Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
హైదరాబాదు నివాసి వాసుదేవ సీతారాం రతాంజనకర్ గారు సాయి భక్తులు.
ఆయన తన పిన్ని కూతురును సాయి ఎలా అపూర్వంగా కరుణించింది ఆగస్టు 18, 1922న ఒక ఉత్తరంలో వివరించారు.
సీతారాం రతాంజన్కర్ పిన్ని కూతురు మాలన్బాయి జ్వరంతో చాలా రోజులు మంచం పట్టింది. ఎందరో డాక్టర్లకు చూపారు. అన్ని రకాల వైద్యం చేయించారు. ఏ మాత్రం గుణం కనపడలేదు.
సాయి సచ్చరిత్రలోని 13వ అధ్యాయంలో వచ్చే భీమాజీ పాటిల్ స్థితి వలె ఆ బాలిక పరిస్థితి ఉన్నది. ఒక తేడా ఉన్నది.
నానా సాహెబ్ ద్వారా సాయి మహిమను తెలుసుకుని సాయి వద్దకు ఆయన చేరాడు. మాలన్బాయి ఇక సాయి సన్నిధికి పోతానన్నది. ఇక వైద్యులు కూడా చేసేది లేక ‘సరే’ అన్నారు.
ఆ బాలిక ఇద్దరు ముగ్గురితో సాయి సన్నిధి చేరింది. ఆమెను చూడగానే సాయి తిట్టారు, ఒక దెబ్బ కూడా వేశారు.
ఆమెను గొంగళి మీద పరుండ చేశారు. ఆమెకు నీరు మాత్రం ఇవ్వండి అన్నారు దీక్షిత్ వాడాలో ఆమె ఉండసాగింది.
7, 8 రోజులు సాయి చెప్పినట్లు జలం మీదనే ఉన్నది. సాయి తనను కాపాడునని ఎంత నమ్మకమో వివరించలేము.
ఒక రోజు, తెల్లవారు జామున ఆమె దేహాన్ని వదిలింది. అందరూ శోకగ్రస్తులయ్యారు. ఆ రోజు సాయి చావడిలో పరుండే దినం.
సాయి నిద్ర లేవగానే కాకడ ఆరతి ఇవ్వటానికి అందరూ తయారుగా ఉన్నారు. ఉదయం 8 గంటలైంది. సాయి ఇంకా నిద్ర లేవలేదు. అక్కడ ఆమె అంతిమ యాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు శోకగ్రస్తులై.
ఇంతలో మాలన్బాయి ఒళ్ళు విరుచుకుంటూ, ఆవలిస్తూ లేచింది. భయంతో నాలుగు దిక్కులు చూచింది. ఆమె తేరుకున్నది.
ఆమె అందరితో ”ఒక నల్లటి మనిషి నన్ను తీసుకుపోతుంటే భయపడ్డాను.
బాబా అతడిని కొట్టి నన్ను విడిపించి చావడికి తీసుకొచ్చాడు” అన్నది. ఆమె చావడిని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించింది. అందరూ ఆశ్చర్యపోయారు.
ఎందుకంటే అంతవరకు ఆమె చావడిని చూడనే చూడలేదు.
ఒక్కసారిగా సాయి నిద్ర లేస్తూ అరుస్తూ, సటకా ఊపుతూ, మాలన్బాయి ఉన్న దీక్షిత్ వాడా వద్దకు వచ్చారు. సాయి తనను నమ్మిన వారిని నట్టేట ముంచడు.
ఇది సాయి లీల, ఆశ్చర్యం కలిగించేదే.
మాలన్బాయికి ఉన్న భక్తి మనకు కూడా కలుగు గాక!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- నిర్ణేత సాయి …..సాయి@366 సెప్టెంబర్ 23….Audio
- మాట సాయం! …..సాయి@366 ఏప్రిల్ 15….Audio
- సచ్చరిత్ర పారాయణ ఫలం …..సాయి@366 జూన్ 18…Audio
- గుజరాతీ జరీ శాలువ …..సాయి@366 ఆగస్టు 10…Audio
- జై సచ్చిదానంద! …..సాయి@366 ఆగస్టు 11….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments