Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నింబార్కా చార్యుల వారిని తెలుగు వారంటారు. ఆయన జన్మ దినం కార్తీక పూర్ణిమ. అయితే తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన ప్రదేశాలు వేరు వేరుగా భావిస్తారు పరిశీలకులు.
రామానుజాచార్యుని వలె, త్రైలింగస్వామి వలె, వల్లభాచార్లు వలె, నిబార్కాచార్యులు కూడా తెలుగు వారే.
ఈయన సాంప్రదాయాన్ని హంస సాంప్రదాయమని, దేవర్షి సాంప్రదాయమని, సనకాది సాంప్రదాయమని అంటారు.
నింబార్కుఆచార్యులను నింబాదిత్య అని, నియమాచార్యులని, హరిప్రియాచార్యులని పిలుస్తారు. ఈయనను సూర్యుని అవతారమంటారు.
అరుణిముని, హరిప్రియలకు జన్మించిన నియమారాచార్యుల బాల్యంలో బ్రహ్మ మారు వేషంలో సన్యాసిగా వచ్చాడు.
ఆ సమయంలో తండ్రి లేకుండుటచే, తల్లియే సన్యాసిని స్వాగతించింది. ఆ సన్యాసి తనకు ఆకలిగా ఉన్నదనియు, తినుటకు ఆహారమును అడిగాడు. అప్పటికి అందరి భోజనములు పూర్తి అయినవి.
పదార్దములు ఏమియును లేవు. ఇంక సూర్యాస్తమయము కానున్నది – కుటీరములో ఫలాదులు కూడా లేవు. ఆ ఇల్లాలికి ఏమి చేయుటకు పాలుపోలేదు. ఆమె మౌనంగా ఉండిపోయింది.
ఇక ఆ సన్యాసి వెడలిపోవుటకు తయారవుతున్నారు. నియమాచార్యుడు అప్పుడు తల్లితో “అమ్మా! సన్యాసి నిరాహారిగా వెడలిపోయినచో అతిధి ధర్మమును ఉల్లంఘించిన వారమగుదుము” అన్నాడు.
“నేను మాత్రము ఏమి చేసేది? సూర్యాస్తమయము కానున్నది. సూర్యాస్తమయమయిన తరువాత భుజించరు కదా?” అని తల్లి అన్నది.
“అమ్మా, నీవు వంటను పూర్తి చేసి, భోజనము సంపూర్తిగా ఆయన తిను వరకును సూర్యాస్తమయము కాదు. వంటను తయారు చేయుము” అన్నాడు తల్లితో, సన్యాసితో “నేను ఇప్పుడే ఫలములను తెచ్చెదను వేచి యుండండి” అని చెప్పినాడు నియమాచార్యుడు.
నియమాచార్యుడు తన సుదర్శన చక్రమును ఆకాశములోనికి పంపినాడు.
తల్లి వంట చేసినది.
తనయుడు ఫలములను తెచ్చినాడు.
సన్యాసి సంతోషముతో భోజనము పూర్తి గావించాడు.
సుదర్శన చక్రము తిరిగి యధాస్థానమునకు పోయినది.
చీకటి క్రమ్ముకుంది – రాత్రి అయినది.
సన్యాసి తన నిజ స్వరూపమును చూపి నియమాచార్యుని మెచ్చుకొని బోధ చేసి మాయమయ్యాడు.
వ్రజ భూమి పరిక్రమ, భాగవత, రాధాకృష్ణులకు ఈ సాంప్రదాయం ప్రాముఖ్యత ఇస్తుంది.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- మరో బుద్ధుడు …. మహనీయులు – 2020… నవంబర్ 4
- గోవింద రాం రాం గోపాల హరి హరి … మహనీయులు – 2020 – జనవరి 13
- ఎచట నుండి వీచెనో …. మహనీయులు – 2020… మార్చి 13
- రామ లీల … మహనీయులు – 2020… జూలై 25
- బాబా అతనిని సమృద్ధిగా ఆశీర్వదించారు–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments