గురువుకు నామం…. మహనీయులు – 2020… నవంబర్ 18



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


కొందరి మహనీయుల కీర్తి పతాకాలను కాలం కూడా ఎగురువేస్తుంది. ఆ మహనీయులకు నామం పెట్టిన వారు కూడా చిరస్మరణీయులే.

‘సాయి’ అని ఫకీరుకు నామకరణం చేసింది మహల్సాపతి. మౌనస్వామి అని, బ్రాహ్మణస్వామి అని పిలవబడే మహనీయునికి భగవాన్ శ్రీరమణ మహర్షి అని గణపతి ముని పేరు పెట్టారు.

గణపతి ముని అసలు పేరు నవాబు అయ్యలసోమయాజుల గణపతి శాస్త్రి. ఆయన 17 – 11 – 1878న కార్తీక బహుళ అష్టమినాడు జన్మించారు.

కావ్యకంఠులు కార్తీక మాసమున కృత్తికోత్సవములలో సాయంకాలము ఈశ్వరుని ముందు నిలబడి ప్రతి దినము తాను వ్రాసిన శ్లోకములను వినిపించేవాడు. తుది దినమున శేషాద్రిస్వామి కూడా వినటం జరిగింది.

ఒకనాడు కావ్యకంఠ గణపతి మునులు మౌనస్వామిని దర్శిస్తున్నప్పుడు, ఎవరో “శుక్లాంబరధరం…”శ్లోకాన్ని విష్ణుపరంగా చెప్పగలరా అని గణపతిమునులను ప్రశ్నించారు.

కావ్యాలే ఆయన కంఠంలో ఉండగా, ఆయన చెప్పలేక పోవట మేమిటి? సునాయాసంగా చెప్పాడు, చిరునవ్వు నవ్వి, ఆ చిరునవ్వుతో గణపతిని అభినందించారు బ్రాహ్మణస్వామి. అప్పుడు కూడా గణపతి ముని, బ్రాహ్మణ స్వామిని ఆశ్రయిద్దామనే తలంపే రాలేదు.

తిరువణ్ణామలైలో కృత్తికోత్సవమును జరుపుచున్నారు. 7వ నాడు రథము కదల లేదు. గణపతిమునికి ఈ సంగతి తెలిసింది.

గణపతి ముని వెంటనే నేల మీద సాష్టాంగపడి “తండ్రీ! ఇక నీ రథమును కదలునట్లు చేయుము” అని ప్రార్ధించి, ప్రజలను రథమును లాగమన్నాడు.

రథము కదిలింది. గణపతి ముని వడివడిగా వెడలిపోయారు. అప్పుడే గణపతి మునికి బ్రాహ్మణస్వామిని కలవవలెననే గాఢమైన కోరిక కలిగింది. వెంటనే ఆయనను కలిసి తన (గణపతి ముని) సాధనలో లోపమును గూర్చి బ్రాహ్మణస్వామి (మౌనస్వామిని) అడిగారు.

మౌనస్వామి మౌనాన్ని వీడి సమాధానం చెప్పారు. ఆ ఉపదేశం గణపతి హృదయాన్ని కదిలించింది. ఆనంద భరితం చేసింది.

అప్పటికప్పుడు కదలని రథాన్ని కదిలించిన మహనీయునిగా అనగా గణపతి మునిని చూడటానికి జనం వచ్చారు.

అప్పుడు గణపతి ఆ జనంతో “ఈ స్వామి (మౌనస్వామి, బ్రాహ్మణస్వామి) లోక గురువుగా అవతరించగా దివ్యమూర్తి. కావున నేను ఈయనను భగవాన్ శ్రీరమణ మహర్షి అను నామధేయ మేర్పరచితిని. మీ రింక ఈయనను భగవాన్ అనియే సంబోధించగలరు.

మీరందరును రమణ నామ స్మరణముచే ధన్యులగుదురు గాక! ఇందులకు మనకు సహాయమగుటకు ఈ క్షేత్ర దేవత అయిన సహాయవల్లిని ప్రార్ధింతుము” అన్నారు గణపతి ముని.

గణపతి ముని రమణులను భగవాన్ అంటే, భగవాన్ గణపతి మునులను నాయనా అనేవారు.

నామకరణ దినం 18 – 11 – 1907.

వారిని స్మరింతుము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles