Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
సాయిబంధువులకు సాయి బా ని స గారు అందించిన శ్రీసాయి తత్వం – 2వ.భాగం
పూర్తిగా వికసించిన కమలం చెరువులో ఎంతో సుందరంగా కనపడుతుంది. నీటిలో నుండి తీసిన కొద్దిసేపటికే తన తాజాతనాన్ని కోల్ఫొతుంది. వాస్తవానికి కమలం నీటిలో ఉన్నా కూడా దాని యొక్క తాజాదనం పరిమితం. అది శాశ్వతం కాదు. తరువాత వాడిపోవలసిందే.
హేమాద్రిపంత్ లాంటి ఎంతోమంది జ్ఞానులు జన్మించారు. వారంతా కూడా శ్రీసాయినాధుడు మరియు వారి భక్తుల సాంగత్యంలో కలువలాగే వికసించి ధన్యులయారు. ఒక గురువుయందు భక్తితో ఏవిధంగా మెలగలో హేమాద్రిపంతే అందుకు ఒక ఉదాహరణ.
సాయి తత్వం గురించి నాకు తెలిసిన ఏచిన్నవిషయమైనా సాయి భక్తుల ప్రయోజనం కోసం సరళమైన భాషలో తెలియచేస్తున్నాను. ఇది నా చిన్ని ప్రయత్నం. నేను శ్రీ సాయిసత్ చరిత్రను పారాయణ కోసం చేతులలోకి తీసుకున్నపుడెల్లా “నా పిల్లలందారూ ఆకాశంలో ఎగిరే గాలిపటాలవంటివారు” అని సాయి నాతో చెబుతున్నట్లుగా అనిపించేది.
గాలిపటం ఎగరడానికి కట్టిన దారం లాంటిది జీవితం. దారం చిక్కులు పడకుండా జాగ్రత్తగా కనిపెట్ట్లుకొని ఉండటానికి నేను దారపు కండెవంటివాడిని, అని బాబా చెప్పారు. సాయి చెప్పిన పదకొండు వాగ్దానాలలో ఒకదానికి యిది సరిపోలుతుంది. వాటిలో బాబా చెప్పిన విషయం “నాభక్తులు నన్నెప్పుడు పిలిచినా నాసమాధినుండే నేను వారిని రక్షిస్తాను”.
నేనెప్పుడూ యాత్రలు చేయలేదు. అందుకు నాకు చాలా బాధగా ఉండేది. కాని సాయి నన్నిలా ఓదార్చారు. “విష్ణువును దర్శించడానికి హరిద్వార్ కు వెళ్ళనవసరం లేదు. కనులు మూసుకొని ప్రశాంతంగా నామనసులోకి తొంగి చూడు. హరి దర్శనమవుతుంది”. శ్రీసాయి సత్ చరిత్ర 15వ.అధ్యాయంలో మనకు యిదే విషయం కనపడుతుంది. “నేనందరి హృదయాలలోను నివసించువాడను. సదా నన్నే ధ్యానించువారిని నేనెల్లప్పుడూ వారి రక్షణభారం వహిస్తాను”
“అక్రమ మార్గంలో ధన సంపాదన ముందు ముందు కష్టనష్టాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. భగవంతునికి ప్రీతి కల్గించే విధంగా పనిచేయాలి. అదిమాత్రమే మానవునికి దీర్ఘకాలంలో సుఖశాంతులనందిస్తుంది” దీనికి సంబంధించిన తత్వం మనకు శ్రీసాయి సత్ చరిత్ర 25వ.అధ్యాయంలో కనపడుతుంది.
దామూ అన్నా కాసార్ తొందరలోనే ఎక్కువ ధనం సంపాదించే ఉద్దేశ్యంతో భాగస్వాములతో కలసి వ్యాపారం చేద్దామనుకొన్నాడు. అప్పుడు బాబా “నీయింటిలో డబ్బుకు కొదవలేదు. ఒక్కరాత్రిలోనే విపరీతంగా ధనం సంపాదించి ధనికుడనైపొదామనే అత్యాశవద్దు” అన్నారు. ఆవిధంగా బాబా అక్రమార్జన తప్పని చెప్పి దామూ అన్నాని ఆప్రయత్నాన్నించి విరమింప చేశారు.
ధనవంతులు నిర్మించుకొన్న పెద్ద పెద్ద భవంతులలోకి గాని వాటి ప్రక్కనే కట్టుకొన్న పూరిగుడిశెలలోకి గాని సాయి సాగరం నుండి వీచే గాలి సమంగానే వీస్తుంది.
బాబా తన ప్రేమాభిమానాలను అందరి మీద సమంగానే చూపించేవారు. బాబా ముగ్గురు భక్తులను సమానంగా ప్రేమించారు, అభిమానించారు. వారు ధనవంతుడయిన గోపాల్ ముకుంద్ బూటీ, శ్యామా, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సామాన్యుడు, కుష్టురోగియైన భాగోజీ షిండే. వీరు ముగ్గురూ వేరు వేరు వర్గాలకు చెందినవారు.
కొన్ని కొన్ని సమయాలలో ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వారికి ధన సంపాదన అడ్డంకిగా మారుతుంది. మన దైనందిన జీవితాసరాలకోసం, మన శరీర పోషణకోసం, ధనం ముఖ్యమయినది. అందులో సంధేహం లేదు. అందుకోసం మన కనీస అవసరాల కోసమే ధనం సంపాదించాలి.
బాబా ఎల్లాప్పుడూ ఈ సూత్రాన్నే ఆచరించారు.
బాబా ప్రతిరోజూ భక్తుల వద్దనుండి దాదాపు 500 రూపాయల దాకా దక్షిణగా స్వీకరించేవారు. ఆవిధంగా వచ్చినదంతా సాయత్రమయేసరికి తన భక్తులందరికీ పంచిపెట్టేసేవారు. మరుసటి రోజున తిరిగి యధాప్రకారంగా భిక్షకు బయలుదేరేవారు.
“త్రాగుడు వల్ల సుఖసంతోషాలు లభించవు. జీవితంలో నిర్వహించవలసిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినపుడే నిజమైన శాంతి లభిస్తుంది”. శ్రీసాయి సచ్చరిత్ర 19వ.అధ్యాయంలో మనం యిదే విషయాన్ని గమనించవచ్చు. బాబా ఒక త్రాగుబోతుకు కలలో కనిపించి అతని గుండెల మీద కూర్చొని గట్టిగా అదిమిపెట్టి జీవితంలో యిక మరెప్పుడూ త్రాగనని వాగ్దానం చేసిన తరువాతనే వదలిపెట్టారు.
“అనాధ ప్రేత సంస్కారం వెయ్యి సార్లు గంగాస్నానం చేసినంత ఫలితాన్నిస్తుంది.” దానికి ఉదాహరణ బాబా తన అంకిత భక్తుడయిన “మేఘుడి”కి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
రేపు తరువాయి బాగం….
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments