కుక్క కాదమ్మా, నేనే! ఏ జీవి ఆకలి తీర్చినా అది నా ఆకలి తీర్చినట్టే!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

విన్నవారంతా ఆ వివరణకి ముగ్ధులయ్యారు.‘‘తల్లీ! ఎవరయితే ఈ నవవిధ భక్తి సూత్రాలను అనుసరించి దేవుణ్ణి చేరుకుంటారో వారు ధన్యులు. ఇంకొక మాట! ఆ దేవునికి ప్రతినిధిగా ఇక్కడ సద్గురువు జీవిస్తాడు. ఆ సద్గురువుని సేవించినా చాలు, సద్గతి లభిస్తుంది.’’ అన్నారు బాబా.

ఆ మాటతో షిరిడీలో ఉండిపోయింది లక్ష్మీబాయి. బాబాని రాత్రింబవళ్లు సేవించి మనశ్శాంతి పొందింది. అందుకు కృతజ్ఞతగా భాగ్యవంతురాలయిన ఆమె ఎంతో డబ్బు ఖర్చు చేసి, బాబా సంస్థానాన్ని చాలా అభివృద్ధి పరచింది.

బాబా పట్ల లక్ష్మీబాయికి ఎంతటి భక్తి అంటే వండుకున్నది ముందు బాబాకి నివేదన చేసిన తర్వాతే దానిని ప్రసాదంగా తాను స్వీకరించేది

.ఎప్పటిలాగానే ఆ రోజు సాయంత్రం ద్వారకామాయికి చేరుకుంది లక్ష్మీబాయి. ఆమెను దగ్గరగా పిలిచారు బాబా.‘‘చెప్పండి బాబా, ఏం కావాలి?’’ అడిగింది లక్ష్మీబాయి.‘‘నాకు ఆకలిగా ఉందమ్మా’’ అన్నారు బాబా.

ఆ మాటకి తల్లిలా తల్లడిల్లిపోయింది లక్ష్మీబాయి.‘‘ఇప్పుడే వస్తాను బాబా.’’ అందామె. పరుగులాంటి నడకతో ఇంటికి చేరుకుంది. గబగబా రొట్టెలు తయారు చేసింది. బాబాకి ఇష్టమయిన కూర చేసింది. రెంటినీ పట్టుకుని, బాబాని సమీపించింది.

వాటిని బాబా ముందు నైవేద్యంగా పెట్టింది.‘‘తిను బాబా, ఆకలి అన్నావుగా, తిను.’’ అంది.రొట్టెను అందుకున్నారు బాబా. వాసన చూశారు ‘బాగుంది’ అన్నట్టుగా కళ్ళెగరేశారు. తర్వాత దానిని దగ్గరగా కూర్చుని తోకాడిస్తూన్న కుక్కకి ఆహారంగా వేశారు. ఎంత ఆకలిగా ఉందో పాపం! ఆవురావురుమని తినసాగిందది.

భక్తిగా బాబా కోసం అని చేసి తెస్తే తాను తినక, రొట్టెని కుక్కకి పెట్టి ఆనందిస్తున్న బాబాని చూసి బాధపడింది లక్ష్మీబాయి. కళ్ళు చెమర్చుకుంది. గమనించారది బాబా. సన్నగా నవ్వుకున్నారు.

బాధను అణచుకోలేకపోయింది లక్ష్మీబాయి అడిగేసింది ఆఖరికి.‘‘నీ కోసం అని తీసుకొస్తే రొట్టెని కుక్కకి పెడతావేంటి బాబా.’’‘‘అది కుక్క కాదమ్మా, నేనే! ఏ జీవి ఆకలి తీర్చినా అది నా ఆకలి తీర్చినట్టే!

అన్ని ప్రాణుల్లోనూ ఉన్న ఆత్మ ఒకటే! పరమాత్మ ఒకటే! చరాచర జీవికోటిలో పరమాత్మను దర్శించి సేవించడమే నిజమైన భక్తి. నవవిధ భక్తి సూత్రాలన్నీ అందులోనే ఉన్నాయి.’’ అన్నారు బాబా. నవ్వారు.

అంతలో ఆయనకి విపరీతంగా దగ్గు వచ్చింది. ఆ దగ్గుతో ఊగిపోయారు. లక్ష్మీబాయి, శ్యామా ఆందోళనగా బాబాని పట్టుకున్నారు.

 

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles