నా రుణము తీర్చవయ్యా! సాయి!! …..సాయి@366 ఆగస్టు 3…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


సాయి భక్తుడైనా కాకపోయినా రుణం అంటే అప్పు చేయవలసి వస్తుంది జీవిత కాలంలో.

కష్టం అనిపించేది రుణం తీర్చటం. ఒకొక్కసారి కొన్ని పరిస్థితులలో రుణమును తీర్చటం కుదరదు. అప్పుడు సాయి బాబాను శరణు వేడటం కద్దు.

కాకా సాహెబ్‌ దీక్షిత్‌ ముప్పది వేల రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు ఒకసారి.

అప్పటికే సాయి మహా సమాధి చెందాడు. ఒక రోజు కలలో బాకీదారులు పీడిస్తుంటే ”చిమన్‌ లాల్‌, సేటల్‌వాడ్‌ మొదలైన సుప్రసిద్ధ ధనవంతులు తెలుసు” అన్నాడు నిద్రలోనే.

తెల్లవారింది. నిద్రలో కల జ్ఞప్తికి వచ్చింది. ”సాయిబాబా నీ గురించి అంత నమ్మకంతో చెప్పలేకపోయాను, నన్ను మన్నించు” అని ప్రాధేయపడ్డాడు బాధతో.

కన్నీళ్ళతో బాబాను ప్రార్ధించాడు. డబ్బు దొరక లేదు. సాయిపై నమ్మకం తొలగ లేదు. ఇంకొక్క రోజే గడువు ఉన్నది.

అప్పుడు కొంత కాలం క్రితం మరణించిన స్నేహితుని కుమారుడు దీక్షిత్‌ దగ్గరకు వచ్చి తన వద్ద ముప్పది వేల రూపాయలు ఉన్నాయని వాటిని ఎందులో పెట్టుబడి పెడితే మంచిదో చెప్పండని సలహా అడిగాడు.

దీక్షిత్‌ తన పరిస్థితిని చెప్పాడు ”ముందు మీ అవసరం తీర్చుకోండి” అని ఆ స్నేహితుని కుమారుడు ముప్పది వేలు ఇచ్చి వెళ్ళాడు.

సాయిబాబా మహాసమాధి చెందిన తరువాత జరిగిన మరొక సంఘటన. ఒక డాక్టరు బాబా భక్తుడు.

ఆయనకు ఆగస్టు నెల 1983లో ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరాన్ని వ్రాసిన వారు శ్రీ ఆర్‌. రాధాకృష్ణన్‌. ఈయన కూడా సాయి భక్తుడే.

ఆయన సెంట్రల్‌ గవర్నమెంటులో పనిచేసి రిటైరయ్యాడు. మూడు వేల రూపాయలను అప్పు చేసి కుమారుని వివాహం జరిపించాడు. అప్పు తీర్చాలి. సాయిని ప్రార్ధించాడు.

ఏప్రిల్‌ 1979కు ముందు రిటైరైన పెన్షనర్లకు నూటికి యాభై శాతం పెన్షన్‌ పెంచాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. ఇది అనుకోని సంఘటన.

1979 ఏప్రిల్‌ నుండి బకాయిలను కూడా ఇవ్వాలని కోర్టు ఉత్తర్వు. అలా ఆయనకు మూడు వేల నుండి మూడువేల ఎనిమిది వందలదాకా బకాయిల రూపేణా వస్తాయని తేలింది.

సంతోషంతో ఆ వచ్చిన అదనపు ధనంతో అప్పు తీర్చాడు. ఇది సాయి కరుణే అంటారాయన. సాయి మన రుణాలు తీరుస్తాడు –

కానీ, మనం సాయికి ఎంత రుణపడి ఉన్నామో గదా!

భక్తితో తీర్చివేద్దాం!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles