మీరు నాలుగు ముద్దలు తింటే నా ఆకలి తీరుతుంది.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

దానగుణంలో బాబాకి మించిన వారు లేరు. తనకి దక్షిణగా వచ్చే సొమ్మునంతా దానధర్మాలకి వినియోగించేవారాయన. దర్శనానికి వచ్చిన భక్తులను గమనించి, వారికి ఏ మేరకు డబ్బు అవసరమో తెలుసుకుని, ఆ మేరకు డబ్బును గుప్తంగా అందజేసేవారు బాబా.

కొందరి పోషణ భారాన్ని కూడా తానే భరించేవారు.ఎవరి సేవనీ ఉచితంగా స్వీకరించేవారు కాదు బాబా. సేవకి తగినట్టుగా మూల్యాన్ని చెల్లించుకునే వారు.

ఎప్పటికప్పుడు ఋణ విముక్తులయ్యేవారు. ఋణ విముక్తిలో భాగంగానే తాత్యాని ఆరోగ్యవంతుణ్ణి చేసి, తాను అనారోగ్యం పాలయ్యారు. అనారోగ్యంతో ఆగిపోలేదు. ప్రాణత్యాగానికే సిద్ధపడ్డారు.

ఆ విధంగా బయిజాబాయి ఋణం తీర్చుకుంటున్నారు.మధ్యాహ్న హారతి పూర్తయింది. హారతి పూర్తయినా శ్యామా తదితరులంతా ఇంకా అక్కడే కూర్చుని ఉన్నారు. కదలడం లేదెవరూ. అది ఇబ్బంది అనిపించింది బాబాకి.

‘‘అంతా భోజనానికి వెళ్ళి రండి.’’ అన్నారు.‘‘మాకు ఆకలి లేదు బాబా. అయినా ఈ స్థితిలో మిమ్మల్నిలా వదలి, భోజనాలకు వెళ్ళడం బాగోదు. మేము వెళ్ళం.’’ అన్నాడు శ్యామా.

‘‘నాకు బాగా ఆకలిగా ఉందయ్యా! వెళ్ళి రండి, భోంచెయ్యండి. మీరు నాలుగు ముద్దలు తింటే నా ఆకలి తీరుతుంది.’’ బతిమలాడారు బాబా. సమాధానంగా భక్తులంతా ఒకరిని ఒకరు చూసుకున్నారేగాని, ఎవరూ అడుగు కదపలేదు అక్కణ్ణుంచి.

చిరాకు కలిగింది బాబాకి.‘‘చెబుతోంటే మీక్కాదు?’’ అరిచారు.‘‘అది కాదు బాబా, ఒంటరిగా మిమ్మల్నొదిలి వెళ్ళాలంటే భయంగా ఉంది. మీకు జరగరానిది జరిగితే…’’ ఆగిపోయాడు శ్యామా.

అతనలా ఆగిపోవడానికి కారణం, శ్యామా మాట పూర్తి కానేలేదు. బాబా అన్నారిలా.‘‘ఏది ఎప్పుడు జరగాలో అది జరుగుతుంది. అలా జరగడమే నాకిష్టం. నా ఇష్టాన్ని గౌరవించేవాళ్ళు లేచి, భోజనానికి వెళ్ళిరండి, గౌరవించని వాళ్ళు మీ ఇష్టం ఇక్కడే నన్ను పట్టుకుని వేళ్ళాడండి.’’

బాబాకి కోపం వచ్చిందని తెలుసుకున్నారంతా. ఆయనకి కోపం వస్తే ఎంతకయినా తెగిస్తారు. అప్పుడు బాధపడేది తామే! అందుకని భోజనానికి వెళ్ళేందుకు భక్తులు లేచి నిల్చున్నారు.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles