానికి ఫలితంగా 100 డాలర్లు లేట్ ఫీజ్ చెల్లించాల్సివచ్చింది.
ఆ రోజు నాకు ఇంకా పెద్ద యాక్సిడెంట్ జరగబోయేదని నాకు బాగా గట్టి నమ్మకం.
నా కారు మొత్తం డ్యామేజ్ అయ్యుంటే నా పరిస్థితి ఏమిటి?
అసలే మా ఆయన కూడా ఊరిలో లేరు. బాబా దయ, ప్రేమ నాపై చూపకుంటే నష్టం ఇంకా ఎక్కువ జరిగేది.
యాక్సిడెంట్ జరిగే సమయానికి మా పాప నాతో ఉండకుండ చూశారు బాబా. ఇంకా ఏమి చెప్పను?
మా ఆయన కూడా అసలు దేశంలోనే లేరు.
ఈ సంఘటన జరిగినపుడు బాబా నే నా దగ్గర లేకుంటే ఇంకా ఏమి జరిగిఉండేదో ఊహించుకోలేను.
నాకు సంబందించి ఈ మధ్య కాలంలో ఏమి సవ్యంగా జరగట్లేదు. పరిస్థితులు ఏమి బాగా లేవు.
పని ఒత్తిడి , వ్యక్తిగత జీవితం కొన్ని ప్రతికూల పరిస్థితులతో సతమతమవుతుండగ, దానికి తోడు గత రెండు నెలలుగా రెండు సార్లు ప్రాణాంతకమైన యాక్సిడెంట్ల నుండి తప్పించుకోవడం కొంచెం ఆందోళన కలిగించే విషయం అయిన
బాబా దయకు, ప్రేమకు ఒక్క ధన్యవాదాలు మాత్రం సరిపోవు.
ఆయనకు ఎంతో ఋణపడ్డాను. మీరు నమ్మగలిగితే “బాబా ప్రశ్నలు జవాబులు” పుస్తకం ద్వారా బాబా మీతో మట్లాడతారు.
అందులో ఏమి జవాబు వచ్చినా దాన్ని మనఃస్పూర్తిగా నమ్మి అందులో ఏమి చేయమని వస్తే అది చెయ్యండి.
దానితో ఆటలాడవద్దు. కాని బాబా అందులో ఏమి చెప్తారో అది నమ్మి చేయండి.
బాబా మా అందరిని అశీర్వదించి, జీవితపు ఎగుడు దిగుడుల నుండి తట్టుకునే శక్తి, ధైర్యం ఇవ్వండి.
శ్రీ సాయి భక్తుని సమాచారం ఈ క్రింది లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా వారి దయతో వారం లోగ మా ఇల్లు అమ్ముడయిపోయి, మా పెద్ద పాప పెళ్లి చేయగలిగాము.
- అర్ధరాత్రి పూట తన దగ్గరికి పిలిపించుకుని మా పాప కి స్వస్థత చేకూర్చిన బాబా వారు …….!
- బాబా దయ అనుగ్రహం వల్ల మా పాప క్షేమంగా ఉంది–Audio
- చిన్న దెబ్బ కూడా తగలకుండా, పెద్ద యాక్సిడెంట్ నుంచి కాపాడిన బాబా వారు
- బాబా వారి సత్సంగ మహిమ ద్వారా “చైనా ప్రభుత్వము వారు మా మరిదిని విడుదల చేయట.”—-Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments