Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
పదహారేళ్ళ యువకుడిగా బాబా మొదటిసారి షిరిడీలో అడుగుపెట్టారు. కొన్నాళ్ళు నివసించారక్కడ. తర్వాత అక్కణ్ణుంచి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయిందీ ఎవరికీ తెలియదు. పెద్దగా పట్టించుకోలేదెవరూ.
మూడేళ్ళ అనంతరం పందొమ్మిదేళ్ళ వయసులో మళ్ళీ ఆ గడ్డ మీద అడుగు మోపారు బాబా. రెండోసారి షిరిడీకి చేరుకున్నారు. అప్పటి నుంచి సుమారుగా అరవై ఏళ్ళపాటు షిరిడీని అంటిపెట్టుకునే ఉన్నారు బాబా.
ఎక్కడికీ వెళ్ళలేదు. షిరిడీలో ప్రతి చెట్టూ పుట్టా బాబాకి బాగా తెలుసు. ఏ దారి ఎటు పోతుందో, ఎక్కడ ఏ పువ్వు పూస్తుందో, ఎక్కడ ఏ పక్షి కూస్తుందో బాబాకి తెలిసినంతగా మరెవరికీ తెలియదక్కడ.
ఇప్పుడు ఆ దారులూ, పువ్వులూ, పక్షులూ బాబా కోసం చూస్తూ, ‘రావ య్యా బాబా, రా’ అంటూ పిలుస్తున్నాయి.
బాబా రాడే!బాగా నీరసించిన బాబా, రెండు రోజులుగా భిక్షకు వెళ్ళడం మానుకున్నారు. అడుగు కదపలేని స్థితిలో ద్వారకామాయినే అంటిపెట్టుకుని ఉండిపోయారు. జ్వరంతో ఒళ్ళు కాలిపోతోంది.
దగ్గు, అయినా భక్తులకు దర్శనం ఇస్తూనే ఉన్నారు. తూలి వెనక్కి పడిపోకుండా బాబాకి గోడ చేర్పుగా, బాలాషింపీ, అబ్దుల్లా ఇద్దరూ వీపులాన్చి అటు తిరిగి కూర్చున్నారు. దగ్గుతున్నప్పుడల్లా లక్ష్మీబాయి షిండే బాబా గుండెలు రాస్తూ ఎదురుగా కూర్చుంది.
రామచంద్ర పాటిల్, దామూ అన్నా, మహల్సాపతి, కాకా దీక్షిత్ అందరూ అంతా బాబా పడుతున్న బాధను చూడలేక కన్నీళ్ళ పర్యంతమవుతున్నారు.
బూటీతో పాటుగా శ్యామా వచ్చాడప్పుడు.దిగజారిన బాబా పరిస్థితి చూసి, కన్నీరు పెట్టుకున్నాడు. భరించలేనట్టుగా గుండెను బాదుకున్నాడు.
తనతో గోళీలు ఆడిన బాబా, శ్యామా అని పిలిచి, తన ప్రతి సంశయాన్నీ, సందేహాన్నీ తీర్చిన బాబా, ముల్లోకాలనూ దర్శింపజేసిన బాబా, ఇప్పుడిలా దయనీయమయిన స్థితిలో…తట్టుకోలేకపోయాడు శ్యామా.
పెద్ద పెట్టున ఏడ్చాడు. చూశారు బాబా. దగ్గరకు రమ్మని చేత్తో సైగ చేశారు. వచ్చాడు శ్యామా.‘‘నా కోసం ఏడుస్తున్నావా?’’ అడిగారు. సమాధానంగా మరింతగా ఏడవసాగాడు శ్యామా.
ఏడవద్దనో, మరింకేదో చెప్పేందుకు నోరు తెరిచారు బాబా. మాట రాలేదు. రానీయక అడ్డు పడింది దగ్గు. బాబాని ఉక్కిరి బిక్కిరి చేసింది. అంతా భయాందోళనగా చూడసాగారు.
లక్ష్మీబాయి పరుగుదీసింది అక్కణ్ణుంచి. మంచినీరు తెచ్చి, అందించింది. బాబాకి నిమ్మళించిందప్పుడు. కళ్ళు మూసుకున్నారు బాబా. కాస్సేపటికి కళ్ళు తెరచి చూశారు.
అంతా దుఃఖిస్తూ, కన్నీరు పెట్టుకుంటూ కనిపించారు. వద్దన్నట్టుగా చేతిని ఊపారు బాబా.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- అనుక్షణం నన్ను అనుమానించే నిన్ను ప్రతి క్షణం ప్రేమించాలనిపిస్తుంది. ఏం చెయ్యను
- నేను చేసిన పని నాకు బాబాకి మాత్రమే తెలుసు.
- మీరు నాలుగు ముద్దలు తింటే నా ఆకలి తీరుతుంది.
- మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ మరణించడం నిజమా?
- నా భర్తని పాము కరిచిందయ్యా!
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments