Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-62-1031-బాబాకి వందల సార్లు 3:09
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి లీల ద్వైమాసపత్రిక మార్చ్ – ఏప్రిల్ 2009 సంచికలో ప్రచురింపబడిన మరొక సాయి లీల.
ఒకరోజున నా సోదరుడు కొల్ హాపూర్ నుండి అమ్మకి చాలా సీరియస్ గా ఉందనీ ఆస్పత్రిలో చేర్పించామని వెంటనే రమ్మని ఫోన్ చేశాడు.
నేను కొల్ హాపూర్ చేరుకుని ఆస్పత్రికి వెళ్ళాను. మా అమ్మగారు సెమీ కోమా స్థితిలో ఉండటం వల్ల ఐ.సీ.యూ. లో వుంచారు.
ఆవిడ ఎవరినీ గుర్తు పట్టే స్థితిలో లేదు.
అప్పుడప్పుడు కళ్ళు తెరచి చిన్న నవ్వు నవ్వేది కాని వెంటనే మళ్ళి నిద్రలోకి వెళ్ళిపోయేది.
ఆమెనాస్థితిలో చూసేటప్పటికి నాకు చాలా ఏడుపు వచ్చింది.
నేను బాబా ఊదీ, ప్రసాదం తీసుకొని వచ్చాను.
మా అమ్మగారు ఆస్థితిలో ఆవిధంగా బాధపడటం నేను భరించలేకపోయాను.
ఆవిడ జీవితంలో ఎప్పుడూ ఎవ్వరితోనూ అమర్యాదకరంగా ప్రవర్తించలేదు.
పరుషంగా మాట్లాడి బాధపెట్టలేదు.
అటువంటిది ఆవిడని ఈ స్థితిలో ఎందుకు వుంచావు బాబా అని బాబాతో చెప్పుకొని ఏడిచాను.
ఆమె మళ్ళీ కోలుకొనేలా చేసి ఒక్కసారి తన పిల్లలనందరినీ గుర్తు పట్టేలా చేయి బాబా.
ఆవిడ లేచి తిరిగి నడిచి మాట్లాడే స్థితి లేకపోతే కనక ఈ భయంకర స్థితిలో బ్రతికేకన్నా ఆమెని తీసుకోపో బాబా అని వేడుకొన్నాను.
ఒక్క క్షణం మా అమ్మగారు స్పృహలోకి రాగానె నేను ఆమె నుదిటికి ఊదీ రాశానని చెప్పి బాబా ప్రసాదం యిచ్చాను.
ఆశ్చర్యంగా ఆవిడ వెంటనే కళ్ళు మూసుకొని రెండు చేతులూ జోడించి నోటిలో ఏదో గొణుగుకొంటూ ప్రార్ధించింది.
కొంత ప్రసాదం ఆమెకిచ్చాను. పంచదార పలుకులు మెల్లగా నోటిలో వేసుకొని మరికొంత తనకోసం ఉంచమని చెప్పింది. దానిని తన తలగడ క్రింద పెట్టుకొంది.
తొందరలోనే మా అక్కచెల్లెళ్ళు కూడా వచ్చారు.
నేను ఆరాత్రికే పూనా తిరిగి వచ్చేశాను.
ప్రొద్దుటే నా సోదరి ఫోన్ చేసి అమ్మ పరిస్థితి మెరుగయిందనీ అందరితోను మాట్లాడుతోందని చెప్పింది.
నేనెందుకు రాలేదని అడిగింది. ఆఫీసు లో పని వుండటం వల్ల వచ్చేశాననీ ప్రసాదం కూడా అమ్మ తలక్రింద ఉంచాననీ చెప్పాను. నాపరిస్థితిని అర్ధం చేసుకొంది.
ఎనిమిది రోజుల తరువాత మా అమ్మగారిని ఆస్పత్రినుంచి డిస్చార్జ్ చేశారు.
బాబాకి వందల సార్లు కృతజ్ఞతలు తెలుపుకొన్నాను.
బాబా నువ్వు సమర్ధుడివి. నీలీలలు నిగూఢమయినవి.
మనీషా గురుదత్ పవార్ (ఫ్లాట్ 889, భాటియా ఎడిఫిస్, కోట్ కర్ లేన్, భావ్ పాటిల్ రోడ్, బోపోడీ పూనె – 411 020
శ్రీ సాయి భక్తుని సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం శ్రీసాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబాకి నేనిచ్చిన దానికన్నా పదుల, వందల రెట్లు దక్షిణ ఇచ్చిన వారెందరో వున్నారు–Audio
- షిరిడీలో ప్రతి చెట్టూ పుట్టా బాబాకి బాగా తెలుసు.
- బాబుని బహుమతిగా ప్రసాదించిన సాయికి కృతజ్ఞతలు
- బాబాకి అసాథ్యమన్నది లేదు–Audio
- సాయి కధలు ఎన్ని సార్లు చదివిన అమృతం వాలే మధురంగా ఉంటాయి–V. Tarkad-26–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments