Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
1984 నవంబరులో ఢిల్లీకి చెందిన కాన్‌సా అనే వ్యక్తి బ్రీఫ్‌కేసును పోగొట్టుకున్నాడు.
కారును రెడ్ ఫోర్టు ముందు పార్కుచేశాడు. కానీ బ్రీఫ్‌కేస్ ద్యాసను మరచి చాందినీ చౌక్‌లో ఉన్న ఇంటికి బయలుదేరాడు.
ఒకటి, రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళాక గుర్తుకొచ్చింది బ్రీఫ్‌కేసును నేలమీద పెట్టి, కారు తలుపు తెరచి, మరల తీసుకోలేదని. గుండె గుభేల్మంది.
అందులో ఆఫీసు తాళంచెవులు, విలువైన కాగితాలు ఉన్నాయి. అప్పుడు ఆయన మనోవేదనను ఎవరు వర్ణించగలరు.
ఆయనే ఇలా చెప్పాడు:
”ఎంతతి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనవలయునో అని భీతిచెందితిని. నేను చాల మానసిక క్షోభను అనుభవిస్తూ కన్నీటిపర్యంతమై సాయినాథుడు జ్ఞప్తికి వచ్చుట ఆనందకరమే.
చావు బ్రతుకులలో ఉన్నప్పుడు కాశీరాం తనను ఆసుపత్రికి తీసుకుపొమ్మనక సాయి వద్దకు తీసుకు పొమ్మంటాడు.
దాము అన్నా కాసార్ పెద్ద కొడుకు తాను మధురలోనే మరణించినట్లయితే, కళేబరాన్ని షిరిడీకి తీసుకు పొమ్మంటాడు.
ఏమి చేసినా సాయియే చేయాలని ఆ భక్తుల కోరిక. అటులనే కాన్‌సా ప్రార్ధించగా, వెనుకకు మరలి కారును పార్కు చేసిన స్థలము వద్దకు పొమ్మని ఆదేశం వచ్చింది.
వెంటనే ఆయన అక్కడకు చేరాడు. అయినా అరగంట పట్టింది”.
”నన్ను సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుచూ, నా బ్రీఫ్‌కేసు నేను పెట్టిన చోటనే ఉంది.
ఆ పెట్టెను తీసుకుని దగ్గరలోనున్న లోడు కాలనీలో గల శ్రీ సాయి మందిరమునకు పోయి సాయికి కృతజ్ఞతాపూర్వక ప్రణామాలు అర్పించితిని. షిరిడీకి వెళ్ళి సాయిని దర్శించితిని” అన్నారు కాన్‌సా.
పోగొట్టుకున్న వాటిని లభ్యం చేస్తాడు సాయి. అందుకోసం సాయిని ప్రార్ధించటం సబబే.
ఇంకొక అడుగు ముందుకు వేసి ఆలోచిస్తే ఈ విలువైన జీవిత కాలపు విలువ తెలియక దానిని పోగొట్టుకుని మరల జనన మరణ చక్రంలో పడుతున్నాం అనిపిస్తుంది.
పోగొట్టుకున్న కాలాన్ని తిరిగి పొందలేము. ముందు కాలాన్ని సద్వినియోగం చేసుకునే మనస్సును ప్రసాదింపమని సాయిని ప్రార్ధిద్దాం.
గతించిన కాలాన్ని తప్ప మిగతా వేటినైనా సాయి తిరిగి మనకు దక్కిస్తాడు. కాబట్టి కాలాన్ని సాయి సేవకే అంకితం చేద్దాం!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఎప్పుడు మనల్ని విడిపోని వారినే మన స్నేహితులుగా ఎన్నుకోవాలి
- నిర్ణేత సాయి …..సాయి@366 సెప్టెంబర్ 23….Audio
- ఏది సబబు? …..సాయి@366 మే 2….Audio
- ఏది శాశ్వతం? …. మహనీయులు – 2020… నవంబర్ 29
- “సాయి సచ్చరిత్ర” జయంతి…..సాయి@366 నవంబర్ 26….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments