Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
తల్లితండ్రులలో ఒకరు సాయి భక్తులయితే చాలు, వారి సంతానం కూడా సాయి భక్తిపరులవుతారు.
గంగాధర్ విష్ణు క్షీరసాగర్ తల్లి దండ్రులు సాయి భక్తులు.
వారు షిరిడీ వెళ్ళి సాయిని దర్శిస్తుండే వారు. వారు తమ పొలాన్ని సాయిబాబా భక్తుడైన బాలాజి నేవాస్కర్‌కు కౌలుకు ఇచ్చాడు. కొంత కాలం బాగానే గడచింది. గంగాధర్ తండ్రి మరణించాడు.
నేవాస్కర్ ఆ పొలానికి తానే హక్కుదారుడనని ప్రకటించుకున్నాడు. అయితే ఈ సమస్యను సాయిబాబా ముందు పరిష్కరించుకుందాం అని నేవాస్కర్ చెప్పటంతో అందరూ సాయి సన్నిధికి చేరారు.
వారు ద్వారకామాయి మెట్లు ఎక్కుతుండగానే సాయి నేవాస్కర్‌తో ”ఎందుకు నా బిడ్డలను అవస్త పెడతావు? ఆ పొలాన్ని వారికి స్వాధీనం చేయి” అని సలహా ఇచ్చారు.
ఇక అందరూ వెళ్ళిపోయారు సాయి మాటలు విని. కానీ నేవాస్కర్ మాత్రం పొలాన్ని గంగాధర్‌కు స్వాధీనం చేయలేదు. కోర్టు ద్వారా వారు ఆ పొలాన్ని స్వాధీనం చేసుకో వలసి వచ్చింది.
సాయిబాబా మహా సమాధి చెందారు.
గంగాధర విష్ణు క్షీరసాగర్ సోనావాడీకి బదలీ అయ్యాడు. సోనావాడి షిరిడీ-నాసిక్ మార్గంలో ఉన్నది. అప్పటి నుండి గంగాధరుడు షిరిడీ వెళ్ళి సాయి మందిరంలో కీర్తనలు చేసేవాడు.
ఆ రోజు జూన్ 27, 1935.
ఆ రాత్రి గంగాధర్‌కు స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో సాయి దర్శనమిచ్చాడు.
సాయి ”ఇంకా నిద్ర పోతున్నావా? ఈ రోజు నీ పొలం నీ స్వంతం చేస్తూ కోర్టు ఉత్తర్వు ఇచ్చింది. షిరిడీలో జాతర జరుగుతుంది. రా భోజనం చేయి” అని గంగాధరునికి చెప్పి అదృశ్యమయ్యాడు.
గంగాధరుని ఆస్తి కోర్టు కేసులో ఉన్న మాట వాస్తవమే. ఆ రోజే గంగాధరుని సోదరుని వద్ద నుండి ఉత్తరం వచ్చింది.
ఆ ఉత్తరంలో అహమ్మద్ నగర్ జిల్లా కోర్టు గంగాధర సోదరులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, ఆ తీర్పు ఇచ్చిన దినం జూన్ 27, 1935 అని ఆ ఉత్తరంలో ఉన్నది.
అయితే కోర్టు ఉత్తర్వు ఇచ్చిన దినం, సాయి స్వప్నంలో ఆ విషయం తెల్పిన దినం ఒక్కటే!
ఎక్కడ ఏది జరిగినా అది వెంటనే సాయికి తెలిసి పోతుంది.అది సాయి స్పీడ్ పోస్ట్!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- నీది కానిది నీకు వద్దు…..సాయి@366 అక్టోబర్ 10….Audio
- న్యాయవాది …..సాయి@366 జూలై 26….Audio
- నా రుణము తీర్చవయ్యా! సాయి!! …..సాయి@366 ఆగస్టు 3…Audio
- ఆరతుల భావము…..సాయి@366 ఏప్రిల్ 9….Audio
- ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి…..సాయి@366 జూన్ 10…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments