శ్రీసాయి తత్వం – 1వ.భాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శ్రీ సాయి సత్ చరిత్ర పై సాయి.బా.ని.స (రావాడ గోపాలరావు) గారు ఎంతో పరిశోధన చేశారు.  ఆయన ప్రతీ రోజు శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ చేసేవారు.  ఆయన పారాయణ చేయడంతోనే సరిపెట్టలేదు.  సాయి సత్చరిత్రలోని ప్రతీ పేజీ ప్రతి మాట ప్రతి అక్షరం ఆయనకు కరతలామలకం.
అంతే కాదు సత్ చరిత్ర పారాయణ చేసిన తరువాత అయిపోయిందనుకొని గ్రంధాన్ని ఒకచోట భద్రంగా ఉంచి మరుసటిరోజు యధాప్రకారంగా పారాయణ చేసిన వారు కాదు. చరిత్ర మీద ఎంతో పరిశోధన చేశారు.  ఇంతకు ముందు మీకు శ్రీరామునిగా సాయి, కృష్ణునిగా సాయి, శివునిగా సాయి మొదలైన వాటి మీద ఆయన చేసిన పరిశోధనలను మన సైట్లో  ప్రచురించాను.
ఈ రోజు నుండి సాయి తత్వం మీద ఆయన చేసిన పరిశోధనల వ్యాసాన్ని మీకందిస్తున్నాను. చదవండి.  ఈ వ్యాసాలను చదివిన వారందరూ ప్రతీరోజూ శ్రీసాయి సత్ చరిత్రను పారాయణ చేసి కనీసం రోజుకు ఒక పేజీ ఆయన చెప్పిన విషయాలు యదార్ధమే అని నిర్ధారించుకోండి.
 సాయిబంధువులకు సాయి బా ని స గారు అందించిన శ్రీసాయి తత్వం  – 1వ.భాగం
ఓం శ్రీగణేశాయనమః, ఓం శ్రీసరస్వత్యైనమః, ఓం శ్రీసాయినాధాయనమః
మొట్టమొదటగా నా ఉపన్యాసం ప్రారంభించే ముందు సాయి భక్తులందరికీ నా ప్రణామములు.  సాయిబాబా తత్వాన్ని గురించి చెప్పడమంటే పంచభూతాలయిన గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం వీటిలోని శక్తిని కొలవడం వంటిది. వాటిలో ఉండే శక్తిని కొలిచే ప్రయత్నం చేయడమంటే వర్తమాన, భవిష్యత్ లను ఒకే సమయంలో అనుభవించడంవంటిది. అది అసాధ్యం.
కాని మానవ స్వభావం ఎప్పుడూ కూడా సూక్ష్మ వివరాలను చేదించి వాటి వివరాలను తెలుసుకోవడానికీ అందు కోసం ఆప్రక్రియపై పరిశోధన చేయడం కొనసాగిస్తోంది.
సాయి సత్ చరిత్ర ఆధ్యాత్మిక గ్రంధమని మనకందరకూ తెలుసు. అందుచేతనే మనమందరం పారాయణ చేస్తున్నాము. సాయి ధులియా కోర్టు విచారణలో తన వయస్సు లక్షల సంవత్సరాలని చెప్పారు.  సాయి సత్ చరిత్ర 3వ.అధ్యాయములో బాబా చెప్పిన మాటలు.
“నేను అందరి హృదయాలలోను నివసించువాడను. సర్వ జీవరాశులలోను నేను ప్రకటితమవుతున్నాను. సృష్టి స్థితి లయకారకుడను నేనే. ఈ చరాచర జగత్తంతా పాలించువాడను నేనే”
ఈవిశ్వమంతటా సాయే వ్యాపించి ఉన్నాడన్నది యదార్ధము.  సాయి తత్వాన్ని గురించి మాట్లాడటమంటే చిన్న పిల్లవాడు అక్షరాభ్యాసం నేర్చుకొనడంవంటిది.
సాయి సత్ చరిత్రను నేను అనేకమార్లు పారాయణ చేశాను.  కాని అన్ని మార్లు పారాయణ చేసినా నేనింకా విద్యార్ధినే అవడం వల్ల నేను గ్రహించుకొన్నవి చాలా తక్కువనే భావిస్తున్నాను.  ఆయన తత్వాన్ని యింకా లోతుగా అధ్యయనం చేసి ఆయన గురించి మరింతగా తెలుసుకునే భాగ్యాన్ని మరుసటి జన్మలలోకూడా కలిగించమని బాబాని ప్రార్ధిస్తున్నాను.
భగవదాజ్ఞ లేనిదే ఆకయినా కదలదు, చీమయినా కుట్టదు.  ప్రస్తుత కాలంలో ఒక మహాపురుషుడయిన యోగి గురించి వివరించే ఈ ప్రయత్నంలో సాయినాధుడు నన్ను ఒక సాధనంగా వాడుకొంటున్నారు.  కృతజ్ఞతకు మరోమాట లేదనే నేను భావిస్తాను.  
సాయినాధుడు నా చేయి పట్టుకొని ఆధ్యాత్మిక మార్గంలో నన్ను నడిపిస్తున్నందుకు ఆయనకు నేనెంతో ఋణపడి ఉన్నాను. చీకటిలో ఉన్న మనలిని చీకటిలో నుంచి వెలుతురులోకి తీసుకొని రావడానికి సద్గురువులు దీపాలవంటివారు.  అనగా మనలోనున్న అజ్ఞానాన్ని పారద్రోలి మనలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తారు.
దీపాలు ఏవిధంగా తయారవుతాయి? వాటి మూలపదార్ధాలను కనుగొనడమంటే అది శుధ్ధ తెలివి తక్కువతనమే అవుతుంది.  సాయి ద్వారకామాయిలో నీటితో దీపాలను వెలిగించి అజ్ఞానమనే చీకటిని ప్రారద్రోలారు.  వెలుతురు ఏవిధంగా దేని ద్వారా వచ్చిందన్నది కాకుండా మనకు లభించిన వెలుతురుకే ప్రాధాన్యమివ్వాలి.  శ్రీసాయినాధుల వారు సూచించిన మార్గంలో నడవటానికి నాకెంతో సంతోషంగా ఉందని చెప్పడం సమంజసంగా ఉంటుంది.
జ్ఞానులు చేసే ప్రవచనాలు జీవనదులయిన గంగా, యమున, నర్మద, కృష్ణ జలాలవంటివి.  ఈ నదులలో వివిధరకాలయిన చేపలు జీవిస్తున్నాయి.  చివరికి నదులలోని నీరంతా సముద్రంలోనే కలుస్తుంది. సముద్రపు నీరు ఉప్పగా ఉన్నప్పటికీ ఎన్నో రకాలయిన చేపలు అందులో జీవిస్తున్నాయి.  సాయి సముద్రంలో మనం చేపలవంటివారం.  సాయి తన భక్తులకి ఎంతో సరళంగా బోధలు చేసేవారు. అవి భక్తులకి సులభంగా అర్ధమయే రీతిలో ఉండేవి.
రేపు తరువాయి బాగం….

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles