Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయి సాహిత్యంలో కొందరు తమ ప్రతిభతో రాణిస్తే, మరికొందరు సాయినాథుని లీలల వలన గుర్తుండిపోతారు. ఇందులో శ్రీమతి లక్ష్మీబాయి షిండే రెండవ వర్గంలోకి వస్తుంది.
సాయిబాబా ఆమె భక్తి ప్రపత్తులను గ్రహించారు. ఆమెకు, తద్వారా ఇతర భక్తులకు మరువలేని విధంగా సర్వ జీవ సమత్వమును తెలిపారు.
తనకోసం తయారు చేసుకొని వచ్చిన రొట్టెను కుక్కకు పెట్టగా, లక్ష్మీబాయి చిన్నబుచ్చుకుంది.
అప్పుడు సాయి ”అనవసరముగా విచారించెదవేల? కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుటవంటిదే.
కుక్కలకు కూడా ఆత్మ కలదు. జంతువులు వేరుకావచ్చును, అందరి ఆకలి ఒకటియే.
కొందరు మాట్లాడగలరు. కొందరు మూగవలె మాట్లాడలేరు. ఎవరయితే ఆకలితోనున్న వారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము”.
ఇది ఉపనిషత్తుల సారమే. ఆమె ద్వారా సాయి మనకు అందించారు.
మరొక సంఘటన: సాయిబాబా మాటలు, చేతలు కొన్నిసార్లు అర్థంకావు. అలా ఆయన ప్రవర్తించటం అనేక సమయాలలో చూడవచ్చును.
సాయిబాబా ఇంకా కొద్ది క్షణాలలో మహాసమాధి చెందుతారనగా కూడా, అంతరార్ధములపై, అంతరార్ధ చర్యలపై మక్కువతీరలేదు.
లక్ష్మీబాయి షిండేను దగ్గరకు పిలచి రూ.5/-, తరువాత రూ.4/- (మొత్తం రూ.9/-) ఇచ్చారు నాణెముల రూపంలో.
ఆ తొమ్మిది రూపాయలకు వివిధ వ్యాఖ్యానాలున్నాయి.
ఆ తొమ్మిది రూపాయలు సీమోల్లంఘనం నాటి దక్షిణ కావచ్చు.
శిష్యునకు ఉండవలసిన లక్షణములు కావచ్చును.
నవ విధ భక్తిరీతులకు సంకేతము కావచ్చును.
ఏవి ఏమైనా ఈ సంఘటనలు లక్ష్మీబాయి షిండేను అజరామరం చేశాయి.
ఇంకా విచారిస్తే, వాటిని భక్తులు పాటించగలిగితే సాయినాథునికి కలిగే ఆనందమును మనం ఊహించలేము.
లక్ష్మీబాయి షిండే జూన్ 2, 1968న సాయిలో ఐక్యమైంది.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- కదిలింది పల్లకి ….. సాయి@366 మార్చి 2…Audio
- రాజారామ్…..సాయి@366 జూలై 20…Audio
- అల్లా వెలిగించిన దీపం …..సాయి@366 జూన్ 4….Audio
- ‘‘ఈ తొమ్మిది నాణెలూ తొమ్మిది విధాల భక్తికి ప్రతి రూపాలు. జాగ్రత్తగా దాచుకో.’’
- విచిత్ర ప్రసాదం…..సాయి@366 ఏప్రిల్ 30….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments