అల్లా వెలిగించిన దీపం …..సాయి@366 జూన్ 4….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


ఇచ్ఛా మరణం అనేది సాయివంటి మహనీయుల సొత్తు. వారికి ఇష్టమైతే వెల్లడి చేస్తారు, లేకుంటే లేదు.

సాయి వంటి సత్పురుషులు సూచనలు కూడా అప్పుడప్పుడు ఇచ్చేవారు వారి మరణం గురించి.

నాలుగు నెలల తరువాత సమాధి చెందుతాననగా సాయిబాబా, కాశీం అనే వ్యక్తితో ఔరంగాబాదు వెళ్ళి అక్కడ ఉండే షంషుద్దీన్‌ మియాను దర్శించు. అతనికి ఈ రెండు వందాల రూపాయలివ్వు.

అక్కడ మౌలు, కవ్వాలి, న్యాస్‌ జరిపించు. ఇంకా బన్నే మియా దగ్గరకు వెళ్ళి వారి మెడలో ఈ పూల మాల వేసి ”నవ్‌ దిన్‌, నవ్‌ తారీక్‌ అల్లా మియానే అప్నా దునియా లేగయా, మర్జీ అల్లాకి అని చెప్పు”. ఈ సంఘటన జూన్‌ మాసంలో జరిగిఉంటుంది.

కాశీం, ఇమాంభాయ్‌ ఛోటేఖాన్‌, అమీర్‌లు ఔరంగాబాదు చేరారు. షంషుద్దీన్‌ను కలసి వచ్చిన పని చెప్పారు. షంషుద్దీన్‌ ఎంతో మందిని ఆహ్వానించి ఘనంగా సంతర్పణ (న్యాస్‌) చేశాడు.

తరువాత సాథువులను గురించి కవ్వాలీ జరిపించాడు. మౌలు కూడా (దేవుని స్తుతిస్తూ పాడే పాటలు) చేయించాడు.

ఇక బన్నేమియా దగ్గరకు పోయారు వారు. అప్పటికి బన్నేమియాకు 102 ఏండ్లు.

సాయిబాబా సమకాలికులలో పేరు ప్రఖ్యాతులున్న సూఫీ యోగులు ముగ్గురు – ఒకరు తాజుద్దీన్‌ బాబా, రెండు – బాబా జాన్‌, మూడు – బన్నేమియా.

బన్నేమియా అసలు పేరు హజ్రత్‌ ఆడంషా బియాబాని రిఫాయత్‌ చిస్తీ. ఆయన చిస్తీ సాంప్రదాయకుడని అంటారు.

సాయిబాబాయే ఈయనకు దివ్య దర్శనమును ఇప్పించి, ఔరంగాబాదుకు పంపారని మెహర్‌ బాబా అంటారు.

ఏది ఏమైనా బన్నేమియా వద్దకు కాశీం మొదలైన వారు పోగా, ఆయన తన్మయత్వంతో ఒక చేయి పైకెత్తి, వేరొక చేయి క్రిందకు పెట్టి నిలబడి ఉన్నారు.

బన్నేమియా నిజస్థితికి వస్తారేమోనని గంటవరకు వేచి ఉన్నారు వారు, నిజస్థితికి రాకుంటే, సాయిబాబా ఇచ్చిన పూలమాలను ఆయన మెడలో వేశాడు ఇమాంఖాన్‌.

బన్నేమియా మామూలు స్థితికి రాగానే సాయిబాబా చెప్పిన మాటలను చెప్పారు.

అప్పుడు బన్నేమియా తదేకంగా ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయారు. కన్నుల నుండి నీరు కారసాగింది.

ఇక వారు బన్నేమియా దగ్గర సెలవు తీసుకుని షిరిడీ చేరారు. బన్నేమియా సాయిబాబా సమాధి చెందిన 3 సంవత్సరములకు సమాధి చెందారు.

సాయి ముందస్తు సూచనను కొందరు మాత్రమే గ్రహించగలిగారు.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles