ఆత్మానందం …. మహనీయులు – 2020… ఆగస్టు 18



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ బాబా మహారాజ్ సహస్రబుద్దే లేక శ్రీ రావ్ సాహెబ్ సహస్రబుద్దే, ఈయన బీడ్కర్ మహారాజ్ శిష్యులు.

దత్త సాంప్రదాయములోని స్వరూప శాఖకు చెందిన వారు. “రావ్ సా రత్నం” అనే వారు బీడ్కర్ మహారాజ్ ను. బీడ్కర్ మహారాజ్ అక్కలకోట మహారాజ్ శిష్యులు.

ఈ బాబా మహారాజ్ అసలు పేరు రామచంద్ర సహస్రబుద్దే. ఈయన పూనాలో ఇంజనీరింగ్ చదువుకోవటానికి వెళ్ళినప్పుడు అక్కడ బీడ్కర్ మహారాజ్ ను దర్శించి, ధ్యాన పద్దతులను చదవసాగాడు.

ధ్యానాన్ని ఎక్కువగా చేస్తుండే వాడు. చదువుయందు చూపించవలసినంత శ్రద్ధను చూపేవాడు కాదు.

పరీక్షా దినాలలో కూడా, ఈయన ధ్యానం చేస్తూ ఉంటే, తల్లి బీడ్కర్ మహారాజ్ కు తన కుమారుని పరిస్థితిని గూర్చి చెప్పింది.

“అతడు సంపూర్ణంగా నా రక్షణలో ఉన్నాడు” అని ఆమెకు చెప్పేవాడు బీడ్కర్ మహారాజ్. అయితే పరీక్షలలో చక్కగా ఫ్యాసయినాడు.

షిరిడీలోని సాయి భక్తులు చదువుపై శ్రద్ధపెట్టకుంటే, హెడ్ మాస్టర్ బాధపడ్డాడు. అయినా ఆ పిల్లలు సాయి భక్తులు. ఊదీని ధరించి, పరీక్షలలో ఉత్తీర్ణులు కాగలిగారు.

బాబా మహారాజ్ కు P. W. D. లో ఉద్యొగం కూడా వచ్చింది. మహారాష్ట్రలో పనిచేసేవాడు. ప్రతి శనివారం తన గురువును తప్పకుండా దర్శించేవాడు.

ఒకొక్కసారి కొన్ని మైళ్లు, సైకిలుపైనా, ఇంకా మరికొన్ని మైళ్లు కాలి నడకన కూడా పోవలసి వచ్చేది. రైలు ప్రయాణంతోపాటు. గురు దర్శనానికి ఎంతో శ్రమపడేవాడు.

ఆఫీసులో కూడా ఎప్పుడూ ధ్యానంలో నిమగ్నమయినట్లుండటం, ఈ ప్రపంచంతో ఏదీ పట్టనట్లుండటం చూచి అందరూ ఈయనను పని దొంగ అనేవారు.

ఈయనని పరీక్షించటానికి వచ్చారు కొందరు అధికారులు. నోటితోనే, ఒక చిన్న కాగితం ముక్కను చూస్తూ, కట్టడాల నిర్మాణపు కొలతలు గడగడ చెప్పాడు. ఆయన చెప్పిన లెక్కలలో తప్పులేదని తేలింది ఆ అధికారులకు.

ఈయన తన గురు దర్శనమునకు ఆఫీసు ఉద్యోగం కుదరనందున ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, గురు సేవకే అంకితమైనాడు.

105 డిగ్రీల జ్వరం ఉన్నా గురు సమాధిని తప్పక ప్రతి దినం ముమ్మారు దర్శించేవాడు. సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు 21 రోజులు సూర్యున్ని చూస్తూ ఉండిపోయారాయన, ఒక సందర్భంలో.

అరవిందుల గురువు లేలే మహారాజ్ ఈయనను (బాబా మహారాజ్ ను గూర్చి) ఆత్మ సాధనలో అత్యన్నత శిఖరాన్ని ఎక్కాడు అన్నారు.

ఎప్పుడూ ఆత్మానందంలోనే ఉండేవారు. ఈయన అయోధ్యలోని సరయు నదిలో జల సమాధి చేసుకుందామని వెళ్లారు. కాని ఆ నదిలోకి ఎంత దూరం వెళ్లినా మడమ దాటి నీటి ప్రవాహం లేదు. జల సమాధిని దైవం అంగీకరించలేదని తిరిగి వచ్చేశారు.

ఈయన ఆగస్టు 18 (1954)లో దేహాన్ని విడిచారు. నేడు ఆగస్టు 18. బాబా మహారాజ్ వర్థంతి. ఈయనకున్న గురు భక్తి మనకు కూడా అలవడును గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles